శ్రీ గణేష్ నారాయణన్

శ్రీ గణేష్ నారాయణన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ విజయం సాధించాడు.[2][3]

శ్రీ గణేష్ నారాయణన్

ఎమ్మెల్యే
పదవీ కాలం
 4 జూన్ 2024
ముందు లాస్య నందిత
నియోజకవర్గం కంటోన్మెంట్

వ్యక్తిగత వివరాలు

జననం 1978 ఆగ‌స్టు 8
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ ఐఎన్‌సీ
ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్
తల్లిదండ్రులు ఎం.నారాయణన్
జీవిత భాగస్వామి వర్ష
సంతానం ముకుల్
నివాసం సుబ్బారావు కాలనీ, పికెట్, సికింద్రాబాద్, తెలంగాణ[1]

రాజకీయ జీవితం

మార్చు

శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2014, 2018 ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరాడు.అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే జీ. సాయన్న హఠాన్మరణం చెందడంతో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌ తనకే దక్కుతుందని ఆశించాడు. కానీ సాయన్న కుమార్తె లాస్యనందితకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కేటాయించడంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో 17, 169 ఓట్ల తేడాతో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచాడు. ఆ ఎన్నికల్లో లాస్య నందితకు 59,057 ఓట్లు రాగా, శ్రీ గణేష్ కు 41,888 ఓట్లు పోలయ్యాయి.

2023లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత ఫిబ్రవరి 23న పటాన్ చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. శ్రీ గణేష్ ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి మార్చి 19న కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా,[4] ఆయనను పేరును కంటోన్మెంట్ అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఏప్రిల్ 6న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.[5][6][7]

శ్రీ గణేష్ నారాయణన్ 2024 మే 13న జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి టీ.ఎన్. వంశీ తిలక్ పై 13206 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[8][9][10]

మూలాలు

మార్చు
  1. Sakshi (2023). "Sri Ganesh Narayanan Election Affidavit 2023" (PDF). Archived from the original (PDF) on 18 May 2024. Retrieved 18 May 2024.
  2. NT News (6 April 2024). "కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్‌". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  3. "Narayan Sri Ganesh is Congress Candidate for Secunderabad Contonment Assembly Bypoll" (in ఇంగ్లీష్). 6 April 2024. Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  4. Andhrajyothy (20 March 2024). "ఉదయం బీజేపీ అభ్యర్థి ప్రచారంలో.. మధ్యాహ్నం కాంగ్రెస్‏లోకి." Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  5. 10TV Telugu (6 April 2024). "కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ" (in Telugu). Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  6. EENADU (6 April 2024). "కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నారాయణన్ శ్రీగణేశ్‌". Archived from the original on 18 May 2024. Retrieved 18 May 2024.
  7. The News Minute (6 April 2024). "Congress names Sri Ganesh as candidate for Secunderabad Cantt by-election" (in ఇంగ్లీష్). Retrieved 18 May 2024.
  8. Election Commision of India (4 June 2024). "2024 Cantonment Assembly Bye Election". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  9. Sakshi (5 June 2024). "కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ గెలుపు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  10. Andhrajyothy (5 June 2024). "గ్రేటర్‌లో కాంగ్రెస్‌ బోణీ.. కంటోన్మెంట్‌లో పాగా వేసిన హస్తం పార్టీ". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.