అల్లు శిరీష్

నటుడు

అల్లు శిరీష్ సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు అర్జున్ సోదరుడు. గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు. శిరీష్ కె. రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవం చిత్రంతో సినీరంగప్రవేశం చేసాడు.

అల్లు శిరీష్
Allu Sirish filmfare.jpg
షార్జాలో జరిగిన 2013 సైమా పురస్కారాలలో అల్లు శిరీష్
జననం
అల్లు శిరీష్

(1987-05-30) 1987 మే 30 (వయస్సు 34) [1]
ఇతర పేర్లుశిరీష్
వృత్తినటుడు,
పత్రిక ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు2013 నుండి ఇప్పటివరకు
బంధువులుఅల్లు అరవింద్, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాం చరణ్ తేజ

అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్ లో బాలనటుడుగా నటించాడు. తన సోదరుడు అల్లు అర్జున్ నటన, రాం చరణ్ నటన ప్రభావంతో తెలుగు సినిమారంగంలోకి అరంగేట్రం చేశాడు. ఆయనకు అనేక పెద్ద బ్యానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది. కానీ వాటిని తిరస్కరించాడు. ఎందుకంటే అపుడు అతనికి నటజీవితంపై విశ్వాసం లేకపోవటమే. కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలననే ఆత్మ విశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించుటను ఛాలెంజ్ గా తీసుకున్నాడు.[2]

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2013 గౌరవం అర్జున్ తెలుగు, తమిళ్ మొదటి సినిమా
2013 కొత్త జంట శిరీష్ తెలుగు
2016 శ్రీరస్తు శుభమస్తు సిరి తెలుగు

మూలాలుసవరించు

యితర లింకులుసవరించు