శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)

తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, రంగాపూర్ గ్రామంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం.

శ్రీరంగనాయక స్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, రంగాపూర్ గ్రామంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం.[1] ఇది పానుగంటి నదీతీరాన ఉంది.[2]

శ్రీరంగనాయక స్వామి దేవాలయం
లోపలి నుండి ద్వారగోపురం
లోపలి నుండి ద్వారగోపురం
భౌగోళికం
భౌగోళికాంశాలు16°11′53″N 78°02′56″E / 16.198°N 78.049°E / 16.198; 78.049
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లావనపర్తి జిల్లా
ప్రదేశంరంగాపూర్, పెబ్బేరు మండలం
సంస్కృతి
దైవంశ్రీరంగనాయక స్వామి
ముఖ్యమైన పర్వాలుకోటై ఉత్సవాలు (సంక్రాంతి పండుగ)
రథోత్సవం (మార్చి)
శ్రావణ మాసం
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ18వ శతాబ్ధం

చరిత్ర

మార్చు

ఇది తెలంగాణలోని పురాతన దేవాలయాల్లో ఒక దేవాలయం. సా.శ.1650-70 మధ్యకాలంలో రాజు రామేశ్వర్ రావు వంశీయులు[3] వనపర్తి సంస్థానం[4] శ్రీరంగపూర్ లోని రత్న పుష్కరిని సరస్సు కట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు.[5][6] ఇది తమిళనాడులోని శ్రీరంగ దేవాలయాన్ని పోలివుంది.

ఒకసారి దక్షిణ దేశ యాత్రలకు వెళ్ళిన రాజా బహిరీ గోపాలరావు, శ్రీరంగ పట్టణాన్ని దర్శించి వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. తీర్థయాత్రల నుండి తిరిగివచ్చిన తరువాత ఒకరోజు రాత్రి రాజు కలలో శ్రీరంగనాథుస్వామి కనిపించి, తాను 'కానాయపల్లె' గ్రామంలోని వల్మీకములో ఉన్నానని, తీసుకొని వచ్చి ప్రత్రిష్టించి, ఆలయాన్ని నిర్మించి పూజలు చేయాలని' చెప్పాడు.[7] కలలో చెప్పినదాన్ని బట్టి వల్మీకములో శయనమూర్తియైన శ్రీరంగనాథుని విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని 'కొరివిపాడు' గ్రామానికి తీసుకొని వచ్చి ఆలయమును నిర్మించి ప్రతిష్ఠించాడు. అప్పటినుండి నుండి కొరివిపాడు గ్రామం శ్రీరంగాపురంగా పేరొందింది. ఆలయం చుట్టూ రాజా రామేశ్వరరావు శ్రీరంగ సముద్రము అనే పెద్ద చెరువును త్రవ్వించాడు. తర్వాత లక్ష్మీ తాయారు దేవాలయాన్ని కూడా నిర్మించాడు. చిత్రభాను సంవత్సరం మార్గశిర మాసంలో రాజా రామేశ్వరరావు ధర్మపత్ని శంకరమ్మ ఐదంతస్థుల తూర్పు రాజగోపురాన్ని నిర్మించింది.

పండుగలు

మార్చు

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో మూడు పండుగలను ఘనంగా జరుపుకుంటారు.

  • కోటై ఉత్సవాలు (సంక్రాంతి పండుగ)
  • రథోత్సవం (మార్చి)
  • శ్రావణ మాసం

రవాణా

మార్చు

పెబ్బేరు నుండి 10 కి.మీ.ల దూరంలో, వనపర్తి నుండి 25 కి.మీ.ల దూరంలో, హైదరాబాదు నుండి 160 కి.మీ.ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడికి 40 కి.మీ.ల దూరంలోని గద్వాల పట్టణంలో రైల్వే స్టేషను ఉంది.[8]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. "Trip to SriRangapur Temple, Pebbair -Wanaparthy District". india-drive. Archived from the original on 2020-06-22. Retrieved 2021-06-02.
  2. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 246
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 08-05-2009
  4. "Sri Ranganayaka Swamy Temple: Steeped in mythological epics". Telangana Today. 25 Jun 2017.
  5. "Srirangapuram Temple, Mahabubnagar Telangana Tourism". Temples in India. 5 January 2017.
  6. "Importance of the Destination". Pedia Desibantu. 16 October 2015.
  7. శ్రీ రంగనాయక స్వామి ఆలయం, శ్రీరంగాపురం, ఎన్.పిచ్చయ్య, మన దేవాలయాలు, సప్తగిరి ఆగష్టు 2006 పత్రిక ప్రచురించిన వ్యాసం.
  8. "Sri Ranganayaka Swamy Temple, Srirangapuram (V), Pebbair (M)". Telangana Govt.