శ్రీరాంపూర్ మండలం

తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని మండలం

శ్రీరాంపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండల కేంద్రం.[1]

శ్రీరాంపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°27′10″N 79°31′40″E / 18.452906°N 79.527855°E / 18.452906; 79.527855
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి జిల్లా
మండల కేంద్రం శ్రీరాంపూర్ (శ్రీరాంపూర్ మండలం)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 190 km² (73.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 41,956
 - పురుషులు 21,125
 - స్త్రీలు 20,831
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.55%
 - పురుషులు 59.60%
 - స్త్రీలు 35.37%
పిన్‌కోడ్ 505153

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది..ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం శ్రీరాంపూర్.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

లోగడ శ్రీరాంపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీరాంపూర్ మండలాన్ని 24 ఇరవై నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 41,956 - పురుషులు 21,125 - స్త్రీలు 20,831.అక్షరాస్యత - మొత్తం 47.55% - పురుషులు 59.60% - స్త్రీలు 35.37%.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 190 చ.కి.మీ. కాగా, జనాభా 41,956. జనాభాలో పురుషులు 21,125 కాగా, స్త్రీల సంఖ్య 20,831. మండలంలో 12,033 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మడిపల్లి
  2. మంగపేట్
  3. వెన్నంపల్లి
  4. జాఫర్‌ఖాన్‌పేట్
  5. ఏదులాపురం
  6. కూనారం
  7. పెగడపల్లి
  8. గంగారం
  9. పెద్దంపేట్
  10. పందిళ్ళ
  11. శ్రీరాంపూర్
  12. రాతుపల్లి
  13. మోట్లపల్లి
  14. తారుపల్లి
  15. మల్లియల్
  16. మీర్జంపేట్
  17. కిస్టంపేట్

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. ఇప్పలపల్లి
  2. అంకం పల్లి
  3. అశాన్న పల్లి
  4. రాయపేట
  5. ఆరెపల్లి
  6. లక్ష్మీపురం
  7. మల్యాల

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు మార్చు