శృతి హెగ్డే భారతీయ వైద్యురాలు. కర్ణాటకాకు చెందిన ఆమె అంతర్జాతీయ అందాల పోటీ టైటిల్ విన్నర్ కూడా.[1] 2024 జూన్‌ 6 నుండి 10 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన అందాల పోటీలో భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌గా కిరీటాన్ని గెలుచుకుంది.

శృతి హెగ్డే
జననం
హుబ్లీ, కర్ణాటక
జాతీయతభారతీయురాలు
వృత్తివైద్యురాలు, అందాల పోటీ విజేత
తల్లిదండ్రులుడా.కృష్ణ హెగ్డే (తండ్రి), కమల (తల్లి)
బంధువులుడా.సతీష్ (సోదరుడు)

అయిదడుగుల ఆరంగుళాలు, అంతకన్నా తక్కువ ఎత్తుండే మహిళల కోసం ఏటా ఈ పోటీలు జరుగుతాయి. 2009 నుంచి నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో భారతీయ మహిళలు కూడా పాల్గొంటున్నారు. అయితే, ఇప్పటివరకు ఎవరు కిరీటం గెలవలేదు.[2]

కెరీర్

మార్చు

కర్ణాటకలోని హుబ్లీలో ఆమె పుట్టి పెరిగింది. ఆమె పాఠశాల విద్యతో పాటు శాస్త్రీయ సంగీతం, భారతీయ శాస్త్రీయ నృత్యం అభ్యాసంలోనూ రాణించింది. డెర్మటాలజీలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె, అదే విభాగంలో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌ చేస్తోంది. మరోవైపు స్థానిక ఆస్పత్రిలో చర్మ వైద్య నిపుణురాలిగానూ సేవలు అందిస్తోంది.

ఆమె డాక్టర్‌గా పనిచేస్తూనే మరోవైపు మోడల్‌గా ఎదగాలనుకుంది. దీంతో ఆమె 2018 మిస్ ధార్వాడ్ పోటీకి సైన్ అప్ చేసింది. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం అందాల పోటీలకు దూరంగా ఉన్నా ఆమె మిస్‌ ఆసియా ఇంటర్నేషనల్ ఇండియా 2023 రెండో రన్నరప్‌గా నిలిచింది. జూన్‌ 2024లో భారతదేశపు తొలి మిస్ యూనివర్సల్ పెటైట్‌ కిరీటం కైవసం చేసుకుంది.

ఆమె భారతదేశంలోనే కాక మాల్దీవులు, దుబాయ్, భూటాన్ వంటి దేశాలలో వెయ్యికి పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె కన్నడ బాషా టెలివిజన్ దారావాహికలు, కొన్ని సినిమాలలోనూ నటించింది. శరనార శక్తి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె జనుమదాత లోనూ నటించింది.

మూలాలు

మార్చు
  1. "వైద్యురాలు కమ్‌ మోడల్‌: తొలి మిస్‌ యూనివర్స్‌ పెటిట్‌గా కన్నడ బ్యూటీ! | Meet Shruti Hegde Indias First Miss Universe Petite | Sakshi". web.archive.org. 2024-07-28. Archived from the original on 2024-07-28. Retrieved 2024-07-28. {{cite web}}: no-break space character in |title= at position 62 (help)CS1 maint: bot: original URL status unknown (link)
  2. "డాక్టర్.. యాక్టర్.. మోడల్.. అందాల రాణి.. అన్నీ తనే". EENADU. Retrieved 2024-07-28.