శ్రీవల్లీ 2017, సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ చలనచిత్రం. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్ కుమార్ బృందావన్ నిర్మాణ సారధ్యంలో కె. వి. విజయేంద్ర ప్రసాద్[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజత్ కృష్ణ, నేహాహింగే, రాజీవ్ కనకాల, హేమ తదితరులు నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది.

శ్రీవల్లీ
శ్రీవల్లీ సినిమా పోస్టర్
దర్శకత్వంకె. వి. విజయేంద్ర ప్రసాద్
రచనకె. వి. విజయేంద్ర ప్రసాద్
నిర్మాతసునీత, రాజ్ కుమార్ బృందావన్
తారాగణంనేహా హింగే, రజత్ కృష్ణ, రాజీవ్ కనకాల, హేమ
ఛాయాగ్రహణంరాజశేఖర్
కూర్పుతమ్మి రాజు
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
నిర్మాణ
సంస్థ
రేష్మా ఆర్ట్స్
విడుదల తేదీ
15 సెప్టెంబరు 2017
సినిమా నిడివి
120 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుతెలుగు
తమిళం
బడ్జెట్7 crore (US$8,80,000)

శ్రీవల్లీ (నేహా హింగే) సాధారణ కుటుంబానికి చెందిన యువతి. న్యూరో సర్జన్ రామచంద్ర (రాజీవ్ కనకాల) ఆమెపై చేసిన బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ ప్రయోగంలో తన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలలోని వ్యత్యాసాన్ని మరిచిపోతుంది. ఏది నిజం, ఏది మాయ అని అర్థం చేసుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితిలో పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది. బ్రెయిన్ ఎక్స్పరిమెంట్ చేస్తూ వున్నట్టుండి రాయచంద్ర రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని కోమాలోకి పోతాడు. మరి ఆ సమస్య నుంచి శ్రీవల్లీ ఎలా బయటపడింది అనేదే మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

ఇతర వివరాలు

మార్చు
  1. పూర్వజన్మల నేపథ్యంలో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలోని తొలి ఐదు నిమిషాల సన్నివేశానికి దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.
  2. మాజీ మిస్‌ ఇండియా నేహా హింగే టాప్‌లెస్‌గా నటించింది. కథరీత్యా ఆమె నీటిలో ఎక్కువ సేపు వుండాల్సివస్తుంది. సీన్‌పరంగా టాప్‌లెస్‌ వుండి, క్రిందిభాగం తడవాలి. ఆ సీన్ షూట్ చేసేటప్పుడు పురుషులెవ్వరూ ఆ ప్రాంతంలో లేకుండా, హీరోయిన్‌కు ఆ సీన్ ఎలా తీయాలో, కెమెరాను ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించి, ఆ షాట్‌ను హీరోయినే స్వయంగా తీసినట్లు, సీన్ చేసేటప్పుడు నిర్మాత సునీత మాత్రం హీరోయిన్‌తో ఉందని దర్శకుడు విజయేంద్రప్రసాద్ చెప్పాడు. 
  3. ఇందులో శ్రీవల్లిగా నేహా నటన హైలైట్‌గా నిలిచింది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. కానీ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది.

పాటలు

మార్చు

ఈ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. ఆదిత్యా మ్యూజిక్ కంపనీ ద్వారా పాటలు విడుదల అయ్యాయి.[2]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."లాలీ లాలీ (రచన: శివశక్తి దత్తా)"శివశక్తి దత్తాఎం.ఎం. శ్రీలేఖ2:10
2."సావరియా (రచన: అనంత శ్రీరామ్)"అనంత శ్రీరామ్ఎం.ఎం. శ్రీలేఖ3:14
3."చినుకై చినుకై (రచన: చైతన్య ప్రసాద్)"చైతన్య ప్రసాద్ఎం. ఆశీర్వాద్ లుకే,
శ్రీవిధ్య,
శ్రీకర్ జొన్నలగడ్డ
2:41
4."ఇలా ఇలా (రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు)"జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుఎం.ఎం. శ్రీలేఖ3:44
5."హర ఓం హర (రచన: భారతీబాబు)"భారతీబాబుసూర్య కార్తీక్2:00
మొత్తం నిడివి:13:49

మూలాలు

మార్చు
  1. "IndiaGlitz - It s a never heard before story in the world Vijayendra Prasad - Telugu Movie News". Retrieved 11 October 2019.
  2. "Srivalli (songs)". naasongs.com. Archived from the original on 2019-10-11. Retrieved 2019-10-11.

ఇతర లంకెలు

మార్చు