కె.ఎస్. భరత్

(శ్రీకర్ భరత్‌ నుండి దారిమార్పు చెందింది)

కోన శ్రీకర్‌ భరత్‌ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.[2] ఆయనకు నవంబరు 2021లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ లో చోటు దక్కింది. శ్రీకర్‌ భరత్‌ ఐపీఎల్‌ లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌(ఢిల్లీ క్యాపిటల్స్‌), ఐపీఎల్‌-2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించాడు.[3]

కే.ఎస్. భరత్‌
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కోన శ్రీకర్‌
పుట్టిన తేదీ (1993-10-03) 1993 అక్టోబరు 3 (వయసు 31)
రామచంద్రపురం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం[1]
ఎత్తు5 అ. 7 అం. (1.70 మీ.)
బ్యాటింగుకుడి చేతి బ్యాట్స్‌మన్‌
పాత్రవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012 - ప్రస్తుతంఆంధ్ర రంజీ జట్టు
2015ఢిల్లీ డేర్ డెవిల్స్
2021రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ భారత్‌ ‘ఎ’ ట్వంటీ 20 క్రికెట్
మ్యాచ్‌లు 69 46 37
చేసిన పరుగులు 3,909 1,281 457
బ్యాటింగు సగటు 37.58 29.11 14.74
100s/50s 8/20 3/5 0/1
అత్యధిక స్కోరు 308 125 51
క్యాచ్‌లు/స్టంపింగులు 232/27 52/11 29/7
మూలం: Cricinfo, 13 నవంబరు 2021

జననం, విద్యాభాస్యం

మార్చు

కే.ఎస్. భరత్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురంలో 3 అక్టోబరు 1993న శ్రీనివాసరావు, దేవి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి విశాఖపట్నంలో నావీలో ఉద్యోగం ఉండడంతో ఆయన విద్యాభాస్యంత అక్కడే జరిగింది. భరత్‌ విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[4]

వివాహం

మార్చు

కోన శ్రీకర్‌ భరత్‌ వివాహం 5 ఆగస్టు 2020న విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన అంజలితో జరిగింది.[5][6][7]

క్రీడా జీవితం

మార్చు

కే.ఎస్. భరత్‌ 2012లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన భరత్‌ 9 సెంచరీలు, 23 అర్ధ సెంచరీలతో 4,283 పరుగులు సాధించాడు. ఆయన 2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్‌లో 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆయన భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్నాడు.[8]

కే.ఎస్. భరత్‌ 2015లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ (ఢిల్లీ క్యాపిటల్స్‌)కు ప్రాతినిథ్యం వహించాడు. కానీ అతడికి మ్యాచ్‌ ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో మినీ వేలం-2021లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. ఆయన ఐపీఎల్‌-2021 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొత్తం 191 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌-2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు. ఆయనను నవంబరు 2021లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ కోసం బీసీసీఐ చోటు కల్పించింది.

కేఎస్‌ భరత్‌ 2021 నవంబరు నాటికీ 78 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 4283 పరుగులు చేయగా, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 51 మ్యాచ్‌లు ఆడి 1351 పరుగులు, టీ20 ఫార్మాట్‌లో 48 మ్యాచ్‌లు ఆడి 730 పరుగులు చేశాడు. ఆయన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 9 సెంచరీలు 23 హాఫ్‌ సెంచరీలు, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 3 సెంచరీలు 5 హాఫ్‌ సెంచరీలు, టీ20 క్రికెట్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు చేశాడు. [9]

కోన శ్రీకర్‌ భరత్‌ 2023 ఫిబ్రవరి 09న మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌- గవాస్కర్‌ ట్రోఫీ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో తొలిసారిగా భారత్ తరపున తన తొలి మ్యాచ్ ను ఆడాడు.[10][11]

మూలాలు

మార్చు
  1. K. S. Bharat (సెప్టెంబరు 28 2021). KS Bharat Interview | RCB Bold Diaries IPL 2021. Royal Challengers Bangalore. Event occurs at 15s. {{cite AV media}}: Check date values in: |date= (help)
  2. Deccan Chronicle (జనవరి 27 2021). "Making it to Team India" (in ఇంగ్లీష్). Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  3. Sakshi (అక్టోబరు 8 2021). "సిక్స్‌తో గెలిపించిన శ్రీకర్‌ భరత్‌.. కోహ్లి రచ్చ రచ్చ". Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  4. Eenadu (2021). "అందుకే సిక్సర్‌ కొట్టగలిగా!". Archived from the original on 9 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= (help)
  5. Samayam Telugu. "10 ఏళ్లు డేటింగ్.. ఎట్టకేలకి పెళ్లి చేసుకున్న భారత వికెట్ కీపర్". Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= (help)
  6. CricTracker (ఆగస్టు 8 2020). "KS Bharat ties the knot with his longtime girlfriend after 10 years of dating" (in ఇంగ్లీష్). Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  7. Circle Of Cricket. "PICS: KS Bharat ties the wedding knot with Anjali" (in ఇంగ్లీష్). Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= (help)
  8. Sakshi (నవంబరు 13 2021). "శ్రీకర్‌ భరత్‌ గురించి ఈ విషయాలు తెలుసా?". Archived from the original on 13 నవంబరు 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  9. News18 (మే 20 2021). "Who Is KS Bharat - The Wicketkeeper-Batsman Roped In As Cover For Wriddhiman Saha?" (in ఇంగ్లీష్). Archived from the original on 20 మే 2021. Retrieved నవంబరు 13 2021. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)CS1 maint: numeric names: authors list (link)
  10. Namasthe Telangana (ఫిబ్రవరి 9 2023). "టీం ఇండియా జట్టులో స్థానం సంపాదించుకున్న తెలుగు కుర్రాడు". Archived from the original on ఫిబ్రవరి 9 2023. Retrieved ఫిబ్రవరి 9 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  11. ETV Bharat News (ఫిబ్రవరి 9 2023). "అమ్మ ఆశీర్వాదం తీసుకుని.. అదిరిపోయే స్టంపౌట్ తో మెరిసి." Archived from the original on ఫిబ్రవరి 9 2023. Retrieved ఫిబ్రవరి 9 2023. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)