శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో గోదావరి నదిపై నిర్మించబడిన ప్రాజెక్టు.[1][2] శాసనసభ్యులు డి. శ్రీపాదరావు పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నాల్గవ అతిపెద్ద ప్రాజెక్టు.[3]
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు | |
---|---|
Yellampalli Barrage at Ramagundam Mandal | |
ప్రదేశం | ఎల్లంపల్లి, అంతర్గాం మండలం , పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, |
అక్షాంశ,రేఖాంశాలు | 18°50′45″N 79°22′05″E / 18.84583°N 79.36806°E |
ఆవశ్యకత | రామగుండం పవర్ ప్లాంటు, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీరు |
స్థితి | Operational |
నిర్మాణం ప్రారంభం | 28 జూలై, 2004 |
ప్రారంభ తేదీ | 4 ఆగష్టు, 2016 |
నిర్మాణ వ్యయం | రూ. 5400 కోట్లు |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
Height | 26.3 మీటర్లు |
పొడవు | 1180.7 మీటర్లు |
Spillways | 62 |
జలాశయం | |
సృష్టించేది | ఎల్లంపల్లి |
మొత్తం సామర్థ్యం | 20 tmcft |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Commission date | 2004 |
Type | బ్యారేజి |
శంకుస్థాపన
మార్చు2004, జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డిచే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.[4][5]
వివరాలు
మార్చుఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. రామగుండంలోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు.[6]
ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్, నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు రామగుండం మండలంలోని విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయరుకు నీటిని సరఫరా చేయడమేకాకుండా, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీటిని అందిస్తుంది. సర్ ఆర్థన్ కాటన్ గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేసినా ఇది కార్యరూపం దాల్చలేదు.[7]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sripada Yellampalli project water for NTPC plant". The Hindu. Archived from the original on 1 October 2008. Retrieved 27 July 2018.
- ↑ "Sripad Sagar(Yellampalli) Major Irrigation Project JI00042". Archived from the original on 14 August 2016. Retrieved 27 July 2018.
- ↑ "Sripada Yellampalli project by May 2008". The Hindu. Archived from the original on 13 October 2007. Retrieved 27 July 2018.
- ↑ "YSR lays stone for Yellampalli project". The Hindu. Archived from the original on 9 August 2004. Retrieved 27 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
- ↑ "White paper sought on Yellampalli". The Hindu. 23 October 2010. Archived from the original on 10 November 2012. Retrieved 27 July 2018.
- ↑ నవతెలంగాణ, దీపిక (10 December 2015). "తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది?". www.navatelangana.com. Archived from the original on 31 July 2019. Retrieved 31 July 2019.