శ్రీకృష్ణావతారం

శ్రీ కృష్ణావతారం 1967 సంవత్సరంలో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. ఎన్.టి. రామారావు సమీప బంధువు అట్లూరి పుండరీకాక్షయ్య చిత్రాన్ని నిర్మించారు.[1] సముద్రాల రాఘవాచార్య రచన చేయగా, మాధవపెద్ది గోఖలే కళా దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుని అవతారం లోని ముఖ్యమైన ఘట్టాలన్నింటిని ఈ భారీ చిత్రంలో ప్రేక్షకుల కనులకు విందుగా అందించారు.

శ్రీ కృష్ణావతారం
(1967 తెలుగు సినిమా)
Shri Krishnavataram.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
నిర్మాణం అట్లూరి పుండరీకాక్షయ్య
తారాగణం నందమూరి తారక రామారావు,
దేవిక,
కాంచన,
శోభన్ బాబు,
ముక్కామల,
సత్యనారాయణ,
నాగయ్య,
సుకన్య,
హరికృష్ణ
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల, పి.సుశీల
నృత్యాలు వెంపటి చినసత్యం
గీతరచన సముద్రాల రాఘవాచార్య
తిరుపతి వేంకట కవులు (పద్యాలు)
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం అన్నయ్య
కూర్పు బి.కందస్వామి
నిర్మాణ సంస్థ తారకరామ పిక్చర్స్
నిడివి 211 నిమిషాలు
భాష తెలుగు
పెట్టుబడి 10 లక్షలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చిత్ర కథసవరించు

భాగవత, భారతాలను ఆధారం చేసుకుని, శ్రీకృష్ణుని కథలు అనేక కథలు, నాటకాలు, సినిమాలు కళారూపాలుగా వచ్చాయి. శ్రీకృష్ణలీలలు, కృష్ణమాయ, యశోదకృష్ణ, శ్రీకృష్ణతులాభారం, శ్రీకృష్ణవిజయం, శ్రీకృష్ణసత్య, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణాంజనేయయుద్ధం, పాండవవనవాసం, శ్రీకృష్ణపాండవీయం వంటి అసంఖ్యాక చిత్రాలు వచ్చాయి. శ్రీకృష్ణావతారం చిత్ర ప్రత్యేకత. అష్టమ గర్భంలో జన్మించే శిశువు వల్ల అతనికి మరణం సంభవిస్తుందని తెలియజేస్తుంది. కంసుడు (ముక్కామల) సోదరిని సంహరించబోగా వసుదేవుడు తమ సంతానాన్ని అతనికి అప్పగిస్తామని ఒప్పుకోగా వారిని తన రాజ్యంలో కారాగారంలో ఉంచి ఒక్కొక్క శిశువును సంహరిస్తూంటాడు. ఎనిమిదవ శిశువును యశోద దగ్గరవుంచి యోగమాయను శిశువు స్థానంలో ఉంచుతాడు. యోగమాయను చంపబోగా అతనిని సంహరించే శిశువు వేరే చోట పెరుగుతున్నాడని చెబుతుంది. రేపల్లెలో కృష్ణలీలలు, పూతన, చక్రాసురుడు వంటి వారిని చంపటం, కాళీయమర్దనం, కంససంహారం జరుగుతుంది. (’జయహే కృష్ణావతారా’ అనే పాట నేపథ్యంగా ఈ కథ అంతా జరుగుతుంది). తరువాత రుక్మిణి (దేవిక), జాంబవతి, సత్యభామ (కాంచన) లను కృష్ణుడు వివాహమాడుటాడు. (సత్రాజిత్ ప్రహసనం, జాంబవంతునితో యుద్ధం తరువాత). నారదుడు (శోభన బాబు) కృష్ణుని అష్టభార్యలతో కాపురాన్ని పరీక్షిస్తాడు. కుచేలుడు కృష్ణసందర్శనానికి వస్తాడు. కుచేలుడ్ని, అష్టభార్యల సమక్షంలో కృష్ణుడు సేవిస్తాడు. తాను తెచ్చిన కానుక చూపడానికి బిడియపడుతున్న కుచేలుని దగ్గరనుండి అటుకులు స్వీకరిస్తాడు. చిత్రంలో బిగి ఈ సన్నివేశం నుండే ప్రారంభమౌతుంది. అప్పటి వరకు కృష్ణలీలలు, ప్రణయాలతో సాగిన చిత్రం ఇక్కడనుండి భాగవతంనుండి మహాభారరతంలోకి ప్రవేశిస్తుంది. చిత్రం సగభాగం వరకూ పాండవులు కనిపించరు. కౌరవపాండవులు ప్రవేశం 'పాండవోద్యోగ విజయం'లోని పడకసీనుతో ప్రారంభమౌతుంది. తిరుపతి వేంకట కవుల నాటక పద్యాలను విరివిగా చిత్రంలోఉపయోగించారు. రాయబారం చిత్రీకరణలో మిగతా చిత్రాలకు భిన్నంగా రాయబారం మూడు రోజులు సాగినట్లు చూపడం చిత్ర ప్రత్యేకత. సుమారు 60 నిముషాలు చిత్రం సాగే రాయబారంలో కర్ణుని పాత్ర, అశ్వత్థామ పాత్రలకు పద్యాలు, సంభాషణలు చిత్రీకరింపబడ్డాయి. దానవీరసూర కర్ణలో కర్ణుని పాత్రకన్నా ఈ చిత్రంలో కర్ణ పాత్రకు ఎక్కువ సంభాషణలు, పద్యాలు వుండటం విశేషం. కురుక్షేత్ర యుద్ధానంతరం ధృతరాష్ట్రుని వద్దకు పాండవులు రావటం, ధృతరాష్ట్ర కౌగిలి చిత్రీకరణ, చిత్తూరి నాగయ్య అమోఘ నటన కూడా పేర్కొనదగినది. గాంధారీ శాపం తద్వారా యదుకుల వినాశం, కృష్ణ నిర్యాణంతో చిత్రం ముగుస్తుంది.

పాత్రలు-పాత్రధారులుసవరించు

చిత్ర విశేషాలుసవరించు

  1. నందమూరి హరికృష్ణ తొలిసారిగా బాలకృష్ణునిగా చిత్రంలో నటించారు.
  2. సీతారామ కళ్యాణంలో నారదునిగా నటించిన కాంతారావుకు నారద పాత్ర అంకితం చేశానని ఆపాత్రలో తానెప్పుడూ ఇతరులను చూడలేనని ఒక సందర్భంలో చెప్పిన రామారావు ఈ చిత్రంలో నారద పాత్రను శోభన్ బాబుతో ధరింపజేశారు. రహస్యం చిత్రంలో నటించే నిమిత్తం కాంతారావు హైదరాబాద్ లో వుండటం రామారావు ఆగ్రహానికి కారణమయ్యింది.
  3. రాజనాల శిశుపాలునిగా నటించారు. శ్రీకృష్ణ పాండవీయంలో కూడా ఇదే పాత్ర ఆయన ధరించారు. ఐతే అందులోఉన్నంత నిడివి, చిత్రీకరణ విలువలు ఇందులో లేవు.
  4. ఆంజనేయ పాత్రలకు ఖ్యాతి పొందిన అర్జా జనార్ధనరావు ఇందులో భీముని పాత్ర పోషించారు.
  5. సుయోధనునిగా కైకాల సత్యనారాయణ అమోఘంగా నటించారు. (తరువాత కురుక్షేత్రంలో (కమలాకర దర్శకత్వం లో) అదే పాత్ర పోషించారు)

పద్యాలు-పాటలుసవరించు

01. అదిగో అల్లదిగో కురుక్షేత్రమున కదనదుందుభులు మ్రోగే - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: సి.నారాయణరెడ్డి
02. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
03. ఆయుధమును ధరింప అనినిక్కముగా నొకపట్ల ఊరకే (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
04. ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో కడతేరక ఎల్ల (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
05. ఈ శిరోజముల్ చేపట్టి ఈడ్చినట్టి ద్రోహి చెయ్యి తునాతునకలై (పద్యం) - ఎస్. వరలక్ష్మి- రచన: తిరుపతి వేంకట కవులు
06. ఊరకచూచు చుండుమనుట ఒప్పితికాని భవధధృ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
07. ఏమేమో అవుతుంది ఎగిసి ఎగిసి పోతుంది రేలుపవలు తెలియని - పి.సుశీల
08. ఐనను పోయిరావలయు హస్తినకు అచట సంధిమాట (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
09. ఒక్కనిచేసి నన్నిచట ఉక్కడగింపదలంచినావే నేనెక్కడ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
10. కులమా గోత్రమా విద్యాకలితుడా (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు - రచన: సముద్రాల రాఘవాచార్య
11. కూడున్ గుడ్డుయొసంగి బ్రోచువిభునొక్కండెవ్వడో వచ్చి (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు- రచన: తిరుపతి వేంకట కవులు
12. కృష్ణా గోవిందా ద్వారకావాసా గోపీజనప్రియా - ఎస్.వరలక్ష్మి - రచన: సముద్రాల రాఘవాచార్య
13. కౌరవపాండవుల్ పెనగుకాలము చేరువఅయ్యె మాకు (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: తిరుపతి వేంకట కవులు
14. చిలుకలకొలికిని చూడు నీకళలకు సరిపడుజోడు చెంగుచెంగున - ఎల్. ఆర్. ఈశ్వరి
15. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
16. జెంఢాపై కపిరాజు ముందుసితవాజిశ్రేణియున్ పూన్చి (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
17. జయహే కృష్ణావతారా నంద యశోద పుణ్యావతార - ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, సరోజిని, స్వర్ణలత బృందం - రచన: సముద్రాల రాఘవాచార్య
18. జగముల నేలే గోపాలుడే నా సిగలో పూవౌను - పి.సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: సి.నారాయణరెడ్డి
19. తనువుతో కలుగు భాంధవ్యములెల్ల తనువుతో నశియించి - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: సముద్రాల రాఘవాచార్య
20. తనయులు వినిచెదవో ఈ తనయులతో ఏమియని (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
21. నందకుమార యుద్ధమున నా రధముందు వసింపుమయ్యా (పద్యం) - ?- రచన: తిరుపతి వేంకట కవులు
22. నిదురవోచుంటివో లేక బెదరి పల్కుచుంటివో (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
23. నేతాళలేనే ఓ చెలియా .. నేతాళలేనే ఓ చెలియా - ఘంటసాల వెంకటేశ్వరరావు
24. నీ చరణకమలాల నీడయే చాలు ఎందుకోయీ స్వామి - పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల - రచన: సి.నారాయణరెడ్డి
25. నీ మధుమురళీ గానమున నా మనము బృందావనము - పి.లీల
26. పరిత్రాణాయా సాధూనాం వినాశాయచ దుష్క­­ృతాం (శ్లోకం) - ఘంటసాల వెంకటేశ్వరావు
27. పాండవపక్షపాతము భవన్మతమరలించెగాక ( పద్యం) - మాధవపెద్ది సత్యం
28. బావా.. ఎప్పుడు వచ్చితీవు సుఖులే భ్రాతల్ సుతుల్ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
29. బావా.. ఎక్కడనుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
30. బకునిన్ చంపితి రూపిమాపతి హిడంబాసోదరున్ (పద్యం) - మాధవపెద్ది సత్యం
31. మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం) - పిఠాపురం నాగేశ్వరరావు
32. ముందుగ వచ్చితీవు మున్‌ముందుగ అర్జును నేను చూచితిన్ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
33. మీతమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడ (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
34. విన్నారా వన్నెల కృష్ణుని వరాల పాటలు విన్నారా - పి.లీల బృందం
35. శృంగార రస సర్వస్వం శిఖిపించ విభూషణం అంగీకృత (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
36. సేవాధర్మము సూత ధర్మమును రాసీభూతమై ఒప్ప (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు
37. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రంగూర్చుచో (పద్యం) - ఘంటసాల వెంకటేశ్వరరావు - రచన: తిరుపతి వేంకట కవులు
38. సమరము చేయరే బలము చాలిన నల్వురు చూచు చుండ (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: తిరుపతి వేంకట కవులు

మూలాలుసవరించు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (15 October 1967). "శ్రీకృష్ణావతారం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 11 October 2017.[permanent dead link]

నీ చరణ కమలాల నీడయే చాలు పాట లిరిక్స్ విశ్లేషణ - కొన్ని అరుదైన , అపురూపమైన పాటల్ని లోతైన విశ్లేషణలతో ఈ వేదిక … పాటను యధాతధంగా కాదు అందులోని లోతైన అర్థాన్నీ , అంతరార్థాన్ని , అంతకన్నా మించి పాట లోలోతుల్లో కదలాడుతున్న, కవితాత్మక , తాత్విక రసగుళికల్ని, మీ హృదయంలోకి ఒంపుతుంది. పాట విశ్లేషణ కొరకు https://www.teluguoldsongs.net/2021/01/blog-post.html తెలుగు పాత పాటల విశ్లేషణ బ్లాగ్

బయటి లింకులుసవరించు