హైందవ మత సంప్రదాయములో పరమశివుని ప్రధాన అధిదేవతగా ఆరాధించే శాఖను శైవము (Shaivism) అంటారు. వీరు శివాలయాలలోని లింగాకారంలో నున్న శివుని పూజిస్తారు. శివారాధకులకు శైవులు అని అంటారు. శైవ మతాన్ని ప్రచారం చేయటానికి సాహిత్యాన్ని సృష్టించిన వారు శివకవులు. వారిలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ముఖ్యులు. వీరిని "శివ కవిత్రయము" అని అంటారు.

వీరశైవం

మార్చు

ఆది జగద్గురు శ్రీ రేణుకాచార్య భగవత్పాదులు శ్రీ స్వయంభు సోమేశ్వర లింగం నుండి లింగోద్బవం చెంది పరమశివుడి ఆనతి మేరకు ఈ భుమండలంపైన శక్తివిశిష్టాద్వైతాన్ని స్థాపించడం జరిగింది.ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్నే వీరశైవంగా పిలుస్తారు. వీరశైవ మతానికి సంబంధించి మూలమైన అయిదుగురు పంచాచార్యులలో ఈ రేణుకులు ప్రథములు. వీరి గురించి 28 శివాగమాలలో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ప్రధానంగా స్వయంభువాగమ, వీరాగమ, సుప్రభేదాగమాల్లో వివరించబడి ఉంది. వీరు వీరసింహసనం అను పేర పీఠమును స్థాపించడం జరిగింది ఈ పీఠమూల పరంపర ఇప్పటికీ కొనసాగుతున్నాయి.శ్రీ రెణుకాచార్యుల వారు కృతయుగమున అగస్త్య మహాముని వినతి మేరకు అగస్త్యునికి శైవ సిద్దాంతమును ఉపదేశించారు.

రేణుకాచార్యులు అగస్త్య మహామునికి ఉపదేశించిన శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని, శివయోగి శివాచార్యులు "సిద్దాంత శిఖామణి" పేరిట సంస్కృత భాషలో గ్రంథస్తం చేయటం జరిగింది. ఈ గ్రంథం అప్పటికే వీరాగమాది 28 గ్రంథాల్లో ఉన్న వీరశైవ తత్వాన్ని సంగ్రహించి రాయటం జరిగింది. సిద్దాంత శిఖామణి, సిద్దంతాలకన్నిటికీ తలమానికమై శిరోరత్నమువలె భాసిల్లటం జరుగుతుంది. ఈ శక్తివిశిష్టాద్వైత సిద్దాంతాన్ని రేణుకాచార్యుడు బోధించటం వలన దీనిని "రేణుకాగీత" అని కూడా పిలవబడుతుంది

బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము - నీలకంఠ భాష్యం వ్రాసిన శ్రీకంఠ శివాచార్యులు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి క్రింది విదంగా ప్రస్తుతించటం జరిగింది. ఈ గ్రంథమే సమస్త వీరశైవులకు ప్రామాణిక గ్రంథము.

శ్రీకంఠ శివాచార్యులు కూడా తమ బ్రహ్మసూత్ర భాష్యం శ్రీకంఠ భాష్యములో సిద్దాంత శిఖామణి శ్లోకములనుప్రమాణ యుక్తముగా ఉదహరించుట జరిగింది., తన శ్రీకంఠ భాష్యమున "అవిభాగేన ద్రుష్టత్వాత్ " అను బ్రహ్మ సూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 9 వ పరిచ్చేదమందలి14 వ శ్లోకము "ప్రసన్నే సతి ముక్తఃస్యాన్ ముక్త శివ సమొభవేత్" అను శ్లోకమును ప్రమాణ పూర్వకంగా ఉదహరించుట జరిగింది.. ప్రసిద్ధ సిద్దాంత కౌముది కర్త భట్టోజీ దీక్షితుల "తంత్రాదికార నిర్ణయము" లోనూ, కమలాకరభట్టు రచించిన "నిర్ణయ సింధు" లోనూ, మరియూ "శారదా తిలక", "నిర్మాల్య రత్నాకరము", "శైవ బ్రాహ్మనోత్పత్తి" మొదలుగాగల గ్రంథములలో సిద్దాంతశిఖామణి ప్రమాణముల ఉదహరించుట జరిగింది.

10వ శాతబ్దంలో బ్రహ్మసూత్రములకు శక్తి విశిష్టాద్వైత సిద్దంతపరంగా (వీరశైవ పరంగా ) భాష్యము శ్రీకరభాష్యం వ్రాసిన శ్రీపతి పండితాచార్యుడు వీరశైవులకు ఆగమోక్త ప్రామాణిక గ్రంథమైన సిద్దాంత శిఖామణి గూర్చి క్రింది విదంగా ప్రస్తుతించటం జరిగింది.

తన శ్రీకర భాష్యమున "పత్యుర సామంజస్యాత్" అను బ్రహ్మసూత్ర భాష్యమున సిద్దాంత శిఖామణి 5 వ పరిచ్చేదము లోని "అగస్త్యముని శార్దూల... " ఆదిగా గల 8 శ్లోకాలనూ ఉదహరించటం జరిగింది.అలాగే "అథాతోబ్రహ్మ జిజ్ఞాసా" అను బ్రహ్మ సూత్ర భాష్యమున కూడా:"పవిత్రంతే - ఋగ్వేద మంత్రస్య సిద్దాంత శిఖామణి శ్రీ రేణుకాచార్యేన లింగాధారణ పర్వతేన నిర్దేశిత్” అని"రేణుక భగవత్పాద చార్యేణాపి - పిండతాపిండ విజ్ఞాన మిత్యారభ్యవితాని శివ భక్తస్య కర్తవ్యాని ప్రయత్నతః "ఇత్యంతేన సిద్దాంత శిఖామణౌ తస్యే ఉపదేశితే" అని వివరించి సిద్దాంత శిఖామణి గ్రంథ ఔన్నత్యాన్ని కొనియాడాడు.

వేదవ్యాసుడు తన స్కంద పురాణము శంకర సణితలో అధ్యాయము 85 లో శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదుల గారిని గూర్చి ఈ విధముగా స్తుతించారు.

తస్మిన్ శ్రీ పర్వతేపుణ్యే, సన్సారామయభేషజే| ఆస్తే లింగాంగ సంబంధీ, సదానందాహ్వయోమునిః|| సర్వోపనిషదర్ధజ్ఞః - శివధ్యాన పరాయణాః| భస్మావలిప్త సర్వాంగో -రుద్రాధ్యాయ జపాశ్రయః|| రుద్రాక్ష మాలాభరణో - దృతపాశుపత వ్రతః| అతివర్ణాశ్రమీయోగి -జీవన్ముక్తో జగద్గురుః|| తం సదానంద నామానం -- శంకరధ్యాన లాలసం| నిరస్తకుహకం విప్రం - సహపుత్రేణ పూజయ|| తస్యప్రసాదత్వే - పుత్రోగచ్చేన్నీరోగతాం ధ్రువం| తస్మాదుత్తిష్ఠ గచ్చత్వం - శ్రీఅ పర్వతమతంద్రితః||

తాత్పర్యము:- శ్రీశైల సూర్యసింహనాధీశులైన జగద్గురు శ్రీ సదానంద శివాచార్య భగవత్పాదులు సంసార రోగమును పారద్రోలుదురు. పరమ పవిత్రులు, భస్మరుద్రాక్షధారులు, శ్రీ రుద్రాధ్యాయ, జపాసక్తులు, (సంసార రోగ నాశకులు) జీవన్ముక్తులు, జగద్గురువులు, శ్రీశైల క్షేత్రమున ఉన్నారు. వారిని పూజించినట్లయితే వారి అనుగ్రహము వలన నీ కుమారుడైన పింగళుడు రోగ విముక్తుడు అగును. నీవు తక్షనమే శ్రీశైల క్షేత్రమునకు వెళ్లుమని హరప్రియుడు శ్వేతునకు చెప్పినట్లు వేదవ్యాస మహర్షి స్కంద మహాపురాణము యొక్క శంకర సంహిత లోని 85వ అధ్యాయములో శ్లొకము 90 నుండి 95వ శ్లోకము వరకు వివరించి ఉన్నాడు., తన పద్మపురాణాంతర్గత, శివగీత 16 వ అధ్యాయం యందు అఙ్ఞో పహాస భక్తాశ్చ-భూతి రుద్రాక్షధారిణ| లింగినోయశ్చవాద్వేష్టి - తేనైనా త్రాధికారిణ||

ప్రతిమా శివలింగంవా - దేవ్యైరేతః కృతంతుయత్| తత్రమాం పూజయేత్తేషు - ఫలం కోటి గుణోత్తరమ్||

తా: అఙ్ఞాని, అపహాస్యము చేయువాడు, విభూతి రుద్రాక్ష లింగదారులెఉన శివభక్తులను ద్వేషించువారు మోక్షమును పొందుటకు అర్హులు కారు. ఎవరైతే భక్తితో శివలింగాన్ని పూజిస్తారో, వారే ముక్తిని పొందుటకు అర్హులు.

తన శివ మహాపురాణము యొక్క విద్వేశ్వర సంహితలో 16వ అధ్యాయములో 159వ స్లోకమున శివభక్తో వసేన్నిత్యం - శివలింగం సమాశ్రితః| పూజయాచర లింగస్య - క్రమాన్ముక్తో భవేధ్రువమ్||

తా: శివభక్తుడైనవాడు ఎల్లప్పుడూ తన దేహము పై శివలింగమును ధరించియున్నను జంగమమూర్తి పూజ వలననే మోక్షమును పొదగలడు అని చెప్పబడింది.

నాయనార్లు

మార్చు

శైవ శాఖలో వీరు చెప్పుకోదగ్గవారు. వైష్ణవశాఖలో ముఖ్యమైన 12 మంది ఆళ్వార్లతో కలిపి వీరిని దక్షిణ భారతం దేశంలో పరమ భక్తాగ్రేసరులుగా వ్యవహరిస్తారు వీరుమొత్తం 63 (అరవై ముగ్గురు) మంది. తమ కవిత్వంతో శివుణ్ణి కీర్తించిన అపర భక్తాగ్రేసరులు. వీరి చరిత్ర తమిళంలోని 'పేరియ పురాణం'లో చక్కగా వివరించబడింది. దీనిని రచించినది సెక్కిళార్. ఈ నయనార్లలో భక్త కన్నప్ప, కరైక్కాల్ అమ్మన్ మొదలగు వారు పెక్కు ప్రసిద్ధులు. లింగాయత్ లు భారతదేశంలో శైవం ఎన్నో శాఖలుగా విడిపోయింది. లింగాయత్ శైవం కర్ణాటకలోని ప్రసిద్ధ శైవ శాఖ. ఈ పద్ధతిని బసవేశ్వరుడు ప్రారంభించాడు. ఈ శైవాన్ని పాటించేవారు తమ కంఠంలో చిన్న శివ లింగాన్ని ధరిస్తారు. ఆ శివ లింగానికి రోజూ నీటితో అభిషేకం నిర్వహించి మరల ఆ లింగాన్ని తమ కంఠంలో ధరిస్తారు.

శివారాధన

మార్చు

శివుని ఆరాధనకు శివాలయం ప్రధానమైన కేంద్రం. మన దేశంలోను, రాష్ట్రంలోను ఎన్నో శివాలయాలు ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచారామాలు. మన రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైన క్షేత్రాలు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శైవం&oldid=4279184" నుండి వెలికితీశారు