రామగుండం

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని పట్టణం

రామగుండం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా,రామగుండం మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత కరీంనగర్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2]

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్
యన్.టి.పి.సి.రామగుండం

చరిత్రసవరించు

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అనే గ్రామ సమీపంలో త్రేతాయుగంలో శ్రీ రామ చంద్రుడు సీతా సమేతుడై వనవాస సమయములో పవిత్రమైన గోదావరి నది తీరమందు ఉన్న రామగుండంలో శ్రీ రామపాదక్షేత్రం యందు విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు నివాసముండి తపస్సు చేసారు.[ఆధారం చూపాలి] వీరితోపాటు శ్రీ రామచంద్రుడు నివసించి స్వయంగా శివలింగ ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు, చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిత్య పూజలు జరపబడుచున్నవి. యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, యమకోణం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకోని గుండములు ఏర్పడినవి. ఇట్టి గుండాలు అతి వైభవముగా ఉండేవి (నీటితో నిండి ఉండేవి) కాని కాలక్రమేణ అవి కొన్ని కుడుకుపోవడము జరిగింది. ప్రస్తుతం పైన తెలిపిన కొన్ని గుండాలు మాత్రమే మిగిలివున్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరం, దశరథ మహారాజుని పిండ పరధానం స్థావరం, రాములవారి హల్లు బండ చూడదగిన ప్రదేశాలు. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం అన్న పేరు వాడుకలో వచ్చింది.

రవాణా సౌకర్యంసవరించు

 
రామగుండం థర్మల్ పవర్ స్టేషను

రోడ్డు రవాణ మార్గంసవరించు

రామగుండంలోని గోదావరిఖనిలో బస్టాండ్ ఉంది. ఇది రాజీవ్ రహదారికి అనుసంధానంగా ఉంది. ఇక్కడి నుండి ప్రతీరోజు హైదరాబాద్, కరీంనగర్ లకు, అలాగే రాష్ట్రంలోని చాలా ప్రదేశాలకు బస్సులు బయలుదేరుతాయి.ప్రస్తుత తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నుండి గోదావరిఖని వరకు 4 వే రోడ్డు నిర్మించటం జరిగింది.

రైలు మార్గంసవరించు

 
రామగుండం రైల్యే స్టేషన్

రామగుండంలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది హైదరాబాద్ నుండి, చెన్నై నుండి ఢిల్లీకి వెళ్లే మార్గం. ఇది దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ కిందకి వచ్చును. ఈ స్టేషనులో దాదాపు అన్ని రైళ్లు ఆగుతాయి. ఇది ఢిల్లీ నుండి తెలంగాణకు వచ్చే రైలుకి రాష్ట్రంలో ఎదురయ్యే ఒక పెద్ద స్టేషను.ఉత్తమ రైల్వే స్టేషన్గా 2 సార్లు అవార్డు అందుకుంది.

పాలనా విభాగాలుసవరించు

ఇది లోక్ సభ నియోజక వర్గం కేంద్ర స్థానం.ఇది పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

ప్రస్తుత రామగుండం శాసనసభ నియోజక వర్గం ఎమ్. ఎల్.ఎ. కోరుకంటి చందర్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో ఉన్నారు. రామగుండం ఒక నగర పాలక సంస్థ. దీని మేయరు జాలి రాజమణి, ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీకి చెందిన అభ్యర్ధి.

ప్రముఖ సంస్థలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

ఇవి కూడా చూడండిసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రామగుండం&oldid=3661274" నుండి వెలికితీశారు