రామచంద్రపురం (తూర్పుగోదావరి జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురం మండలం లోని పట్టణం

రామచంద్రపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం.

రామచంద్రపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పుగోదావరి
మండలం రామచంద్రపురం
ప్రభుత్వము
 - మునిసిపల్ చైర్మెన్ మేడిశెట్టి సూర్యనారాయణ మూర్తి
జనాభా (2011)
 - మొత్తం 43,657
 - పురుషుల 57,410
 - స్త్రీల 57,117
 - గృహాల సంఖ్య 32,630
పిన్ కోడ్ 533 255
ఎస్.టి.డి కోడ్ 08857

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,14,527 - పురుషుల 57,410 - స్త్రీల 57,117 - గృహాల సంఖ్య 32,630.[1]

విద్యా సౌకర్యాలుసవరించు

రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణమూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది, నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.

రవాణా సౌకర్యాలుసవరించు

ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉంది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళుతుంది.

పట్టణం స్వరూపం, జనాభాసవరించు

ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉంది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళుతుంది.

వ్యవసాయం, నీటి వనరులుసవరించు

ఇది వరి, చెరుకు ప్రధాన పంటలకు కేంద్రం.

పరిశ్రమలు, వ్యాపారంసవరించు

80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ, బీరు ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో యింకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.

శాసనసభ నియోజకవర్గంసవరించు

ప్రధాన వ్యాసం: రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం


ఇతర విశేషాలుసవరించు

కాకర్లపూడి వంశానికి చెందిన కోట ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు. ఆ కోటలో ఇప్పటికీ వారి వంశస్థులు నివసిస్తున్నారు. కోట చాయాచిత్రం[permanent dead link]

ప్రముఖులుసవరించు

రెవెన్యూ డివిజన్లోని మండలాలుసవరించు

  1. ఆనపర్తి
  2. బిక్కవోలు
  3. రంగంపేట
  4. పెదపూడి
  5. రామచంద్రపురం
  6. గంగవరం
  7. కాజులూరు
  8. మండపేట
  9. రాయవరం
  10. కపిలేశ్వరపురం

మూలాలుసవరించు

వెలుపలి లంకెలుసవరించు