ఫ్లోరిడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఒక రాష్ట్రము. ఫ్లోరిడా అమెరికా రాష్ట్రాలలో ఆగ్నేయంగా ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రపు పడమర దిశలో మెక్సికో ఖాతం, ఉత్తరంలో అలబామా రాష్ట్రం, జార్జియా రాష్ట్రం, తూర్పున అట్లాంటిక్ మహా సముద్రం ఉన్నాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాలలో ఫ్లోరిడా వైశాల్యంలో 22వ స్థానంలోనూ, జనసంఖ్యలో 4వ స్థానం లోనూ అలాగే జనసాంధ్రతలో 8వ స్థానంలోనూ ఉంది.

ఫ్లోరిడా
దేశంసంయుక్త రాష్ట్రాలు
రాష్ట్రం ఏర్పడుటకు ముందుఫ్లోరిడా భూభాగం
యూనియన్ లో ప్రవేశించిన తేదీమార్చి 3, 1845 (27 వ)
అతిపెద్ద నగరంజాక్సన్విల్లే
అతిపెద్ద మెట్రోమయామి
Government
 • గవర్నర్రిక్ స్కాట్ (R)
 • లెప్టినెంట్ గవర్నర్జేన్నిఫెర్ కార్రోల్ (R)
Legislatureఫ్లోరిడా శాసనసభ
 • ఎగువ సభసెనేట్
 • దిగువ సభప్రతినిధుల సభ
U.S. senatorsబిల్ నెల్సన్ (D)
మార్కో రూబియో (R)
U.S. House delegation19 రిపబ్లికన్లు, 6 డెమోక్రాట్లు (list)
Population
 • Total1,90,57,542 (2,011 est)[1]
 • Density353.4/sq mi (136.4/km2)
భాష
 • అధికార భాషఇంగ్లీష్
 • మాట్లాడే భాషఇంగ్లీష్ 74.54%
స్పానిష్ 18.65%
Trad. abbreviationFla.
అక్షాంశం24° 27′ N to 31° 00' N
రేఖాంశం80° 02′ W to 87° 38′ W
ఫ్లోరిడా State symbols
The Flag of ఫ్లోరిడా.

Animate insignia
ఉభయ చరాలు Barking tree frog
పక్షి/పక్షులు ఉత్తర మొకింగ్
సీతాకోకచిలుక Zebra Longwing
చేప ఫ్లోరిడా లర్జ్మౌత్ బస్
పూవు/పూలు ఆరెంజ్ మొగ్గ
క్షీరదాలు Florida panther, Manatee, Bottle-nosed dolphin, Florida Cracker Horse
సరీసృపం American Alligator, Loggerhead turtle
వృక్షం Sabal Palmetto

Inanimate insignia
పానీయం Orange juice
ఆహారం Key lime pie, Orange
రత్నం Moonstone
శిల agatized Coral
ముత్యపుచిప్ప Horse conch
మట్టి Myakka
పాట(లు) "హోం పాత ఫోల్క్స్"

Route marker(s)
ఫ్లోరిడా Route Marker

State Quarter
Quarter of ఫ్లోరిడా
Released in 2004

Lists of United States state insignia

అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో ఖాతం మధ్య ఉన్న ద్వీపకల్పంలోనే ఫ్లోరిడా రాష్ట్రంలోని అధిక భాగం ఉటుంది. ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యం 1,350 చదరపు మైళ్ళు. అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో ఖాతం మధ్య ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. రాష్ట్రంలో అధిక భాగం సముద్రమట్టానికి సమానంగా ఉంటుంది. ఈ రాష్ట్రపు నేలను అవక్షేపిత నేలగా వర్గీకరించారు. రాష్ట్రంలోని ఉష్ణోగ్రతలు విభిన్నంగా ఉంటాయి. ఉత్తర భూభాగంలో ఉపఉష్ణమండల ఉష్ణోగ్రత దక్షిణ భూభాగంలోఉష్ణమండల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రాష్ట్ర జంతు చిహ్నం అమెరికన్ అలిగేటర్ అనబడే పెద్ద మొసలి, ఫ్లోరిడా చిరుత, మనటీ అనే సముద్ర జీవి. వీటిని ప్రపంచప్రసిద్ధమైన ఎవర్జిలేడ్స్ జాతీయ ఉద్యానవనంలో చూడవచ్చు.

1513 లో మొదటి యురేపియన్ ఒప్పందం పూర్తికాగానే స్పానిష్ సాహస యాత్రికుడు జువాన్ ఫోన్స్ డే లియోన్ ఈ నగరానికి లా ఫ్లోరిడా (పూల భూమి)అని నామకరణం చేసాడు. ఆయన ఇక్కడకు ఈస్టర్ సమయంలో ప్రవేశించాడు. 1845లో రాష్ట్రహోదా లభించే వరకు ఫ్లోరిడా యురేపియన్ శక్తులకు ఒక సవాలుగానే ఉండిపోయింది. అమెరికన్ అంతర్య్ద్ధం తరువాత ఇండియంస్, ఇతర స్థానిక జాతుల మధ్య విభేదాలు కలిగించి విడదీయడానికి ఫ్లోరిడా ప్రధాన వేదిక అయ్యింది. ప్రస్తుతం ఫ్లోరిడా అత్యధిక హిస్పానిక్ జాతి ప్రజలు నివసిస్తున్న రాష్ట్రంగా, అత్యధికంగా జనసంఖ్య అభివృద్ధి చెందడం, అలాగే ఫ్లోరిడా పర్యావరణ ఆందోళనలకు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఫ్లోరిడా ఆదాయం పర్యాటకం, వ్యవసాయం, రవాణాలతో (19వ శతాబధం నుండి అభివృద్ధి చేయబడింది)ప్రభావితమై ఉంటుంది. ఫ్లోరిడా అమ్యూజ్మెంట్ పార్కులకు, ఆరంజ్ ఉత్పత్తికి, కెన్నడీ స్పేస్ కేంద్రానికి కూడా ప్రత్యేక గుర్తింపును పొంది ఉంది.

ఫ్లోరిడా సంస్కృతి పలు సంప్రదాయాల కలయికకు అద్దం పడుతుంది. స్థానిక అమెరికన్లు, యురేపియన్ అమెరికన్లు, హిస్పానిక్, ఆఫ్రికన్ అమెరికన్లు భవన నిర్మాణాలలోనూ ఆహారరంగంలోనూ కనిపిస్తుంటారు. మార్జోరీ కిన్నన్ రాలింగ్స్, ఎర్నెస్ట్ హెమింగ్వే, టెన్నెస్సీ విలియమ్స్ వంటి రచయితలను ఎక్కువగా ఆకర్షించింది. ఈ ఆకర్షణ ఇంకా అలా ప్రజాదరణ పొందిన వారిని, క్రీడా కారుల వరకూ కొనసాగుతూ ఉంది. ఫ్లోరిడా టెన్నిస్, గోల్ఫ్, ఆటో పందాలు, జల సంబంధ క్రీడలకు అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉంది.

చరిత్ర మార్చు

పురావస్తు పరిశోధనలు ఫ్లోరిడాలో మొదటగా నివసించిన వారు పాలియో -ఇండియన్లు అని తెలియజేస్తున్నాయి. వీరు అమెరికాలో మొదట నివసించిన వారని సుమారు 14 వేల సంవత్సరాలకు ముందు నుండి నివసిస్తున్నారని భావిస్తున్నారు. ప్రాచీన కాలం (క్రీ. పూ 2000 నుండి) ఈ ప్రదేశంలో మానవులు నివసిస్తున్నారని భావిస్తున్నారు. క్రీ. పూ 500 తరువాత ముందు ఉన్న సంస్కృతికి సంబంధించిన అదే మాదిరి సంస్కృతి ఆరంభమై విభిన్నమైన ప్రాంతీయ సంస్కృతులతో పరస్పర సహకారాలతో కలిసి పోయింది. చారిత్రక ఆధారాలు 16వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి. ఇక్కడ వరుసగా అపలచి (ఫ్లోరిడా పాన్ హేండిల్), ది తింక్యూ (ఉత్తర, మధ్య ఫ్లోరిడా), ది అయిస్ (అంట్లాంటిక్ తీరం మధ్యలో), టొకోబాగా (టంపా బే ఏరియా), ది కల్యూసా (వాయవ్య ఫ్లోరిడా), టెక్యుస్టా (ఆగ్నేయ ఫ్లోరిడా) మొదలైన ప్రాచీన స్థానిక జాతులు నివసించారు.

ప్రస్తుత యునైటెడ్ స్టేట్స్ భూభాగంలో యురేపియన్లు మొదటిసారి సందర్శించిన భూభామే ఫ్లోరిడా. స్పానిష్ సాహసయాత్రికుడు జువాన్ ఫోన్స్ డే లియోన్ తో మొదటి వారని భావించే యురేపియన్లు ఈ భూభాగం మీద అడుగు పెట్టారు. వారు ఈ భూభాగంలో 1513 ఏప్రిల్ 2 న చేరుకున్నారు. ఫోన్స్ డే లియోన్ ఈ ప్రాంతానికి లా ఫ్లోరిడా (పూల భూమి) అని నామకరణం చేసాడు. ఈ పేరు పెట్టడానికి అప్పుడు ఈస్టర్ సీజన్ కావడం వలన చెట్లన్నీ పుష్పించి ఉండడం ఒక కారణం. ఫోన్స్ డే లియో ఇక్కడి భూభాగంలో అడుగుపెట్టిన మొదటి యురేపియన్ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. 1553 నాటికి ఫోన్స్ డే లియో ఇక్కడికి అడుగు పెట్టిన సమయంలో అతనికి ఒక స్పానిష్ మాట్లాడే వ్యక్తి అయినా ఎదురై ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. 1513 నుండి ఈ భూమి లా ఫ్లోరిడా అని పిలువబడుతూ వచ్చింది. తరువాత 1630, 18వ శతాబ్దం అంతా అలానే పిలువబడుతూ వచ్చింది. తరువాత డచ్ కార్టోగ్రాఫర్ హెస్సల్ గెరిట్జ్ ఇన్ జోయంస్ డీ లేట్స్ యొక్క హిస్టరీ ఆఫ్ ది న్యూ వరల్డ్ లో ఫ్లోరిడా ద్వీపకల్పానికి టెగెస్టా (తరువాత టెక్యుస్టా జాతి) అనే ప్రత్యామ్న్యాయ పేరు సూచింపబడింది.

తరువాత శతాబ్దంలో స్పానిష్, ఫ్రెంచ్ వారిద్దరూ వివిధ స్థాయిలలో విజయవంతంగా ఫ్లోరిడాలో వలస రాజ్యాలు స్థాపించుకున్నారు. 1559 లో ప్రస్తుత పెంస్కోలా ప్రాంతంలో ఒక డాన్ ట్రిస్టాన్ దే లూనా వై ఆర్లానో ఒక కాలనీ స్థాపించాడు. అమెరికా ఖండంలో ఇది మొదటి యురేపియన్ వలసగా గుర్తించబడింది. 1561 లో సంభవించిన తుఫాను తరువాత కరువుతో బాధపడుతున్న సమూహాల చేత అది వదిలి వేయబడింది. 1690 వరకు ఈ ప్రాంతంలో తిరిగి ప్రజలు నివసించ లేదు. 1564 లో ప్రస్తుత కాక్సంవిల్లే ప్రాంతంలో ఫ్రెంచ్ ప్రొటెస్టెంట్ హ్యూగ్నాట్స్ ఫోర్ట్ కరోలిన్ రేవును స్థాపించాడు. తరువాత సంవత్సరం సెయింట్ అగస్టిన్ స్పానిష్ కాలనీ స్థాపించి అదే సంవత్సరంలో ఫోర్ట్ కరోలిన్ స్వాధీనానికి పోరాటం సాగించారు. ప్రాంతీయ ప్రజలను క్రైస్తవ, రోమన్ కాథలిక్కు సన్యాసుల ద్వారా మార్చడం వలన స్పానిష్ వారు ఆప్రాంతం మీద కొంత పట్టును సాధించారు.

ఫ్లోరిడాలో ఉత్తర ప్రాంతంలో ఇంగ్లీష్ కాలనీలు అలాగే పడమటి దిశలో ఫ్రెంచ్ వారి కాలనీలు స్థాపించబడిన తరువాత స్పానిష్ ప్రదేశం తగ్గుతూ వచ్చింది. ఆంగ్లేయులు అక్కడి వారికి ఆయుధాలను సరఫరా చేసి స్పానిష్ వారిని వారి అనుయాయులను అక్కడ నుండి పంపించమని వత్తిడి తీసుకు వచ్చారు. ఆంగ్లేయులు సెయింట్ అగస్టిన్ మీద దండెత్తి నగరాన్ని క్లాద డ్రల్ చర్చిని పౌరులు కాస్టిల్లో డే శాన్ మార్కోస్ కోట గోడల చాటున దాక్కుటూ గడుపుతుండగా పలుమార్లు పూర్తిగా ధ్వంసం చేసారు.

ఫ్లోరిడా బ్రిటన్ -ఆక్రమిత ఉత్తర అమెరికాలో బానిసత్వం వదిలించుకుని స్వతంత్రంగా జీవించాలని అనుకుంటున్న ఆఫ్రికన్లను అమెరికన్ ఆఫ్రికన్లను అధికసంఖ్యలో ఆకర్షిస్తుంది. ఒకప్పుడు స్పానిష్ ప్రభుత్వం వారిని రోమన్ కాథ్సలిక్కులుగా మార్చి వారికి స్వాతంత్ర్యం ఇచ్చింది. పాత బానిసలు కొంత మంది సమూహంగా సెయింట్ గస్టిన్ కు ఉత్తరంగా స్థిరపడ్డారు. గ్రాషియా రియల్ డి శాంటా తెరెసా డి మోస్ వద్ద ఉన్న ఈ ప్రాంతం మొదటిసారిగా అమెరికాలో ఈ తరహా స్థిరపడిన ప్రాంతమని భావిస్తున్నారు. క్రీక్, సెమినోల్ స్థానిక అమెరికన్లు వీరిని స్వాగతించారు. క్రీక్, సెమినోల్ తెగలను స్పెయిన్ ప్రభుత్వం వారిని అక్కడకు పిలిపించి వారు అక్కడ స్థిరపడాడానికి కావలసిన వసతులు సమకూర్చారు.

గ్రేట్ బ్రిటన్ ఫ్లోరిడా మీద ఆధిపత్యం సాధించింది తరువాత 1763 నాటికి పీస్ ఆఫ్ పారిస్ పేరిట రాజ్యాంగపరమైన ఒప్పందం జరిగింది. బ్రిటిష్ ఫ్లోరిడాలో వారి కొత్త కొనుగోళ్ళను ప్రారంభించింది. బ్రిటన్ తన పెట్టుబడులను సెయింత్ అగస్టిన్, పడమటి ఫ్లోరిడా, పెంసకోలా లకు కొంత మరల్చింది. బ్రిటన్ ఫ్లోరిడాని అభివృద్ధి చేయడానికి విదేశాల నుండి కూలీలను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆ ప్రయత్నం చివరకు విఫలమైంది. అమెరికన్ వలసల ద్వారా బ్రిటన్ ఓడిపోయిన తరువాత స్పెయిన్ ఫ్లోరిడాలో తిరిగి నిలదొక్కుకుంది. ఫలితంగా 1783లో ట్రీటీ ఆఫ్ వేర్సైల్లెస్ (వేర్సైల్లెస్ ఒప్పందం) జరిగింది. ఫలితంగా తూర్పు, పడమర విభాగాలు ఏర్పడ్డాయి. వారు కాలనీలలో స్థిరపడాలనుకున్న వారికి ఎవరికైనా భూమిని మంజూరు చేసారు. తరువాత అనేక మంది అమెరికన్లు ఫ్లోరిడాకు తరలి వచ్చారు.

ఇండియన్ పట్టణాల మీద దాడులు జరిగిన తరువాత తూర్పు ఫ్లోరిడాలో నివసిస్తున్న సెమినోల్ ఇండియన్లు జార్జియా వలసల మీద ప్రత్యేకంగా స్పానిష్ తరఫు వారి మీద దాడులు చేయడం ప్రారంభించారు. యునైటెడ్ స్టేట్స్ సైన్యం స్పానిష్ భూభాగం మీద దాడులను ఉదృతం చేసారు. వీటిలో 1817-1818లో సెమిలోన్ ఇండియన్లతో చేసిన యుద్ధం కూడ్డా ఒక భాగమే. ఆండ్రూ జాక్సన్ నాయకత్వంలో జరిగిన ఈ యుద్ధం సెమిలోన్ ఇండియన్ల మీద జరిగిన మొదటి యుద్ధం అయింది. ఈ యుద్ధానంతరం యునైటెడ్ స్టేట్స్ పూర్తి తూర్పు ఫ్లోరిడా మీద ఆధిపత్యం సాధించింది.

1819 లో ఆడంస్ -అనిస్ ఒప్పందం షరతుల కారణంగా స్పెయిన్ యునైటెడ్ స్టేట్స్ కు 5 మిలియన్ల అమెరికన్ డాలర్లకు మూల్యం తీసుకుని వదిలి వేసింది. అమెరికా ఇలా మూల్యుయం చెల్లించి ల్యూసియానా పర్చేస్ లో టెక్సాస్ భూములను స్వాధీనం చేసుకుంది.

ఇన్ 1830 ది ఇండియన్ రిమూవల్ చట్టం అనుమతించబడింది. తరువాత వలసలు అధికమైయ్యాయి. ఇండియలను ఫ్లోరిడా నుండి ఖాళీ చేయించమని యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం మీద వత్తిడి అధికం అయింది. శ్వేతజాతీయులు, ఇండియన్ల మధ్య కలహం చెలరేగిన కారణం కొత్త వలసలు ప్రవాహంలా ప్రారంభం అయ్యాయి. 1832లో రాష్ట్ర ప్రభుత్వం సెమిలోన్ ముఖ్యులతో ట్రీటీ ఆఫ్ పేంస్ పేరుతో ఒక ఒప్పందందానికి వచ్చారు. వారు వారంతట వారే ఫ్లోరిడా వదిలి పోతే వారికి మిసిసిపి నదికి పశ్చిమంలో తగిన భూములు ఇస్తామని ఆ ఒపాంద సారాంశం. ఈ సారి అనేక మంది సెమిలోన్స్ ఫ్లోరిడా వదిలి వెళ్ళడానికి అనుకూలంగా స్పందించారు. మిగిలిన వారు వారిభూలను స్వాధీనపరచుకునే ప్రయత్నం చేసారు. 1835లో శ్వేతజాతీయుల వత్తిడి కారణంగా యునైటెడ్ సైన్యం రాష్ట్రంలో ప్రవేశించడంతో రెండవ సెమిలోన్ యుద్ధం ఆరంభమై డేడ్ నరమేధంతో ముగిసింది. సంవత్సరాంతంలో చెలరేగిన రెండవ సెమిలోన్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణానికి గురి అయ్యారు. డేడ్ సెమిలోన్ల మీద మెరుపుదాడి చేసి వారిని చంపడం లేక తీవ్రంగా గాయపరచడం వంటివి చేసాడు. మేజర్ డేడ్ ఏడుగురు అధికారులతో ఫోర్ట్ బ్రోక్ (టంపా)నుండి తరలి వచ్చి ఫోర్ట్ కింగును (ఒక్లా)ను బలపరిచి సంయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధంలో పోరాడడానికి 900-1500 మంది సెమిలోన్ ఇండియన్ యోధులన నియమించాడాడు. వారు ఈ నియమనంలో ఏడు సంవ్సరాల కాలం 1842 వరకూ కొనసాగారు. సంయుక్త రాష్ట్రాలు ఈ యుద్ధం కొరకు దాదాపు 20-40 అమెరికన్ డాలర్లను వెచ్చించారని భావించారు. ఆ సమయంలో అది గుర్తించ తగినంత అధిక మొత్తమే.

1861 జనవరి 10 కి ముందే అమెరికన్ అంతర్యుద్ధం మొదలైయ్యే ముందు ఫ్లోరిడా సంయుక్తరాష్ట్రాలతో ఐక్యతకు అనుకూలంగా స్పందించిన తరువాత పది రోజులలో ఫ్లోరిడా సంయుక్త రాష్ట్రాలలో ఒకటిగా అలాగే 27వ రాష్ట్ర్గంగా చేర్చబడింది. 1865లో యుద్ధం ముగింపుకు వచ్చింది. 1868 జూన్ 25 కాంగ్రెస్ రాజ్యంగం స్థాపించబడింది. పునర్నిర్మాణం తరువాత శ్వేత డెమొక్రేట్స్ కొన్నిసంబ్వత్సరాల కాలం అధికారంలో కొనసాగారు. 1885 లో కొత్తరాజ్యాంగ స్థాపన జరిగిన తరువాత 1889 నాటికి రూపొందించబడిన చట్టాలు ఆఫ్రిక అమెరికన్లు, నరుపేద శ్వేతజాయుల ఓటుహక్కు కొన్ని సంవత్సరాల కాలం నిషేధానికి గురి అయింది. పన్ను విధింపు, అక్షరాస్యతా శోధనా, నివాస నిర్ధారణ వంటి ప్రక్రియలు మొదలైయ్యాయి. 1960లో ఫెడరల్ లెజిస్లేషన్ అనేకమంది ఆఫ్రికన్ అమెరికన్ పౌర కక్కుల రక్షణార్ధం ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసేవరకు ఆఫ్రికన్ అమెరికన్ల ప్రాబల్యం తగ్గించే ప్రయత్నాలు కొనసాగాయి.

20వ శతాబ్దం మధ్య వరకూ ఫ్లోరిడాలో అత్యల్ప జనసంఖ్య ఉండేది. 1900 నాటికి రాష్ట్ర జనాభాల 528,542. వీరిలో 44% ఆఫ్రికన్ అమెరికన్లే. ది బాల్ వీవిల్ (పంటలని నాశనం చేసే క్రిమి) పత్తి పంటను నాశనం చేసింది. 20 వ శతాబ్దంలో విచారణ లేకుండా చేసే హత్యలు, జాతి వివక్ష కారణ హింసల కారణంగా అసంఖ్యాకమైన ఆఫ్రికన్ అమెరికన్లు రాష్ట్రం వదిలి ఉత్తర, మధ్య పడమర రాష్ట్రాలలోని పరిశ్రామిక ప్రాంతాలకు తరలి వెళ్ళారు. గొప్ప వలసగా అభివర్ణించబడిన ఈ వలసలో దాదాపు 40,000 మంది వదిలి పోయారు. 1900 నాటి జనాభాలో ఇది 20%. 1920 నాటికి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి అనంతరం రాష్ట్రానికి పర్యాటకుల రాక అధికం అయ్యింది. ఇందుకు అనుబంధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనూహ్యమైన అభివృద్ధి కొనసాగింది. స్వల్పకాలం పాటు కొనసాగిన ఈ ధోరిణి 1926-1928 మధ్య చెలరేగిన తుఫానులు, స్టాక్ మార్కెట్ పతనం, అతి గొప్ప ఆర్థిక వత్తిడి తరువాత ఆగిపోయింది.

రెండవ ప్రపంచ యుద్ధానంతరం వరకూ కోలుకోలేదు. వాతావరణం గాలి కారణంగా విపరీతమైన మార్పులకు గురి ఔతూ వస్తుంది. జీవనవ్యయం తక్కువగా ఉండడం రాష్ట్రాన్ని స్వర్గంగా మార్చింది. రస్ట్ బెల్ట్, వాయవ్య ప్రాంతాల నుండి వలసలు అభివృద్ధి కావడమే కాక జనసంఖ్యలో కూడా అభివృద్ధి కొనసాగింది. సమీప దశాబ్ధంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగ ఉద్యోగాలకు అనేక మంది వలసదారులు వచ్చారు. 2010 జనాభా గణన తరువాత 18 మిలియన్ల జనసంఖ్యతో ఫ్లోరిడా దక్షిణ సంయుక్త రాష్ట్రాలలో అత్యధిక జనసంఖ్య కలిగిన రాష్ట్రంగా మారింది. జనసంఖ్యలో ఫ్లోరిడా టెక్సాస్ తరువాతి స్థానంలోనూ సంయుక్తరాష్ట్రాలలో మూడవ స్థానంలోనూ ఉంది.

భౌగోళికం మార్చు

మెక్సికన్ గల్ఫ్ మధ్యలో ఉన్న ద్వీపకల్పంలో ఫ్లోరిడా రాష్ట్రం ఉపస్థితమై ఉంది. వాయవ్యంలో పాన్ హాండిల్ మాదిగా మెక్సిక గల్ఫ్ తీరంలో విస్తరించి ఉంది. ఈ రాష్ట్రపు సరిహద్దులలో అలబామా, జార్జియా య్న్నాయి. పాన్ హాండిల్ చివర పడమరలో అలబామా ఉంది. పలు కరేబియన్ దేశాలకు ప్రత్యేకంగా బహమాస్, క్యూబాలకు ఇది సమీపంలో ఉంది. మిసిసిపి నదికి తూర్పులో ఉన్న తెద్దరాష్ట్రాలలో ఫ్లోరిడా ఒకటి. ఫ్లోరిడా కంటే జలభాగం అధికంగా రాష్ట్రాలు మిచిగాన్, అలాస్కా.

సముద్రమట్టానికంటే 345 అడుగుల (105 మీటర్లు) ఎత్తులో ఉంది. బ్రిట్టన్ కొండ మాత్రమే ఫ్లోరిడాలో ఎత్తైన కొండగా భావించబడుతుంది. ఫ్లోరిడా యు.ఎస్ రాష్ట్రాలలో అత్య్క్వంత తక్కువ ఎత్తు ఉన్న రాష్ట్రంగా భావించబడుతుంది. రాష్ట్ర దక్షిణప్రాంతంలో ఉన్న ఆర్లెండా అత్యంత దిగువ ప్రాంతంగా భావించబడుతుంది. అయినప్పటికీ క్లియర్ వాటర్ వంటి ప్రాంతాలు నీటిమట్టానికి 50-100 అడుగుల ఎత్తులో ఉంటుంది. మధ్య, ఉత్తర ఫ్లోరిడా సముద్రానికి 25 మైళ్ళ అంతకంటే అధికదూరంలో ఉంటుంది.వరుసగా ఉండే కొండలు 100-250 అడుగుల ఎలివేషన్ కలిగి ఉంటాయి. తూర్పు, దక్షిణంలో లేక్ కౌంటీలో విస్తరించి 312 అడుగుల ఎత్తు ఉన్న సుగార్లోఫ్ పర్వతం ఫ్లోరిడా ద్వీపకల్పంలో ఎత్తైనదిగా భావించబడుతుంది.

సరిహద్దులు మార్చు

రాష్ట్ర సరిహద్దులు అట్లాంటిక్ మహాసముద్రం నుండి మొదలౌతాయి. ఇవి దక్షిణంలో, పడమరర, ఉత్తరంలో మేరీ నది వరకు ఉంది. ఆ నది తాను పుట్టిన ప్రదేశం నుండి పడమర దిశగా ప్రవహించి కొంచెంగా ఉత్తర దిశకు తిరిగి అలబామా, జార్జియాలకు దిగువన ఉన్న ఫ్లింట్ నది, చట్టహూచీ నదులతో సంగమిస్తుంది. అక్కడ నుండి దీనిని అపలోచికోల నదిగా పిలుస్తారు. లేక్ సెమిలోన్ వద్ద ఈ నదీ మీద వుడ్‍రఫ్ ఆనకట్ట నిర్మించబడింది.ఈ సరసు తీరంవెంట జార్జియా సరిహద్దు కొంత దూరం ఉంటుంది. పడమట తీరంలో అలబామా రాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. దక్షిణంలో మెక్సికన్ సముద్రం ఉంటుంది. జల సరిహద్దులు అట్లాంటిక్ మహాసముద్రానికి మూడు నాటికల్ మైళ్ళ వరకు ఉంటుంది. మెక్సికో గల్ఫ్ వద్ద 9 నాటికల్ మైళ్ళ వరకు జలభాగ సరిహద్దులు ఉంటాయి. రాష్ట్రంలో అధిక భాగం సముద్రమట్టానికి సమంగా లేక కొంచెం ఎత్తుగా ఉంటుంది.

వాతావరణం మార్చు

జంతుజాలం మార్చు

ఫ్లోరిడా అనేక వన్యప్రాణులకు పుట్టినిల్లు:

 • సముద్రపు క్షీరదాలు: బాటిల్నోస్ డాల్ఫిన్, చిన్న-ఫిన్నడ్ పైలట్ వేల్, ఉత్తర అట్లాంటిక్ కుడి వేల్, వెస్టిండీస్ మనటీ.
 • క్షీరదాలు: ఫ్లోరిడా పాంథర్, ఉత్తర నది ఒట్టెర్, మింక్, తూర్పు కాట్టన్‍టైల్ రాబిట్, మార్ష్ రాబిట్, రాకూన్ అనే చారల ఉడుము, స్క్విరెల్, తెల్ల తోక ఉన్న జింకలు,కీ డీర్, బాబ్ కాట్స్, గ్రే ఫాక్స్, కయోటే, వైల్డ్ బోర్, ఫ్లోరిడా బ్లాక్ బేర్, తొమ్మిది పట్టిత ఆర్మడిల్లోలు.
 • సరీసృపాలు: తూర్పు డైమండ్బ్యాక్, పిగ్మీ రాటిల్ స్నేక్స్, గోఫర్ తాబేలు, గ్రీన్, లెదర్బాక్ సముద్రపు తాబేళ్లు, తూర్పు ఇండిగో స్నేక్. 2012 లో ఒక మిలియన్ అమెరికన్ మొసళ్ళు, మిగిలిన వాటితో చేర్చి 1,500 మొసళ్ళు ఉన్నాయి.
 • పక్షులు: బాల్డ్ ఈగల్, ఉత్తర కారాకర, నత్త కైట్, ఓస్ప్రే, వైట్, బ్రౌన్ గూడబాతులు, సీ కాకులు, కోరింత, సాండ్ హిల్ క్రేన్స్, రోసేట్ తెడ్డుమూతికొం, ఫ్లోరిడా పొదలు జే (రాష్ట్ర స్థానికమైనది), ఇతరులు. వైల్డ్ టర్కీ, గల్లోపావో, అవి ఉపజాతి ఒస్కియోలా, ఒకటి ఉపజాతి మాత్రమే ఫ్లోరిడా రాష్ట్రంలో కనిపిస్తాయి. ఫ్లోరిడా రాష్ట్రం తూర్పు ఉత్తర అమెరికా పక్షులు అనేక జాతుల పక్షులకు ఒక శీతాకాల వలస స్థానం.
 • అకశేరుకాలు: వడ్రంగి చీమలు, చెదపురుగులని, అమెరికన్ బొద్దింక, ఆఫ్రికన్ తేనెటీగలు మయామి నీలం సీతాకోకచిలుక, నెరసిన వన్నె గల మాంటిస్ .
 • ఉత్తర రైట్ వేల్ (ఉత్తర రఈత్ తిమింగిలాలు) ఏకైక సంతనోత్పత్తి ప్రాంతం ఫ్లోరిడా, జార్జియా తీరాలలో మాత్రమే ఉంది.
 • 1970లో 300 ఉన్న స్థానిక ఎలుగుబంటు సంఖ్య చరిత్ర సృష్టిస్తూ 2011నాటికి 3000కు చేరుకుంది.

1930 లో అనుకోకుండా దక్షిణ అమెరికా నుండి ఉత్తర అమెరికాకు దిగుమతి అయిన ఎర్ర చీమలు దక్షిణ అమెరికా రాష్ట్రాలలో ఫ్లోరిడాతో కూడా చేర్చి వాటి స్థానాన్ని గుర్తించతగినంత అభివృద్ధి చేసుకున్నాయి. పలు స్థానిక జాతులకంటే అవి చాలా ఎక్కువగా తీవ్రంగా దాడి చేస్తాయి. వాటి కాటు అధికమైన నొప్పిని కలిగిస్తుంది.

స్థానికం కాని పలు పాములను సరీసృపాలను ఇక్కడి అరణ్యాలలో విడుదల చేసారు. 2010లో ఈ రాష్ట్రం బర్మా, భారతీయ చిరుతపులులు, ఆఫ్రికన్ రాక్ చిరుతలు, పచ్చ అనకొండలు, నైల్ మానిటర్ సరీసృపాల వేటను ఏర్పాటు చేసింది. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఆకుపచ్చ తొండలు (ఊసరవెల్లులు) పెంపకం కూడా అధికంకా జరుగుతుంది.

పర్యావరణ సమస్యలు మార్చు

సంయుక్త రాష్ట్రాలలో తలసరి విద్యుత్చ్చక్తి తక్కువగా వాడే రాష్ట్రాలలో ఫ్లోరిడా ఒకటి. పునరుత్పాదన పద్ధతుల ద్వారా రాష్ట్రంలోని 4% విద్యుత్చ్చక్తి ఉత్పత్తి ఔతుంది. ఫ్లోరిడాలో దేశంలో విద్యుత్తు చ్చక్తి ఉత్పత్తిలో 6% ఉత్పత్తి ఔతుంది. అలాగే వాతావరణ కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. గాలిలో 5.6% నద్రజని, 5.1% కార్బన్ డైయాక్సైడ్, 3.5% సలఫర్ డైయాక్సిడ్ ఉన్నాయి.

ఫ్లోరిడా పడమటి తీరంలో మెక్సికన్ గల్ఫ్ వద్ద పెట్రోలియం నిలువలు ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. 181 నుండి అక్కడ పెట్రోలియం శోధనలను ఆపి వేసారు. అక్కడ

ఫ్లోరిడా దక్షిణ తీరంలో మిగిన ప్రదేశాల కంటే తీవ్రమైన ఆటుపోట్లు ఉంటాయి. దక్షిణ తీరంలో విడుదల ఔతున్న విషవాయువులు ఈ ఆటుపోట్లు అధికం కావడానికి కారణమౌతున్నాయని ఆధారాలు లేని ఊహాగానాలు నిపిస్తున్నాయి. ఫ్లోరిడా చిరుత అంతరించడానికి సమీపంలో ఉంది. 2009లో ఆటోమొబైల్స్ ప్రమాదాలలో 23 మంది ప్రాణాలను కోల్పోయారు. జీవవైవిధ్య కేంద్రం, చిరుత పులుల కొరకు అభయారణ్యం స్థాపించబడ్డాయి. మనాటీలు అనబడే సముద్ర జంతువులు వాటి ఉత్పత్తి కంటే అధికంగా మరణానికి గురి ఔతున్నాయి.

వేసవి కాలంలో కార్చిచ్చు నియంత్రణ శిక్షణలో భాగంగా ముందుగా ఏర్పాటు చేయబడిన కంట్రోల్ బరన్స్ (ఏర్పాటు చేయబడిన మంటలు) వేసవిలో కొన్ని మాసాల వరకు అడవులు కాలుతూ ఉంటూ ఉంటాయి. ఫెడరల్, రాష్ట్ర ప్రభుత్వాలు వీటి ద్వారా నియంత్రణ లేని కార్చిచ్చును ఆపగలమని నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఈ శిక్షణ 1940-1970 వరకు కొనసాగింది. 2010లో రాష్ట్రంలో కార్చిచ్చు కారణంగా 2,600,000 ఎకరాల (11,000 చదరపు కిలోమీటర్లు) అరణ్యం తగలబడింది.

పునరుపయోగం(రీ సైకిలింగ్) మార్చు

2000 సంవత్సరంలో ఫ్లోరిడా రాష్ట్ర పునరుపయోగ విధాలలు 28%గా అంచనా వేయబడింది. 2008-2020 నాటికి పర్యావరణ సంరక్షణా చట్టం పునరుపయోగాన్ని 75%కి అభివృద్ధి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించింది.

ప్రజలతరఫున పాఠశాలలు, ప్రజా సంస్థలు వాఋఇ కౌటీలలో పునరుపయోగ నివేదికను సమర్పించేలా ఏర్పాటు చేయబడింది. ప్రైవేటు యాజమాన్య సంస్థలు కూడా వాటి కౌంటీల ఈ నివేదికను సమర్పించడానికి ప్రోత్సహిస్తున్నారు. ఈ విభాగం డిఇపి పునరుపయోగ వ్యాపార సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పునరోపయోగ కార్యక్రమంలో 2012 డిసెంబరు 31 నాటికి భాగంగా 40%, 2014 నాటికి 50%, 2016 నాటికి 60%, 2018 నాటికి 70%, 2020 నాటికి 75% పునరోపంచేయగలిగిన వస్తువులను సేకరించాలని లక్ష్యాన్ని నిర్ణయింరు. 2008 నాటికి లీ కౌంటీ 48% పునరుపయోగ వస్తువులను సేకరించి మొదటి స్థానంలో నిలిచింది.

భూ వర్ణన మార్చు

ఫ్లోరిడా ఫ్లాట్ ఫాం అనబడే పీఠభూమి సున్నపు రాళ్ళపొరలతో కప్పబడి ఉంటుంది. ఈ పీఠభూమిలోని అధిక భాగం ఎకోసిన్ (56 నుండి 34 మిలియన్ సంవత్సరాల మునుపు), ఒలిగోసిన్ (34 నుండి 23 మిలియన్ సంవత్సరాల మునుపు) సమయంలో ఏర్పడ్డాయి. సముద్రపు వత్తిడితో ఏర్పడిన ఈ పీఠభూమిలో మయోసిన్ (23 నుండి 5 మిలియన్ సంవత్సరాల మునుపు) పదునైన బండరాళ్ళు, బంకమట్టి, ఇసుకతో నిండి ఉండి క్రమంగా వృక్షజాలం, జంతుజాలం మొదలైంది. సంయుక్తరాష్ట్రాలలోని అత్యధికమైన పొటాషియం ఫ్లోరిడాలో లభిస్తుంది.

జలాంతర్భాగానికి విస్తరించి ఉన్న గుహలు, సింక్హోల్, స్ప్రింగ్స్ రాష్ట్రమంతా కనిపిస్తుంటాయి. ఈ జలాలను రాష్ట్ర ప్రజల ఉపయోగాలకు వాడుతుంటారు. సున్నపురాళ్ళతో కప్పబడిన ఇసుక భూములు మిలియన్ సంవత్సరాల నుండి సముద్రతీరాలలో కనిపిస్తుంటాయి. హిమయుగంలో సముద్రమట్టం తగ్గి ఆరిన వాతావరణం కారణంగా రాష్ట్ర వైశాల్యాన్ని పెంచింది. ప్రత్యేకంగా సవన్న వద్ద ఇది సంభవించిందని ఊహిస్తున్నారు. 2006లో సింక్ హోల్ వలన నష్టపోయిన రాష్ట్ర ఆస్తుల విలువ 2 బిలియన్ల అమెరికన్ డాలర్ల కంటే అధికమని భావిస్తున్నారు.

ఫ్లోరిడా యు ఎస్ లో అత్యల్పంగా భూకంపాలు వచ్చే రాష్ట్రంగా గుర్తించబడింది. ఫ్లోరిడా ఎటువంటి టెక్టానిక్ ప్లేటుకూ సమీపంలో లేకపోవడమే ఇందుకు కారణం. ఇక్కడ భూకంపాలు చాలా అరుదుగా వస్తుంటాయి.

1755లో ఏర్పడిన లిస్బన్ భూకంపం వలన ఏర్పడిన టి సునామీ ఫ్లోరిడా మధ్యభాగంలో 5 అడుగుల అలలౌ ఎగిసిపడడానికి కారణం అయిందని భావిస్తున్నారు. 1879 జనవరిలో ఒక భూకంపం సంభవించింది. ఈ భూకంపకారణంగా గోడలలో బీటలు పడినట్లు అలమరల నుండి వస్తువులు కిందపడినట్లు ప్రజలు వర్ణించారు. డేటోనా బీచ్ కు 50 మైళ్ళ దక్షిణంలో కూడా ఈ భూకంప ప్రకంపనలు సంభవించాయి. దక్షిణంలో టాంపా, ఉత్తరంలో సవన్నాహ్, జార్జియా వరకు ఈ ప్రకంపనలు సంభవించాయి. 1880 జనవరి క్యూబా కేంద్రంగా సంభవించిన భూకంపం ఫ్లోరిడాలోని పడమటి భాగంలో ఉన్నకీ వెస్ట్ నగరంలో ప్రభావం చూపాయి. 1886 భూకంపం దక్షిణ కరోలినా, చార్ల్స్టన్ వద్ద సంభవించిన భూకంపం ఉత్తర ఫ్లోరిడాలోని భూభాగం కంపించింది. ఫ్లోరిడా తూర్పు భాగంలో ఉన్న జాకెన్ వెల్లీ నగర వాసులు తరువాత సెప్టెంబరు, నంబర్, డిసెంబరు మాసాలలో ఈ భూకంపాలను అనుభవించారు. 2006లో టాంపాకు 260 మైళ్ళ దూరంలో మెక్సికో గల్ఫ్ వద్ద కేంద్రీకృతమైన భూకంపం ఫ్లోరిడ నైరుతి, మధ్య ప్రాంతంలో ప్రకంనలను సృష్టించాయి. ఈ భూకంపం అతి స్వల్పంగా టి సునామీకి కారణమైనా నష్టం మాత్రం కలిగించ లేదు.

జనాభా వివరణ మార్చు

జనసంఖ్య మార్చు

1, 2011 జూలై నాటికి యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఆఫ్ ఫ్లోరిడా జనాభా 19,057,542 ఉటుందని అంచనా వేశారు. 2010 నుండి పెరుగుదల శాతం 1.36% . లేక్ వేల్స్ లోని పోల్క్ కౌంటీలో ఫ్లోరిడా జనాభా అధిక సంఖ్యలో కేంద్రీకృతమై ఉంది. 2009నాటికి ఫ్లోరిడా యొక్క జనాభా 18.537.969 గా అంచనా వేయబడింది. 2007 నుండి రాష్ట్ర జనాభా 128.814, లేదా 0.7% పెరిగింది. సమీపకాల జనాభా గణాంకాలు దేశంలో త్వరితగతిలో జనాభా పెరుగుదలలో ఫ్లోరిడా రాష్ట్రానిది పదమూడవ స్థానమని తెలియజేస్యున్నాయి. 2005 ఫ్లోరిడాలో 2.2% జసంఖ్య అభివృద్ధి శిఖరాగ్రాన్ని చేరుకుంది. రాష్ట్రజనాభాలో మూడింట రెండు వంతుల జనాభా ఇతరరాష్ట్రంలో జన్మించిన వారే. ఇదలా దేశంలో ఇతర రాష్ట్రప్రజలు అధికంగా నివసిస్థున్న రాష్ట్రాలలో ఫ్లోరిడా రెండవ స్థానంలో ఉంది. 2010 గణాంకాలను అనుసరించి చట్టవిరుద్ధంగా నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 5.7%గా నమోదైంది. ఇది దేశంలో ఆరవ స్థానమని భావిస్తున్నారు. 2010 గణాంకాలను అనుసరించి ఫ్లోరిడాలో 675,000 మంది విదేశీయులు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారని భావిస్తున్నారు. 2008 గణాంకాలు 186,102 మంది సైనిక పదవీ విరమణాంతరం ఫ్లోరిడాలో నివసిస్తున్నారని భావిస్తున్నారు.

జాతివారీ వివరణ మార్చు

2010 సంయుక్త సెన్సస్ ప్రకారం, ఫ్లోరిడా 18.801.310 మంది జనాభా ఉన్నారు. జాతి, నిర్దిష్టత పరంగా, రాష్ట్రంలో:

 • 75,0% శ్వేతజాతీయులు (57.9% హిస్పానిక్ కాని తెల్లజాతీయులు మాత్రమే)
 • 16.0% నల్లజాతీయులు లేదా ఆఫ్రికన్ అమెరికన్
 • 0.4% అమెరికన్ ఇండియన్, అలస్కా స్థానిక
 • ఆసియా 2.4%
 • 0.1% హవాయి స్థానికులు, ఇతర పసిఫిక్ ద్వీపవాసులు
 • ఇతర జాతీయులు 3.6%
 • రెండు లేక ఎక్కువ జాతుల నుండి 2.5%
 • హిస్పానిక్స్, ఏ జాతి లాటినోలు జనాభాలో 22.5% ఉన్నారు. [77]

పూర్విక సమూహాలు మార్చు

2000 సెన్సస్ అతిపెద్ద పూర్విక నివేదిక అందించింది, వీరిలో (11.8%) ఐరిష్ (10.3%), ఇంగ్లీష్ (9.2%), అమెరికన్ (8%), ఇటాలియన్ (6.3%), క్యూబన్ (5.2%), ఫ్యూర్టో రికో (3.0% జర్మన్ ఉన్నాయి ) ఫ్రెంచ్ (2.8%), పోలిష్ (2.7%), స్కాటిష్ (1.8%) ఉన్నారు.

2000 సెన్సస్ లో, ఫ్లోరిడాలో 1.278.586 ప్రజలు "అమెరికన్" పూర్వీకులు అని భావించిన వారిలో అత్యధికులు ఇంగ్లీష్ సంతతివారు ఉన్నారని తెలిసింది., కొన్ని స్కాట్స్-ఐరిష్ సంతతికి చెందిన కూడా ఉన్నారు. అయినప్పటికీ వీరంతా దీర్ఘకాలంగా కాలంగా అనేకంగా వలసరాజ్యాల స్థాపన ప్రాంరంభం నుండి రాష్ట్రంలో నివసిస్తున్న కారణంగా వారు తమను "అమెరికన్" పూర్వీకులుగా ఎంచుకుంటున్నారు. వాస్తవంగా వారికి తమ సొంత పూర్వీక సంతతికి తెలియదు. 1980 జనాభాగణాంకాలు ఫ్లోరిడా రాష్ట్రంలో 2,232,514 ఆంగ్లేయపూర్వీకులు ఉన్నారని వారు ఆంగ్లేయులు అధికంగా ఆంగ్లేయ పూర్వీకత కలిగి ఉన్నారు. వారు అధికంగా స్థానిక 13 కాలనీలలో ఉన్నారు. వీరు తమను అమెరికన్ పూర్వీకులుగా పేర్కొంటున్నారు. తరువాత అత్యధిక స్థానంలో 1,617,433. జనసంఖ్య కలిగిన ఐరిష్ సంతతి వారు.

అమెరికా పౌర యుద్ధానికి ముందు, బానిసత్వం చట్టబద్ధమైన ఉన్నసమయంలో పునర్నిర్మాణ యుగం సమయంలో నల్లజాతీయులు ప్రవేశించబడిన కారణంగా రాష్ట్ర జనాభాలో దాదాపు సగం నల్లజాతీయులు ఉన్నారు. తరువాతి శతాబ్దంలో వారి సంఖ్య క్షీణించింది. అతిగొప్ప వలసల కాలంలో వీరు ఉత్తరరాష్ట్రాలకు వలస వెళ్ళడమేకాక పెద్ద సంఖ్యలో శ్వేతజాతీయులు రాష్ట్రంలో ప్రవేశించారు. 1970 లో ఫ్లోరిడా జనసంఖ్యలో హిస్పానికులు కాని వారు 80% ఉన్నారు. సమీపకాలంలో రాష్ట్రంలో తిరిగి నల్లజాతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో నల్లజాతీయులు ఉత్తర ఫ్లోరిడాకు చెందిన ( జాక్సన్, గైనెస్విల్లి, తల్లహస్సీ, పెంస కోలా), ముఖ్యంగా ఓర్లాండో, సంఫోర్డ్ లో టంపా బే ఏరియా, ఓర్లాండో ప్రాంతంలో ఉన్నారు. అలాగే మొత్తం ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ రాష్ట్రాలలో అతిపెద్ద మహానగర ప్రాంతంగా సుమారు 5.5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతం మయామి మహానగరం . అలాగే, 2.7 మిలియన్ల మంది ప్రజలతో టంపా బే ఏరియా రెండవ అతిపెద్ద మతంగా ఉంది, 2.1 మిలియన్ మంది ఓర్లాండో మహానగర ప్రాంతం మూడవ స్థానంలో ఉంది. అలాగే 1.3 మిల్లియన్ల వ్యక్తులతో జాక్సన్విల్లే మహానగర ప్రాంతం నాలుగో స్థానంలో ఉంది.

మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓ ఎం బి) ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫీస్ నిర్వచించిన గణాంకల ప్రకారం ఫ్లోరిడా అన్ని ప్రదేశాల కంటేవైవిధ్యమైన ఇరవై మహానగర ప్రాంతాలను కలిగి ఉంది. ఫ్లోరిడా యొక్క అరవై ఏడు జిల్లాలలో ముప్పై తొమ్మిది ఒక ఎం ఎస్ ఎ ఉన్నాయి. ఫ్లోరిడాలో జనాభా రాష్ట్ర మహానగర ప్రాంతాలు ద్వీపకల్పం యొక్క తీరం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వారు తూర్పుతీరంతో నిరంతర సంబంధాలను కలిగి జాక్సన్విల్లే ఎం ఎస్ ఏ నుండి మయామి-ఫోర్ట్ లాడర్డేల్-పంపానో బీచ్ ఎం ఎస్ ఎ అలాగే మొనోర్ కౌంటీ తప్ప తూర్పు తీరంలోని ప్రతి కౌంటీలోనూ ఉన్నారు. అంతేకాక నిరంతర సంబంధాల పడమటి తీరంలోని హెర్నాండో కౌంటీ నుండి కొల్లియర్ కౌంటీ తీర జిల్లాలలో సహా నేపుల్స్-మార్కో ద్వీపం ఎం ఎ పికు పీటర్స్బర్గ్-క్లియర్వాటర్ ఎం ఎస్ ఎ జనాభా కేంద్రీకృతంమై ఉంది. ద్వీపకల్పం యొక్క ఉత్తర భాగం అంతర్గతంలో కూడా తూర్పు, పశ్చిమ తీర అన్ని ప్రదేశాల కంటే పలు ఎం ఎస్ ఎలు ఉన్నాయి. ఇవి తూర్పు, పడమటి తీరాలను అంటి ఉన్నాయి. ఫ్లోరిడా ద్వీపకల్పమం ప్తాఆన్ హాండిల్ అంతా చెల్లాచెదురుగా ఎం ఎస్ ఎ కౌంటీలు ఉన్నాయి.

భాషలు మార్చు

ఫ్లోరిడా వాసులలో 5 సంవత్సరాలకు పైబడిన వారిలో 74.5% వారు వారి వారి గృహాలలో ఆంగ్లభాషను మాట్లాడుతున్నారు. 18.65% వారు స్పానిష్ మాట్లాడుతున్నారు. ఫ్రెంచ్ క్రియోల్ (దాదాపు పూర్తిగా హైటియన్ క్రియోల్) వారు 1.73% ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. ఫ్లోరిడా మొత్తం జనాభాలో 25.45% మంది అంగ్లేతర భాలను వారి గృహాలలో మాట్లాడుతున్నారు.

1990 లో ఫ్లోరిడా ప్రజావిద్యా విధానం (పబ్లిక్ ఎజ్యుకేషన్ సిస్టమ్) 150 కంటే అధికమైన ఆంగ్లేతర భాషలను వారి విద్యార్థులు వారి వారి గృహాలలో మాట్లాడుతున్నారని గుర్తించింది. లీగ్ ఆయునైటెడ్ అమెరిఫ్ కన్ సిటిజన్స్ (ఎల్ యు ఎల్ ఎ సి) ఇతర భాషలను మాట్లాడే వారి కొరకు ఉపాధ్యాయులు తప్పక ఆంగ్లంలో శిక్షణ పొందాలని ఒక మొదటి తరగతి వ్యాజ్యంలో స్టేట్ ఫ్లోరిడా డిపార్ట్‍మెంట్ ఆఫ్ ఎజ్యుకేషన్ విజయం సాధించింది.

ఫ్లోరిడా రాజ్యాంగం ఆర్టికల్ II, సెక్షన్ 9' ఆంగ్లం ఫ్లోరిడా రాష్ట్రం యొక్క అధికారిక భాషగా అమోదించింది. 1988 తరువాత దరఖాస్తును ఆధారితంగా నిర్వహించిన ఎన్నికల ఫలితంగా ఆంగ్లభాషను అధికార భాషగా అమోదించింది.

జాతివారీ వివరాలు మార్చు

2000 గణాంకాలను అనుసరించి ఫ్లోరిడాలో కాథలిక్, ఎవాంజెలికల్ ప్రోటెస్టెంట్, మెయిన్ లైన్ ప్రోటెస్టెంట్ మతావలంబీకులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఫ్లోరిడాలో అధికంగా ప్రోటెస్టెంట్లు ఉన్నారు అయినప్పటికీ రోమంకాథలిజం మాత్రమే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఫ్లోరిడాలో యూదుల సంఖ్య కూడా గుర్తించతగిన సంఖ్యలో ఉన్నారు. వారు ప్రధానంగా దక్షిణ ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. రాష్ట్రంలో యూదుల సంఖ్యలో అత్యధికం ఇక్కడ నివసిస్తున్నారు, దేశంలో యూదుల సంఖ్యలో ఫ్లోరిడా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో న్యూయార్క్, కాలిఫోర్నియాలు ఉన్నాయి. ఫ్లోరిడా ప్రస్తుత మత వివారాలు ఈ కింది జాబితాలో ఉన్నాయి :

 • రోమన్ కాథలిక్, 26%
 • ప్రొటెస్టంట్, 48%
 • బాప్టిస్ట్, 9%
 • మెథడిస్ట్, 6%
 • పెంతెకోస్తు, 3%
 • యూదు, 3%
 • యెహోవా సాక్షులు, 1%
 • ముస్లిం మతం, 1%
 • సంప్రదాయ, 1%
 • ఇతర మతాలు, 1%
 • ఏ మతానికి చెందని వారు 16%

ప్రభుత్వం మార్చు

ఫ్లోరిడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక నిర్మాణం, విధులు, పనితీరు, కార్యకలాపాలు అని ఫ్లోరిడా ప్రభుత్వం చేత నిర్వచించబడి వాటిని ఫ్లోరిడా రాజ్యాగం కార్యరూపంలోకి తీసుకు వచ్చింది. రాష్ట్రం రాష్ట్ర ప్రాథమిక చట్ట నిర్ణయం చేసి ప్రజలకు వివిధ హక్కులు స్వాతంత్ర్యాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభ్త్వ నిర్వహణను మూడు ప్రత్యేక విభాగాలుగా విభజించింది. చట్టం, నిర్వహణ, శాసనం అనేవి ఆ ప్రధాన భాగాలు. శాసనం గవర్నర్ సంతకం చేసిన నిధుల మంజూరీ శాసనసభ అంగీకరిస్తుంది.

ఫ్లోరిడా శాసనసభ ఫ్లోరిడా సెనేట్ ఆధిక్యతలో నిర్వహించబడుతుంది. సెనేటులో 40 మంది సభ్యులు ఉంటారు. ఫ్లోరిడా రాజ్యాంగ ప్రతినిధుల సంఖ్య 120. ప్రస్తుత ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్టాట్ (ఆంగ్ల వికీ వ్రాసే సమంలో). ఫ్లోరిడా సుప్రీం కోర్ట్ 6 గురు ప్రధాన న్యాయవాధులు ఉంటారు. ఫ్లోరిడాలో 67 కౌంటీలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని నివేదికలు 66 చూపిస్తాయి. జాక్సన్ వెల్లీలో సమైక్యం చేయబడిన రెండు కౌంటీలే ఈ తేడాకు కారణం. ఫ్లోరిడాలో ఉన్న 411 నగరాలలో 379 నగరాలు క్రమంగా ప్రభుత్వానికి నివేదికలను అంద జేస్తుంది. కాని కొన్ని కొత్తగా రూపుదిద్దుకున్న ముంసిపాలిటీలు మాత్రం నివేదికలను అందజేయడం లేదు. రాష్ట్ర ప్రథమ ఆదాయపు వనరు అమ్మకపు పన్ను (ఫ్లోరిడా వ్యక్తిగత పన్ను విధింపు చేయదు), అయినప్పటికీ ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, కౌంటీల ఆదాయపు వనరు మాత్రం ఆసిపన్ను.

రాజకీయ చరిత్ర మార్చు

1885-1889 వరకు రాష్ట్రశాసనసభ శ్వేత డెమొక్రటిక్ శక్తికి ప్రముఖ సంకీర్వంగా ఉన్న నల్లజాతీయులు, పేద శ్వేతజాతీయుల ఓటు హక్కును తగ్గించడానికి ప్రయత్నించింది. ఈ సమూహాలు ఓటు హక్కును కోల్పోవడం వలన శ్వేత డెమొక్రటిక్ శక్తి రాష్ట్రంలో ఏకైక రాజకీయ శక్తిగా మారింది. 1900 రాష్ట్ర ప్రజల సంఖ్యలో ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 44%. ఈ పరిస్థితి అంతర్యుద్ధం వరకూ ఇలాగే కొనసాగింది. కాని వారు శక్తివంతంగా అణిచివేయబడ్డారు. 1877-1948 వరకు ఫ్లోరిడా డెమొక్రటిక్ సభ్యుడికి మాత్రమే అధ్యక్షుడిగా ఓటు వేసింది. అయినప్పట్కీ 1928 ఎన్నికలలో మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది.

స్వతంత్ర, వ్యవసాయ ఆణిచివేత ప్రతిస్పందనగా అనేక మంది ఆఫ్రికన్ అమెరికన్లు గొప్ప వలసల కాలంలో ప్రవాహంలా 1910-1940 వరకు ఉత్తర రాష్ట్రనగరాలకు తరలి వెళ్ళారు. 1940 చివరి దశలో తిరిగి వలసలు ప్రారంభం అయ్యాయి. వారు ఉద్యోగాల కొరకు, పిల్లకు నాణ్యమైన విద్య కొరకు, ఓటు హక్కు కొరకు, సమాజంలోఈ తమ వంతు కృషి చేయడం కొరకు తరలి వెళ్ళారు. ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రానికి వచ్చి చేరిన వలససదారుల వలన ఫ్లోరిడాలో నల్లజాతీయుల సంఖ్య 1960 నాటికి 18% నికి పడిపోయింది.

1952 నుండి అత్యధికులు డెమోక్రాటిక్ సభ్యత్వం తీసుకున్నప్పటికీ రాష్ట్రం 1964, 1996 తప్ప మిగిలిన అన్నిఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ సభ్యుడికి అధ్యక్షిడిగా ఓటు వేసింది. దక్షిణ డెమోక్రాటిక్ రూపుదిద్దుకున్న తరువాత 2008 లో మొదటిసారిగా ఫ్లోరిడా ఉత్తర డెమోక్రాటిక్ సభ్యుడు డి.రూజ్వెల్ట్ కు ఓటు వేసింది. మొదటి పోస్ట్- రికంస్ట్రక్షన్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ ప్రతినిధి 1954లో ఎన్నికైయ్యాడు. మొదటి పోస్ట్- రికంస్ట్రక్షన్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ రిపబ్లికన్ సెనేటర్ 1968 లో ఎన్నికయ్యాడు. తరువాత రెండు సంవత్సరాల తరువాత మొదటి పోస్ట్- రికంస్ట్రక్షన్ రిపబ్లికన్ కాంగ్రెషనల్ రిపబ్లికన్ గవర్నర్ ఎన్నికైయ్యాడు.

1998 లో డెమోక్రేట్లు అల్పసంఖ్యాక వర్గాలు అలాగే సంయుక్త రాష్ట్రాల ఈశాన్య ప్రాంతాల నుండి వలస వచ్చిన స్వతంత్ర శ్వేతజాతీయులు అధికంగా ఉన్న రాష్ట్రంగా ఫ్లోరిడాను వర్ణించారు. ఉదాహరణగా అల్పసంఖ్యాక వర్గాలు అలాగే సంయుక్త రాష్ట్రాల ఈశాన్య ప్రాంతాల నుండి వలస వచ్చిన స్వతంత్ర శ్వేతజాతీయులు అధికంగా ఉన్న దక్షిణ ఫ్లోరిడా, మియామీ మహానగర ప్రాంతం ఒక ఉదాహరణ. ఈ కారణంగా రాష్ట్రంలో ఈ ప్రాంతం డెమొక్రటిక్ ఆధిక్యత అధికంగా ఉన్న ప్రాంతంగా భావిస్తున్నారు. డేటోనా బీచ్ ప్రాంతం, ఒర్లాండో ప్రాంతం దక్షిణ ఫ్లోరిడా లాగా హిస్పానిక్ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలు. వారు తరచుగా డెమోక్రాటులను ఆదరిస్తారు. మిగిలిన ప్రాంతాలు ప్రత్యేకంగా శివార్లు, గ్రామాలు, పూర్తిగా దక్షిణ ప్రాంతాలు మాత్రం రిపబ్లికన్లను ఆదరిస్తారు.

మధ్య ఫ్లోరిడాలో ఉండి డేటోనా బోచ్, ఒర్లాండో, టంపా/ఎస్ టి పీటర్స్ బర్గ్ లను కలుపుతున్న 1-4 కారిడార్ ప్రాంతం డెమొక్రటిక్, రిపబ్లికన్ ఇద్దరినీ ఆదరిస్తున్నారు. ఈ ప్రాంతం ఉత్తర ప్రాంత కంసర్వేటివ్, స్వతంత్ర దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రాంతంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుత కాల్ంలో ఫ్లోరిడాలోని 40% ఓటర్కున్న 1-4 కారిడార్ ప్రజలు అధ్యక్ష ఎన్నికలలో ఎవరు ఎన్నిక ఔతారో నిర్ణయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

డెమొక్రాటిక్ పార్టీ ఫ్లోరిడాలోని మొత్తం 67 కౌంటీలలో మియామి, డేడ్ కౌంటీ, బ్రోవార్డ్ కౌంటీ, పాల్మ్ బీచ్, రాష్ట్రంలోని మూడు జనసాంద్రత కలిగిన కౌంటీలతో కలిపి 40 కౌంటీల ఓటర్ రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. 1988 -2007 వరకు 800 అధికంగా ఫెడరల్ ప్రభుత్వ అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి.

ఇటీవలి ఎన్నికలు మార్చు

శాసనాలు మార్చు

చట్టం అమలు మార్చు

ఆరోగ్యం మార్చు

వాస్తు మార్చు

ఆర్ధికం మార్చు

తలసరి ఆదాయం మార్చు

భూ వాణిజ్యం (రియల్ ఎస్టేట్) మార్చు

20వ శతాబ్దం ఆరంభంలోనే భూమి మదుపుదార్లు హెన్రి ప్లాంట్, హెన్రి ఫ్లాగర్ లు ఫ్లోరిడాను ఎంచుకుని రైలు మార్గాలను అభివృద్ధి చేసారు. అది ప్రజలను ఇక్కడికి ఆహ్లాదకరమైన వాతావరణం, ఆర్థిక ప్రయోజనాల వైపు తరలి వచ్చేలా చేసింది. అప్పటి నుండి పర్యాటక రంగం కూడా అభివృద్ధి కావడం ఆరంభం కావడంతో సరికొత్త అభివృద్ధికి తగిన శక్తిని ఇచ్చి వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు అధికం అయ్యాయి. 2004లో సంభవించిన హరికేన్ సంభవంతో భీమాసంస్థలపై విపరీత ప్రభావం చూపి 40% నుండి 60% తగ్గింపులకు దారి తీసింది.

2008 చివరి భాగంలో ఫ్లోరిడాలో అత్యధికమైన తనఖా అపరాధాలు నమోదైయ్యాయి. 60 రోజులలో 7.8% తనఖా అపరాధాలు నమోదు అయ్యాయి. 2009 నాటికి ఫ్లోరిడా నివాస గృహ వాణిజ్యం విపరీతమైన వత్తిడికి గురి అయ్యింది అనేక సంస్థలు పతనావస్థకు చేరుకున్నాయి. 21 శతాబ్దం మొదటి భాగంలో నివాస గృహ వాణిజ్యంలో ఆరంభమైన విపరీతమైన అభివృద్ధి కారణంగా నిర్మించబడిన నివాసగృహాలు 30,000 వరకు ఖాళీగా మిగిలి పోయాయి. రాష్ట్ర గణాంకాల ఆధారంగా యు ఎస్ సెంసస్ బ్యూరో ఫ్లోరిడా ప్రజలు నివాసగృహాల కొరకు 49.1% ఆదాయంకంటే అధికంగా ఖర్చు చేసారని అంచనా వేసారు. ఈ ఖర్చు దేశంలో మూడవ స్థానంలో ఉంది.

2009 చివరి భాగంలో 278,189 ౠణాల చెల్లింపుల అపరాధాలు, 80,327 జప్తులు నమోదైయ్యాయి. 2010 ఫిబ్రవరి నాటికి మిగిలిన గృహాల అమ్మకం 11,890 కు చేరుకుంది. 2009 కంటే ఇది 21% అధికం. పనామా నగరం, బ్రివార్డ్ కౌంటీ రెండు మహానగర ప్రాంతాలు మాత్రమే అమ్మకాలలో తరుగుదల కొనసాగింది. మిగిలిన నివాస గృహాల సరాసరి ధర 131,000 అమెరికన్ డాలర్లు. గత సంవత్సరం కంటే ఇది 7% తక్కువ.

కూలీ మార్చు

2009 లో ఫెడరల్ ప్రభుత్వ శ్రామికుల సంఖ్య 89,706. 2012 లో రాష్ట్రంలోని మొత్తం కౌంటీలలో ఉపాధి కల్పించడంలో ప్రథమ స్థానం ప్రభుత్వానిదే. ప్రధానంగా ప్రభుత్వ ఉపాధి కల్పనలో ఉపాద్యాయులదే పైచేయి. ప్రభుత్వ ఉద్యోగులలో 30 ఒకరు పాఠశాల ఉద్యోగే కావడం విశేషం. మూడు కౌంటీలలో ఉపాధి కల్పనలో అగ్రస్థానం సైనికదళానిదే.

అగ్రికల్చరల్ , మత్స్య పరిశ్రమ మార్చు

చరిత్రాత్మకంగా ఆర్థికపరంగా ఫ్లోరిడా పశువుల పెంపకం, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయంలో చెరకు, సిట్రస్, టోమాటోలు, స్ట్రాబెర్రీలు ప్రధానమైనవి.

రెండవ ప్రధాన పరిశ్రమ అయిన వ్యవసాయం సిట్రస్ ఫ్రూట్స్. వాటిలో ఆర్థికరంగంలో ప్రధానమైనవి ఆరెంజులు ప్రధాన పాత్ర వహిస్తుంది. సంయుక్తరాష్ట్రాలలో సిట్రస్ పండ్లను అధికంగా పండించేది ఫ్లోరిడా రాష్ట్రమే. అన్ని విధములైన సిట్రస్ పండ్ల పంటలు కలిసి 2006లో 67%. వీటిలో ఆరెంజు పండ్ల శాతం 74%, 58% టాఆంగరింస్, 54% ద్రాక్ష పండ్లు ఫ్లోరిడాలో పండించబడ్డాయి. రాష్ట్ర అధికారిక పానమైన ఆరెంజ్ జ్యూస్ తయారీకి ఫ్లోరిడాలోని ఆరెంజు పండ్లలో 95% ఉపయోగించబడుతుంది. ఇతర పంటలు చెరకు, స్ట్రాబెర్రీలు, టోమాటోలు, సెలరీలకు దక్కుతుంది. ఈ రాష్ట్రం దేశానికి అధిక స్థాయిలో స్వీట్ కార్న్, బీన్స్ పంటను అందిస్తున్నాయి. ది ఎవర్‌గ్లేడ్స్ అగ్రికల్చర్ రాష్ట్రంలోనే ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. రాష్ట్రంలో వ్యవసాయం కారణంగా జలకాలుష్యం ఒక వివాదాంశం అయింది. 2009 లో మత్య పరిశ్రమ ద్వారా 6 బిలియన్లు (600 కోట్లు) డాలర్ల వాణిజ్యం జరిగింది. మత్యపరిశ్రమ క్రీడలకు వాణిజ్యానికి కలిపి 60,000 ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.

గనులు మార్చు

Phosphate mining, concentrated in the Bone Valley, is the state's third-largest industry. The state produces about 75% of the phosphate required by farmers in the United States and 25% of the world supply, with about 95% used for agriculture (90% for fertilizer and 5% for livestock feed supplements) and 5% used for other products.[155] [edit]

ప్రభుత్వం మార్చు

Since the arrival of the NASA Merritt Island launch sites on Cape Canaveral (most notably Kennedy Space Center) in 1962, Florida has developed a sizable aerospace industry. Another major economic engine in Florida is the United States Military. There are currently 24 military bases in the state, housing three Unified Combatant Commands; United States Central Command in Tampa, United States Southern Command in Doral, and United States Special Operations Command in Tampa. There are 109,390 U.S. military personnel currently stationed in Florida,[156] contributing, directly and indirectly, $52 billion a year to the state's economy.[157]

పరిశ్రమ మార్చు

పర్యాటకం మార్చు

ఇక్కడ ఫ్లోరిడా హిందూ దేవాలయం ఉంది.

విద్యుత్తు మార్చు

విద్య మార్చు

ప్రభుత్వేతర విశ్వవిద్యాలయాలు మార్చు

మౌళిక సదుపాయాల నిర్మాణము మార్చు

సమాచార రంగము మార్చు

ప్రభుత్వ రవాణా మార్చు

రహదారులు మార్చు

విమానాశ్రయాలు మార్చు

క్రీడలు మార్చు

ఆటో రేసింగ్ ట్రాకులు మార్చు

మూలాలు మార్చు

 1. "American FactFinder". United States Census Bureau. Retrieved 2008-01-31.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫ్లోరిడా&oldid=3456822" నుండి వెలికితీశారు