శ్రీ కృష్ణ లీలా తరంగిణి
శ్రీ కృష్ణ లీలా తరంగిణి సుప్రసిద్ధ వాగ్గేయకారుడు నారాయణ తీర్ధులు రచించిన భక్తి కావ్యం. దీనిని భాగవతం లోని దశమ స్కందంలోని ప్రధాన ఘట్టాలను ప్రాతిపదికగా తీసుకొని రచనచేశాడు. దీనిలో 12 తరంగాలు, 156 కీర్తనలు ఉన్నాయి. దీనికోసం 36 రాగాలు వాడారు.
- 1వ తరంగం : శ్రీకృష్ణావతారం, కంస దౌష్ట్యం
- 2వ తరంగం : శ్రీకృష్ణ లీలలు - పూతన వధ, యమళార్జున భంజనం, మృద్భక్షణం, విశ్వరూప దర్శనం
- 3వ తరంగం : గోవత్సపాలనం, అఘాసుర వధ, బ్రహ్మ, యజ్ఞపత్నులు కృష్ణుని స్తుతించడం
- 4వ తరంగం : కాళీయ మర్దనం, ఖరప్రబలం, బాసుర వధ, దావాగ్ని భక్షణం
- 5వ తరంగం : గోపికా వస్త్రాపహరణం, గోవర్ధనోద్ధారణం
- 6వ తరంగం : శ్రీకృష్ణ గోపీ సమాగమం, ఆధ్యాత్మ తత్వ వివరణలు
- 7వ తరంగం : రాసక్రీడ, శ్రీకృష్ణాదైవతోపదేశం
- 8వ తరంగం : గోపికా గీతాలు
- 9వ తరంగం : అక్రూర సందేశం
- 10వ తరంగం : రాజకాది నిగ్రహం, కుబాప్రీణనం, చాణూర ముష్టికాది వధ, కంసవధ, పితృదర్శనం
- 11వ తరంగం : గోపికా విరహం, ఉద్దవ సందేశం, కాలయవన వధ, ముచకుంద స్తుతి, ద్వారకా ప్రవేశం
- 12వ తరంగం : రుక్మిణీ కళ్యాణం, అష్టమహిషీ కళ్యాణం