శ్రీరాంనగర్ (గరివిడి మండలం)

ఆంధ్రప్రదేశ్, విజయనగరం జిల్లా, గరివిడి మండల జనగణన పట్టణం

‌శ్రీరాంనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గరివిడి మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది చిన్న పట్టణమైన శ్రీరాంనగర్ మాంగనీసు ముడిఖనిజానికి ప్రసిద్ధి పొందింది. భారీ స్టీలు పరిశ్రమలకు ముడి సరుకైన క్రోమ్ ఖనిజం, ఇతర ఖనిజాలను ఉత్పత్తిచేసే ఫేకర్ (FACOR) - ఫెర్రో అల్లాయ్స్ కార్పోరేషన్ ఈ పట్టణానికి ఆయువుపట్టుగా ఉన్నాయి.ఫేకర్ పరిశ్రమను దుర్గాప్రసాద్ సరఫ్ జీ ప్రారంభించాడు.శ్రీరాంనగర్లో అనేక విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.

పట్టణం
పటం
Coordinates: 18°17′04″N 83°32′26″E / 18.2844°N 83.5406°E / 18.2844; 83.5406
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండలంగరివిడి మండలం
విస్తీర్ణం
 • మొత్తం7.72 కి.మీ2 (2.98 చ. మై)
జనాభా
 (2011)[1]
 • మొత్తం18,893
 • జనసాంద్రత2,400/కి.మీ2 (6,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1019
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)Edit this at Wikidata
WebsiteEdit this at Wikidata
శ్రీరాంనగర్ ఉన్నత పాఠశాల

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం శ్రీరామ్‌నగర్ పట్టణంలో మొత్తం 4,885 కుటుంబాలు నివసిస్తున్నాయి.2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధిలోని మొత్తం జనాభా 18,893 మంది ఉన్నారు. అందులో 9,357 మంది పురుషులు కాగా, 9,536 మంది మహిళలు ఉన్నారు.[2] సగటు సెక్స్ నిష్పత్తి 1,019.శ్రీరామ్‌నగర్ పట్టణ పరిధిలో నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1605 మంది ఉన్నారు.ఇది మొత్తం జనాభాలో 8% గా ఉంది. 0-6 సంవత్సరాల వయస్సు మధ్య 810 మంది మగ పిల్లలు, 795 ఆడపిల్లలు ఉన్నారు. చైల్డ్ సెక్స్ రేషియో 981, ఇది సగటు సెక్స్ రేషియో (1,019) కన్నా తక్కువ.అక్షరాస్యత రేటు 73%. విజయనగరం జిల్లా అక్షరాస్యత రేటు 58.9% తో పోలిస్తే శ్రీరామ్‌నగర్ అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 81.35% గా ఉంది. స్త్రీల అక్షరాస్యత రేటు 64.87% గా ఉంది.[2]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం శ్రీరామ్‌నగర్ పట్టణ జనాభా 19,550.వారిలో పురుషులు 50%, స్త్రీలు 50% ఉన్నారు. శ్రీరామ్‌నగర్ సగటు అక్షరాస్యత రేటు 64%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 73%, స్త్రీ అక్షరాస్యత 56%.

పరిశ్రమలు

మార్చు
 
ఫెర్రో అల్లాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్

శ్రీరామ్‌నగర్ పట్టణ పరిధిలో ఫెర్రో అల్లాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (FACOR) అనే సంస్థ 1955 లో సేథ్ శ్రీమాన్ దుర్గాప్రసాద్జీ సరాఫ్ (1911-1988) చే స్థాపించబడింది. ఇది భారతదేశంలో ఫెర్రోమాంగనీస్ మొదటి పెద్ద ఉత్పత్తిదారుగా ఇక్కడ అవతరించింది.[3]1956 సంవత్సరంలో ఫెర్రో అల్లాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభమైంది.దీని రిజిస్టర్డ్ కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద ఉంది.[4]ఉక్కు తయారీ ప్రక్రియలో ఫెర్రోలాయిలను డియోక్సిడైజర్లు, మిశ్రమం సంకలనాలుగా ఉపయోగిస్తారు.1957 లో ప్లాంట్ ఉత్పత్తిని ప్రారంభించింది. అధిక కార్బన్ ఫెర్రోమాంగనీస్, ఫెర్రోసిలికాన్ ఉత్పత్తికి మూడు కొలిమిలు ఉన్నాయి.ఈ సంస్థ స్వతంత్రంగా 1981 లో 16 ఎంవిఎ కొలిమిని ఏర్పాటు చేసింది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. 2.0 2.1 "Sriramnagar Population, Caste Data Vizianagaram Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-07-01. Retrieved 2020-07-01.
  3. "FACOR.Ferro Alloys Corporation Ltd". www.facorgroup.in. Retrieved 2020-07-01.
  4. "FACOR STEEL LTD,Nagpur". web.archive.org. 2010-10-16. Archived from the original on 2010-10-16. Retrieved 2020-07-01.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు