ఇంజరం

ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండల గ్రామం

ఇంజరం, కాకినాడ జిల్లా, తాళ్ళరేవు మండలానికి చెందిన గ్రామం.[2]..

ఇంజరం
పటం
ఇంజరం is located in ఆంధ్రప్రదేశ్
ఇంజరం
ఇంజరం
అక్షాంశ రేఖాంశాలు: 16°44′20.36″N 82°10′42.46″E / 16.7389889°N 82.1784611°E / 16.7389889; 82.1784611
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకాకినాడ
మండలంతాళ్ళరేవు
విస్తీర్ణం4.97 కి.మీ2 (1.92 చ. మై)
జనాభా
 (2011)
4,722
 • జనసాంద్రత950/కి.మీ2 (2,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,373
 • స్త్రీలు2,349
 • లింగ నిష్పత్తి990
 • నివాసాలు1,341
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533464
2011 జనగణన కోడ్587737

ఇది మండల కేంద్రమైన తాళ్ళరేవు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కాకినాడ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4, 468.[3] ఇందులో పురుషుల సంఖ్య 2, 226, మహిళల సంఖ్య 2, 242, గ్రామంలో నివాసగృహాలు 1, 141 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1341 ఇళ్లతో, 4722 జనాభాతో 497 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2373, ఆడవారి సంఖ్య 2349. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1399 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 75. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587737[4].

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామం.యానాం సమీపంలో ఉంది. ఇది పచ్చటి పొలాలతో గోదావరీ తీరంతో శోభాయమానంగా ఉంటుంది. పరదేశమ్మ తల్లి ఈ గ్రామ దేవత. ఉమా కృపేశ్వర స్వామి దేవస్థానం, రుక్మిణి సత్యభామా సమేత మదనగోపాల స్వామి దేవస్థానం, విజయ గోపాల స్వామి దేవస్థానం, షిరిడీ సాయిబాబా దేవస్థానం, ధనమ్మ తల్లి దేవస్థానం మొదలైన దేవాలయాలు ఉన్నాయి.

ఆంధ్రదేశంలో విశాఖపట్నం, మాధవాయపాలెంల తర్వాత మూడో వాణిజ్యకేంద్రంగా 1708లో బ్రిటీషువారు ఇంజరంలో ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.[5] 1757లో బుస్సీ ఆధ్వర్యంలో ఫ్రెంచివారు దాన్ని ఆక్రమించుకున్నారు. కానీ అది 1759లో ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని కోల్పోయిన తర్వాత ఇంజరంలోని ఫ్యాక్టరీ తిరిగి బ్రిటీషువారి చేతికి వచ్చింది.[6] ఇంజరంలో రెండువేల మంది నేతపని వారు డచ్చివారికి, ఏడువందల మంది బ్రిటీషువారికి పనిచేసేవారు.[7] ఇంజరంలో దేశంలోనే నాణ్యమైన బట్టలను నేసేవారు.1827లో ఫ్యాక్టరీ మూతపడేవరకు ఇక్కడ బ్రిటీషు వాణిజ్య రెసిడెంటు, ఆయన సిబ్బంది ఉండేవారు. ఆ తరువాత ఇంజరం వాణిజ్య కేంద్రంగా ప్రాముఖ్యత కోల్పోయింది. ఐరోపావాసులు నివసించిన ఆనవాళ్లు ఏమీ మిగలలేదు.[8]

భౌగోళిక మార్పులవల్ల అనేక వరదలు, ఉప్పెనలు వచ్చేవి. యానాంకి ప్రక్కగ్రామం ఇంజరం రెండుగా విడిపోయింది. ఇప్పటికినీ పాత ఇంజరం నదికి ఒక గట్టున, ఇంజరం ఒక గట్టున ఉన్నాయి. ఇంజరం ఒక చిన్న జమిందారీకి ముఖ్యస్థానము. ఈ జమిందారీలో ఇంజరంతో పాటు మరో రెండు గ్రామాలున్నాయి (కోరంగి, నీలపల్లె) . ఇది పూర్వపు పెద్దాపురం జమిందారీలో భాగంగా ఉండేది. అయితే ప్రస్తుతము జమిందార్లు ఉంటున్న కుటుంబం ఈ మూడు గ్రామాలను 1845లో పెద్దాపురం సంస్థానం నుండి కొనుగోలు చేశారు. జమీందారీ యొక్క సాలీనా పేష్‌కష్ 2, 832 రూపాయలు.

గ్రామ ప్రముఖులు

మార్చు

ఇంజరంలో జన్మించిన కొందరు ప్రముఖుల వివరాలు. ఇంజరంలో జన్మించిన విద్వత్కవిపండితులలో ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి గారొకరు. వారు కవిగానే కాకుండా, ఆదర్శ దేశికోత్తములుగాను, ప్రఖ్యాత రచయితగాను, జ్యోతిష, వైద్య, వాస్తు శాస్త్ర పండితులుగాను ప్రఖ్యాతి నార్జించారు. వారు సాహిత్యంలో జాతి రత్నమని చెప్పాలి. తెలుగు సాహిత్యంలో రామాయణ, మహాభారత, మహాభాగవతముల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ గ్రంథం కథా సంత్సాగరం. దీనికి మాతృక గుణాఢ్యుని బృహత్కథ.

ఆంధ్రదేశపు జమీందారు, ప్రముఖ చిత్రకారుడు నందికోళ్ల గోపాలరావు, వీరి రంగుల తైలవర్ణ చిత్రాలు మహారాజుల ప్రశంశలనందుకున్నాయి. వీరి స్వస్థలం ఇంజరం. వీరు బ్రిటిష్ వారి కాలంలో ఇంజరం మునసబుగా కూడా పనిచేశారు. వీరు ఇంజరం పరదేశమ్మ ఆలయానికి భూరి విరాళాలిచ్చారు.

ప్రముఖ కవులైన మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈ గ్రామంలో పూర్వమున్న సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసించారు.

వేదం

పాలంకి వీరావధానులు, రామడుగుల వేంకట సోమయజులు, కొలచిన వేంకటావధానులు, ఆకొండి నేరెళ్ల శాస్త్రి

జ్యోతిష్యం

ఆకొండి వ్యాసమూర్తి సిద్దాంతి, చెన్నుభొట్ల భీమయ్య, పాలంకి రామమూర్తి సిద్దాంతి. సాలిగ్రామ భీమశంకరం

సంగీతం

వేదుల శంకర దాసు, మహేంద్రవాడ బాపన్న శాస్త్రి, మహేంద్రవాడ కామేశ్వర రావు, మహేంద్రవాడ కామన్న.మహేంద్రవాడ సుబ్బారావు

ఆయుర్వేదం

దుడ్డు రామ మూర్తి, దుడ్డు రాజయ్య

సాహిత్యం

ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి, సాలగ్రామ చింతామణి, సాలగ్రామ సూర్య నారాయణ శాస్త్రి, శృంగారకవి పల్లంరాజు మంత్రి, శృంగారకవి సర్వారాయ కవి, శృంగారకవి వేంకట రామయ్య.

చిత్రలేఖనం

నందికోళ్ళ గోపాల రావు, నందికోళ్ళ వేంకటరెడ్డి నాయుడు.

స్వాతంత్ర్య సమర యోధులు

సాలగ్రామ వెంకయ్య, కాకరపర్తి వీర వేంకట సత్యనారాయణ మూర్తి, ఖాసిం ఖాన్.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప బాలబడి యానాంలో ఉంది.

సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల సుంకరపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల తాళ్ళరేవులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కాకినాడలోను, పాలీటెక్నిక్ యానాం, కాకినాడ లోనూ ఉన్నాయి.

సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం యానాంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడ లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

ఇంజరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలోం ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు, ఒక నాటు వైద్యుడు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది.

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

ఇంజరంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. దూరంలో యానాంలో ఉన్నాయి.

లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం (సి ఎస్ సి కామన్ సర్వీసెస్ సెంటర్), మీసేవ కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది.

గ్రామానికి రామచంద్రపురం, యానాం నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, హైదరాబాద్ నుండి ఇంజరం మీదుగా యానాం ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీపంలో యానాం నుండి హైదరాబాద్ కు అనేక ప్రైవేటు బస్సులు, కాకినాడ, విశాఖపట్నం, టెక్కలి, పాలకొండ, అమలాపురం, రాజోలు ప్రాంతాలకు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు కలవు, సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.

సమీపంలో రైల్వే స్టేషన్ గ్రామం నుండి 33 కి.మీ. దూరంలో కాకినాడలో ఉంది.

102 నెంబరు గల ద్వారపూడి - యానాం రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. 216 నెంబరు గల కత్తిపూడి - ఒంగోలు జాతీయ రహదారి గ్రామం నుండి 3 కి.మీ. దూరంలో సుంకరపాలెం వద్ద ఉంది.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ( యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉంది, ఐ డి ఎఫ్ సి బ్యాంకు వారి బ్యాంకు మిత్ర కేంద్రం (మైక్రో ఏ టి ఎం) ఉంది. గ్రామంలో నేత కార్మికుల యొక్క ఇంజరం చేనేత సహకార ఉత్పత్తి & విక్రయ సంఘం,సహకార బృందం, పౌర సరఫరాల కేంద్రాలు, వారం వారం సంత ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 3 కి.మీ. లోపు దూరంలో ఉంది.

సహకార బ్యాంకు గ్రామం నుండి 3 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామంలో రెండు ఏ టి ఎం లు, ఒక మైక్రో ఏ టి ఎం ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ. దూరంలో యానాంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది, విద్యుత్ ఉప కేంద్రం ఉంది. రోజుకు 6 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

ఇంజరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 55 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 27 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 55 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 359 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 359 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

ఇంజరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 359 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

ఇంజరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి. చేనేత వస్త్రాలు(HANDLOOMS SAREES)

పంటలు

మార్చు

వరి

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-06.
  4. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  5. Madras: The presidency; mountains, lakes, rivers, canals, and historic areas; the east coast and Deccan districts, Madras City, and Chingleput district
  6. Lists of the Antiquarian Remains in the Presidency of Madras, Volume 1
  7. History of modern Andhra Pradesh - P. Raghunadha Rao
  8. Godavari district gazetteer - F. R. Hemingway
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంజరం&oldid=4249791" నుండి వెలికితీశారు