శ్రీరంగనాధ స్వామి ఆలయం, శ్రీరంగపట్టణం

శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్నాటక రాష్ట్రం లోని శ్రీరంగపట్టణం లో కలదు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది. శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి. శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.

శ్రీరంగనాధ స్వామి ఆలయ గోపురం

ఇవి కూడా చూడండి

మార్చు

చిత్రమాలిక

మార్చు