శ్రీ కృష్ణ జన్మభూమి

శ్రీ కృష్ణ జన్మభూమి అనేది మథుర నగరంలో ఉన్న ఒక ధార్మిక దేవాలయం. ఈ ఆలయం పురాతన హిందూ మత దేవుడైన శ్రీకృష్ణుడి జన్మస్థలం.[1][2] ఇది కంసునికి చెందిన ఒక జైలు గది, ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు.

Krishna Janmasthan Temple Complex
Keshavdeva Temple
మతం
అనుబంధంHinduism
జిల్లాMathura district
దైవంKeshavdeva
పరిపాలన సంస్థShri Krishna Janmasthan Seva Sansthan
పవిత్ర సంవత్సరం1958 (Keshavdeva Temple)
స్థితిActive
ప్రదేశం
ప్రదేశంMathura
రాష్ట్రంUttar Pradesh
దేశంIndia
శ్రీ కృష్ణ జన్మభూమి is located in Uttar Pradesh
శ్రీ కృష్ణ జన్మభూమి
Location in Uttar Pradesh
భౌగోళిక అంశాలు27°30′17″N 77°40′11″E / 27.504748°N 77.669754°E / 27.504748; 77.669754
వాస్తుశాస్త్రం.
నిధులుDalmia and Birla family
గ్రౌండ్‌బ్రేకింగ్1953 (modern temple complex)
పూర్తైనది1982
నాశనం1670 (former temple)
దేవాలయాలుThree

చరిత్ర

మార్చు

చరిత్రకారుల ప్రకారం ఈ జైలు గది 'గర్భ గృహ' గా పేరొందింది, ఈ ఆలయ ఆవరణమే కృష్ణుడు జన్మించిన కచ్చితమైన ప్రదేశం. ఈ జైలు గది గోడ కంసరాజు యొక్క క్రూరత్వాన్ని గుర్తుచేస్తుంది. అనేక విగ్రహాలు, పురాతన కాలానికి చెందిన శిల్పాలు ఇక్కడి తవ్వకాలలో కనిపించాయి. ఈ జైలు గది క్రమంగా మారి ప్రస్తుతం అందమైన దేవాలయమయింది. లక్షలాది భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో ఆలయం వద్దకు తరలి వస్తారు. ఇక్కడ పండుగ సమయాలలో జరిపే ఉత్సవాలు, వేడుకలు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. వేడుకలు శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన మధ్య రాత్రి సమయంలో ప్రారంభమవుతాయి.[1]

ప్రదేశం

మార్చు
 
శ్రీ కృష్ణ జన్మభూమికి సమీపంలో ఉన్న పొట్రా కుండ్ ఆలయ కోనేరు

శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన మథుర నగరం యమునా నది ఒడ్డున ఉన్నది, ఇది రాజధాని నగరం ఢిల్లీకి సుమారు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరం శ్రీకృష్ణ ప్రసిద్ధ కృష్ణ జన్మ భూమి మందిర్ భక్తులను అత్యంత గౌరవించే అతిధేయ ఆలయంగా ఖ్యాతి చెందింది. వేల సంవత్సరాల క్రితం ఈ ఆలయ ప్రదేశంలో భగవానుడు జన్మించాడని చెబుతుంటారు. పొరుగు పట్టణాలైన గోవర్ధన్, నందగావ్, బృందావన ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతం హిందువులకు ఒక ప్రధాన యాత్రా ప్రదేశం. ఈ ఆలయం మథుర నగరానికి మధ్యన ఉంది.[3]

పర్యాటక రంగం

మార్చు

మథురలో ఉన్న శ్రీ కృష్ణ జన్మభూమి ఆలయం భక్తులలో అత్యంత భక్తి విశ్వాసాలు నింపే ఆలయంగా ఉంది. దేవకి, వాసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించిన ఈ ప్రదేశం ప్రముఖ పవిత్రాలయంగా విరాజిల్లుతూ పర్యాటకులను ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-04. Retrieved 2015-09-06.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-09-06.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-04. Retrieved 2015-09-06.