శ్రీరస్తు శుభమస్తు (2016)
శ్రీరస్తు శుభమస్తు 2016 లో పరశురామ్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ కథాచిత్రం. ఇందులో అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి ముఖ్యపాత్రలు పోషించారు.[1]
శ్రీరస్తు శుభమస్తు | |
---|---|
![]() | |
దర్శకత్వం | పరశురామ్ |
రచన | పరశురామ్ (కథ, స్క్రీన్ ప్లే) |
నిర్మాత | అల్లు అరవింద్ |
తారాగణం | అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, తనికెళ్ళభరణి, సుబ్బరాజు, అలీ |
ఛాయాగ్రహణం | మణికందన్ |
కూర్పు | మార్తాండ్ కె.వెంకటేష్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
విడుదల తేదీ | August 5, 2016 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుకోటీశ్వరుడు (ప్రకాష్ రాజ్) కొడుకు సిరి (అల్లు శిరీష్). అనన్యను (లావణ్య త్రిపాఠీ)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. అనన్యది మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి (రావు రమేష్) అప్పుచేసైనా కూతురిని గారాబంగా చూసుకుంటుంటాడు. సిరి వాళ్ళనాన్న ఆడపిల్లలు డబ్బున్న అబ్బాయిలను ప్రేమపేరుతో వశపరచుకుంటారని అభిప్రాయం వెలిబుచ్చుతాడు. ఆయనమాట సత్యంకాదని భావించిన సిరి అది నిరూపించాలని అనుకుంటాడు. తరువాత సిరి అనన్యకు తనను తాను ఒక అనామకునిగా పరిచయం చేసుకుంటాడు. మెల్లగా వారిద్దరూ ఒకేరూములో నివసిస్తూ ఉంటారు. అలా సిరి అనన్యకు చేదోడువాదోడుగా ఉంటారు. క్రమంగా అనన్య సిరిని ఇష్టపడడం ప్రారంభిస్తుంది. అనుకోని మలుపుగా అనన్య తండ్రి ఆమెకు ఓ గొప్పింటి సంబంధం కుదిర్చాడు. తండ్రి మాట త్రోసిపుచ్చలేక అనన్య పెళ్ళికి అంగీకారం తెలియజేస్తుంది. సిరి తన ప్రేమను దక్కించుకుని తండ్రి అభిప్రాయం సరికాదని ఋజువు చేయడమే కథ.
తారాగణం
మార్చు- అల్లు శిరీష్
- లావణ్య త్రిపాఠి
- సుమలత
- ప్రకాష్ రాజ్
- తనికెళ్ళ భరణి
- రావు రమేష్
- ఆలీ
- సుబ్బరాజు
- ప్రతిభ
- రణధీర్ గట్ల
మూలాలు
మార్చు- ↑ Nadadhur, Srivathsan. "Srirastu Subhamastu: The 'family' hangover". thehindu.com. Retrieved 5 December 2017.