శ్రీరంగపట్టణం

కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని పట్టణం

శ్రీరంగపట్టణం (కన్నడ: ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ శ్రీరంగపట్న శిరంగపట్టణ్ అని పిలువబడేది). కర్నాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో గలదు. మైసూరుకు అతి సమీపంలో ఉంది. ఈ నగరం, చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగిఉంది.

శ్రీరంగపట్నం
శేరింగపట్నం (సామ్రాజ్యవాద కాలంలో)
పట్టణం
శ్రీరంగపట్నంలో గుంబజ్
శ్రీరంగపట్నంలో గుంబజ్
శ్రీరంగపట్నం is located in Karnataka
శ్రీరంగపట్నం
శ్రీరంగపట్నం
Coordinates: 12°24′50″N 76°42′14″E / 12.414°N 76.704°E / 12.414; 76.704
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లామాండ్యా
Government
 • Typeపురపాలక సంఘం
 • Bodyశ్రీరంగపట్నం పురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total13 కి.మీ2 (5 చ. మై)
Elevation
679 మీ (2,228 అ.)
జనాభా
 (2011)
 • Total25,061
 • జనసాంద్రత2,157/కి.మీ2 (5,590/చ. మై.)
భాషలు
 • అధికారికకన్నడ
Time zoneUTC+5:30 (IST)
PIN
571 438
ప్రాంతీయ ఫోన్ కోడ్08236
Vehicle registrationKA-11
Websitehttp://www.srirangapatnatown.mrc.gov.in/

ప్రదేశం

మార్చు
 
శ్రీరంగనాధ మందిరం

మైసూరు కు 13 కి.మీ. దూరంలో గల ఈ నగరం, మాండ్య లో గలదు. ఈ పట్టణం చుట్టూ కావేరీ నది చే చుట్టబడిఉంది. ఇదో ద్వీపంలా కనబడుతుంది.

ధార్మిక ప్రాముఖ్యత

మార్చు
 

ఈ నగరంలోని శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.

జనగణన

మార్చు

2001 గణాంకాల ప్రకారం,[1] శ్రీరంగ పట్టణ జనాభా 23,448. అందులో పురుషులు 51%, స్త్రీలు 49% గలరు. అక్షరాస్యత శాతం 68%, జాతీయ అక్షరాస్యత శాతం 59.5% కంటే ఎక్కువ ఉంది. పురుషుల అక్షరాస్యత 74%, స్త్రీల అక్షరాస్యత 63%. 10% జనాభా 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు.

భూగోళికం

మార్చు

శ్రీరంగపట్టణం, 12°25′N 76°42′E / 12.41°N 76.7°E / 12.41; 76.7 లో గలదు. దీని సరాసరి ఎత్తు 679 మీటర్లు (2227 అడుగులు).

చరిత్ర

మార్చు

శ్రీరంగపట్టణం, విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుచున్నది. అంతేగాక మైసూరు రాజ్యపు రాజధానిగాను విరాజిల్లినది. రంగరాయను ఓడించి వడయార్ రాజు 1614 లో శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకున్నాడు.[2] విజయనగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్ రాజుకు విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది.

 
టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు
హైదర్, టిప్పు

హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం 'మైసూరు రాజ్యానికి' రాజధాని అయింది. టిప్పు సుల్తాన్ తన రాజ్యానికి ఖుదాదాద్ సల్తనత్ లేదా సల్తనత్ ఎ ఖుదాదాద్ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణానికి రాజధాని చేసుకుని, దక్షిణ భారత్ లోని పలు భాగాలను తన రాజ్యం క్రింద కలుపుకున్నాడు. ఇండో-ఇస్లామీయ నిర్మాణ శైలి లో టిప్పుసుల్తాన్ సమాధి, టిప్పూ పాలెస్, దరియా దౌలత్, జుమ్మా మసీదు లాంటి నిర్మాణాలు కానవస్తాయి.'1799' లో తన స్వంత అనుచరగణం విద్రోహచర్యవలన శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు.

ముఖ్యమైన ప్రదేశాలు

మార్చు

శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవి. వాటిలో ముఖ్యమైనవి:

గమనికలు

మార్చు
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  2. The fall of Srirangapattana to the Wodeyar dynasty in 1614 is much celebrated in local ballad and legend, one of which concerns a curse put upon the Wodeyars by Alamelamma, the lamenting wife of the defeated Vijayanagar viceroy. In fulfillment of that curse, no ruling Maharaja of Mysore has ever had children; the succession has inevitably devolved upon brothers, nephews or adopted heirs, or on children born to the Maharaja before his accession, but never has a child been born to a ruling Maharaja.
  3. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  4. "Shivasamudra Falls". Retrieved 2006-11-11.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు