శ్రీరామ్ శర్మ
పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య (1911 సెప్టెంబరు 20 - 1990 జూన్ 2) భారతీయ రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు.[1][2] ఆయన ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ అనే సంస్థని స్థాపించాడు.[3] ఇందులో 150 మిలియన్ సభ్యులే కాక ప్రపంచవ్యాప్తంగా 5000 కేంద్రాలు ఉన్నాయి. దానికి అదనంగా దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ కూడా ఉంది.[4][5][6] ఆయన గాయత్రీ మంత్రం ప్రాముఖ్యతను ప్రచారంలోకి తెచ్చాడు.[7] అలాగే ఆయన మూడు వేల నాలుగు వందల కంటే ఎక్కువ బుక్‌లెట్ల రచయిత.[8][9] ఆయన మొత్తం వేద గ్రంథాల వ్యాఖ్యాత – వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. ఆయన శాస్త్రీయ ఆధ్యాత్మికతకు మార్గదర్శకుడు.
పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య | |
---|---|
జననం | ఆగ్రా, ఉత్తర ప్రదేశ్ | 1911 సెప్టెంబరు 20
నిర్యాణము | 1990 జూన్ 2 శాంతికుంజ్, హరిద్వార్, ఉత్తరాఖండ్ | (వయసు 78)
జాతీయత | భారతీయుడు |
భాగస్వా(ములు)మి | భగవతీ దేవి శర్మ |
పిల్లలు | శైలబాల పాండ్య |
తండ్రి | రూపకిషోర్ శర్మ |
తల్లి | మాతా దంకున్వరీ దేవి |
యుగ్ నిర్మాణ్ యోజన
మార్చుయుగ్ నిర్మాణ్ యోజన అనే అంతర్జాతీయ సామాజిక సంస్కరణ ఉద్యమం భగవతీ దేవి శర్మతో కలసి శ్రీరామ్ శర్మ స్థాపించాడు.[10][11][12][13] ఇది ప్రపంచ సాంస్కృతిక, ఆధ్యాత్మిక శుద్ధీకరణ, మేధో పునర్నిర్మాణం కోసం ప్రారంభించబడింది.[14][15] ఈ ఉద్యమం ప్రస్తుతం 87 దేశాల్లో,[16] భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో కూడా నడుస్తోంది.[17][18]
శాంతికుంజ్
మార్చుశాంతికుంజ్ హరిద్వార్‌లోని మతపరమైన పర్యాటక ఆకర్షణ మాత్రమేకాదు[19][20] ఆల్ వరల్డ్ గాయత్రీ పరివార్ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడే ఉంది.[21] శాంతికుంజ్‌ను 1971లో భగవతి దేవి శర్మతో కలసి శ్రీరామ్ శర్మ చిన్నగా స్థాపించాడు.[22][23] దీనిని గాయత్రీ నగర్ పేరు మీదుగా విస్తరించారు.
శాంతికుంజ్, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ రెండూ శైలబాలా పాండ్య నేతృత్వంలోని శ్రీ వేదమాత గాయత్రీ ట్రస్ట్ క్రింద పనిచేస్తాయి.[24]
దేశంలోని జాతీయ రహదారి 58లో హరిద్వార్ రైల్వే స్టేషన్ నుండి రిషికేశ్/డెహ్రాడూన్ వైపు 6 కిలోమీటర్ల దూరంలో శాంతికుంజ్ ఉంది. శాంతికుంజ్ చేరుకోవడానికి సమీప విమానాశ్రయాలు రెండు, అవి జాలీ గ్రాంట్ విమానాశ్రయం (డెహ్రాడూన్), ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.[25][26]
వ్యక్తిగత జీవితం
మార్చుశ్రీరామ్ శర్మ 1911 సెప్టెంబరు 20న ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జన్మించాడు.[27] సమాజాభివృద్ధి, అభ్యున్నతికి ఆయన అవిరల కృషి సల్పాడు.[28] ఆయన 78 యేళ్ల వయసులో 1990 జూన్ 2న తుదిశ్వాస విడిచాడు.[29][30] ఆయన మరణ తేదీ సందర్భంగా గాయత్రీ జయంతి, మహానిర్వాణ దివస్‌లను కలిసి జరుపుకుంటారు.[31] ఆయన సర్వేశ్వరానందను తన ఆధ్యాత్మిక గురువుగా భావించాడు.[32]
గుర్తింపు
మార్చు- 1991లో ఇండియా పోస్ట్ అతని చిత్రంతో కూడిన స్టాంపును విడుదల చేసింది.[33]
- 2022లో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శాంతికుంజ్‌లో ఆయనకు నివాళులర్పించాడు.[34][35][36][37]
మూలాలు
మార్చు- ↑ "महान स्वतंत्रता सेनानी थे पंडित श्रीराम शर्मा : सांसद". Amar Ujala (in హిందీ). Retrieved 2022-08-15.
- ↑ "जन्मदिन विशेष: श्रीराम शर्मा अाचार्य ऐसे बने स्वतंत्रता सेनानी से आध्यात्मिक गुरु". Navbharat Times (in హిందీ). Retrieved 2022-08-15.
- ↑ "श्रीराम शर्मा आचार्य के विचार". Dainik Bhaskar.
- ↑ "नवब्राह्मणवाद से मुक्ति की ज्योति". Jansatta (in హిందీ). Retrieved 2022-08-15.
- ↑ "PATRON FOUNDER (Pt. Shri Ram Sharma Acharya) - DSVV". DSVV (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-06. Retrieved 2022-08-15.
- ↑ Pioneer, The. "CM pays tribute to saint Pandit Shriram Sharma". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2022-08-15.
- ↑ "This day, that year: What happened on June 2 in history". News9Live (in ఇంగ్లీష్). 2022-06-02. Archived from the original on 2022-08-17. Retrieved 2022-08-17.
- ↑ Pioneer, The. "CM pays tribute to saint Pandit Shriram Sharma". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2022-08-15.
- ↑ "This day, that year: What happened on June 2 in history". News9Live (in ఇంగ్లీష్). 2022-06-02. Archived from the original on 2022-08-17. Retrieved 2022-08-17.
- ↑ Verma, Rajeev (2009). Faith & Philosophy of Hinduism (in ఇంగ్లీష్). Gyan Publishing House. ISBN 978-81-7835-718-8.
- ↑ "इसलिए दीपावली को पर्वों का राजा कहना गलत नहीं होगा". Navbharat Times (in హిందీ). Retrieved 2022-09-26.
- ↑ जोशी, अनिरुद्ध. "श्रीराम शर्मा आचार्य के जीवन के बारे में 11 तथ्य". hindi.webdunia.com (in హిందీ). Retrieved 2022-09-26.
- ↑ Ranade, Narayan Prasad (2022-08-03). Kahaan Hai Pramaan?: Nav Yug Avataran Ke (in హిందీ). Booksclinic Publishing. ISBN 978-93-5535-454-9.
- ↑ Hansa Yoga (in ఇంగ్లీష్). AWGP.
- ↑ Twenty-First century the dawn of the era of divine descent on earth (in ఇంగ్లీష్). AWGP.
- ↑ "श्रीराम आचार्य ने मथुरा से कियौ युग निर्माण कौ शंखनाद". Amar Ujala (in హిందీ). Retrieved 2022-09-26.
- ↑ "गायत्री परिवार ने युग निर्माण योजना को जन-जन तक पहुंचाने का लिया संकल्प". Dainik Bhaskar.
- ↑ "घर-घर गायत्री गंगाजली देवस्थापना कर घर-घर बनाना है मंदिर". Hindustan (in hindi). Retrieved 2022-09-26.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Shantikunj Gayatri Parivar Haridwar". Haridwar Tourism. Retrieved 2022-09-16.
- ↑ "Shantikunj Gayatri Parivar Haridwar - How to Reach Santikunj Haridwar". Uttrakhand Tourism. Retrieved 2022-09-16.
- ↑ Pariwar (AWGP), All World Gayatri. "Our Establishments". www.awgp.org. Retrieved 2022-09-16.
- ↑ "Shantikunj Gayatri Parivar Haridwar - How to Reach Santikunj Haridwar". www.euttaranchal.com. Retrieved 2022-09-16.
- ↑ Pariwar (AWGP), All World Gayatri. "History and Achievements". www.awgp.org. Retrieved 2022-09-16.
- ↑ Kumar, Ashish. A Citygraphy of Panchpuri Haridwar (in ఇంగ్లీష్). Clever Fox Publishing.
- ↑ "How to Reach Shantikunj by Road - Nearest Airport, Railway Station to Shantikunj". www.euttaranchal.com. Archived from the original on 2022-09-20. Retrieved 2022-09-16.
- ↑ "How to reach Shantikunj,Haridwar Uttarakhand India". www.uttarakhand-tourism.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-16.
- ↑ "Gayatri Pariwar: गायत्री परिवार के मुखिया आचार्य पंडित श्रीराम शर्मा का जन्मदिन आज, आंवलखेड़ा से ये रहा उनका खास नाता". Dainik Jagran (in హిందీ). Retrieved 2022-09-27.
- ↑ Pioneer, The. "CM pays tribute to saint Pandit Shriram Sharma". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2022-08-15.
- ↑ Pioneer, The. "CM pays tribute to saint Pandit Shriram Sharma". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2022-08-15.
- ↑ Yadav, Dhirendra (2019-09-20). "जन्मदिवस विशेषः गायत्री के आराधक Acharya shriram sharma के बारे में अनोखी जानकारी". Rajasthan Patrika (in హిందీ). Retrieved 2023-01-15.
- ↑ "पंडित श्रीराम शर्मा आचार्य के महाप्रयाण दिवस". Dainik Jagran.
- ↑ "एक भारतीय स्वतंत्रता सेनानी के हाथों प्रज्वलित वो सिद्ध 'अखण्ड दीपक', जो 1926 से लगातार जल रहा है". ScoopWhoop (in హిందీ). 2022-09-09. Retrieved 2023-01-15.
- ↑ "SRI RAM SHARMA ACHARYA". India Post. Retrieved 2022-08-15.
- ↑ "CM pays tribute to Shriram Sharma". Daily Pioneer.
- ↑ "CM Shri Chouhan paid obeisance to Pt. Shriram Sharma on his Jayanti". PNI News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-09-20. Retrieved 2022-08-15.
- ↑ "मप्रः सीएम शिवराज ने पंडित श्रीराम शर्मा की जयंती पर नमन किया". www.hindusthansamachar.in (in ఇంగ్లీష్). Retrieved 2022-09-26.
- ↑ "मुख्यमंत्री चौहान ने पंडित श्रीराम शर्मा की जयंती पर नमन किया". rajdhanimedia.in (in ఇంగ్లీష్). Retrieved 2022-09-26.