శ్రీనివాస్ గద్దపాటి యువ కవి, ఉపాధ్యాయుడు. కవి సంగమం రచయిత.[1]

శ్రీనివాస్ గద్దపాటి
Srinivas Gaddepati.jpg
శ్రీనివాస్ గద్దపాటి
జననంశ్రీనివాస్
(1970-09-22) 1970 సెప్టెంబరు 22 (వయస్సు: 49  సంవత్సరాలు)
రామాపురం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంఖమ్మం, తెలంగాణ
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
మతంహిందూ
భార్య / భర్తప్రభారాణి
పిల్లలురాజశ్రీ, రచన
తండ్రిరాజయ్య
తల్లిరత్నమ్మ

జననంసవరించు

శ్రీనివాస్ గద్దపాటి రత్నమ్మ, రాజయ్య దంపతులకు 1970 సెప్టెంబరు 22న ఖమ్మం జిల్లాలోని రామాపురం లో జన్మించాడు.

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగంసవరించు

ప్రస్తుతం ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు.

వివాహంసవరించు

శ్రీనివాస్ ప్రభారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (రాజశ్రీ, రచన).

ప్రచురితమయిన మొదటి కవితసవరించు

మొదటి కవిత.. వెంటాడే జ్ఞాపకం అనే కవిత గుమ్మం, ఖమ్మంజిల్లా కవుల సంకలనంలో ప్రచురితం అయింది.

కవితల జాబితాసవరించు

 • గుమ్మం
 • స్వేచ్ఛకోసం
 • మార్పుకోసం
 • జాగో జగావో
 • క్విట్ తెలంగాణ
 • నల్లస్వప్నం
 • మునుం
 • తొలిపొద్దు
 • సఫాయిలం
 • తొలివెలుగు
 • అస్థిత్వం
 • కొత్తతొవ్వ
 • పంచమస్వరం
 • చైతన్య కవనం
 • ఆసిఫాకోసం
 • అక్షరాలతోవ
 • సాహితీసౌరభాలు

మొదలయిన కవితా సంకలనాల్లో మూసీ, క్రిష్టియన్ అంబాసిడర్, ఆకాషిక్ ... వాకిలి, వన్ ఇండియా, సారంగ అంతర్జాల పత్రికల్లో కవితలు

ప్రచురితమయిన పుస్తకాల జాబితాసవరించు

"పంచమస్వరం" మాదిగ కవుల కవితాసంకలనం

బహుమానాలు - బిరుదులు - గుర్తింపులుసవరించు

 • జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డ్ 2015;
 • డా.బి.ఆర్. అంబేడ్కర్ నేషనల్ ఫెలో షిప్ అవార్డ్ ( న్యూ డిల్లి) 2015;
 • డా.వై.ఆర్.కే.స్మారక సాహితీ అవార్డ్ 2015;
 • గురుబ్రహ్మ నేషనల్ అవార్డ్ 2015;
 • మదర్ స్వచంద సేవా సంస్థ విజయవాడ వారి అవార్డ్ 2015
 • భక్తరామదాసు సర్వీసెస్ సొసైటీ,నేలకొండపల్లి వారిచే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్ఢ్ 2016
 • అబ్దుల్ కలామ్ స్వచ్ఛంద సంస్థ విశాఖపట్నం వారిచే విద్యాభూషణ్ అవార్డు 2016
 • భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ వారిచే "సాహిత్య రత్న" అవార్డు 2018
 • బి.యస్ రాములు జీవనసాఫల్య సాహిత్య పురస్కారం 2019

ఇతర వివరాలుసవరించు

2014, నవంబరు 23 హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన కవిసంగమం సిరీస్ 20లో పాల్గొన్నాడు.[2]

మూలాలుసవరించు

 1. నవతెలంగాణ, ఖమ్మం-స్టోరి (24 December 2018). "హృదయ స్పందనే కవిత్వం". NavaTelangana. Archived from the original on 22 సెప్టెంబర్ 2019. Retrieved 22 September 2019.
 2. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (17 November 2014). "కవిసంగమం-20". www.andhrajyothy.com. Archived from the original on 22 సెప్టెంబర్ 2019. Retrieved 22 September 2019.