జ్ఞాని లాస్య నందిత (1986 - 2024 ఫిబ్రవరి 23)[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైంది.

జ్ఞాని లాస్య నందిత

ఎమ్మెల్యే
పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - 2024 ఫిబ్రవరి 23
నియోజకవర్గం కంటోన్మెంట్

కవాడిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ
పదవీ కాలం
  2016 - 2021

వ్యక్తిగత వివరాలు

జననం 1987
చిక్కడపల్లి, హైదరాబాదు, తెలంగాణ
మరణం 2024 ఫిబ్రవరి 23
పటాన్‌చెరు, సంగారెడ్డి జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు జి. సాయన్న, గీత
నివాసం అశోక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ
గృహలక్ష్మి కాలనీ, కార్ఖానా, సికింద్రాబాద్, తెలంగాణ

లాస్య నందిత 2023లో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ శాసనసభ నియోజకవర్గం నుండి భారత్ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయింది.[2][3][4][5]

జననం, విద్యాభ్యాసం మార్చు

లాస్య నందిత హైదరాబాద్, అశోక్ నగర్ లో జి. సాయన్న, గీత దంపతులకు జన్మించింది.[6] ఆమె కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేసింది.[7]

రాజకీయ జీవితం మార్చు

లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే జి. సాయన్న అడుగుజాడల్లో 2015లో రాజకీయాల్లోకి వచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలిగా పోటీ చేసి ఓడిపోయింది. అనంతరం ఆమె తన తండ్రితో పాటు బీఆర్ఎస్ పార్టీలో చేరి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైంది.[8][9] ఆమె 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయింది.[10]

కంటోన్మెంట్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్య కారణలతో మరణించడంతో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ను లాస్య నందితకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ కేటాయించింది.[11][12]

మరణం మార్చు

లాస్య నందిత 2024 ఫిబ్రవరి 23న ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ సమీపంలో సుల్తాన్‌పూర్‌ సమీపంలో రోడ్డు రైలింగ్‌ను ఢీ కొట్టడంతో అదుపుతప్పి మరణించింది.[13][14][15] ఆమె అంత్యక్రియలను మారేడ్‌పల్లి శ్మశానవాటికలో రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించారు.[16]

ఇతర ప్రమాదాలు మార్చు

  1. 2023 డిసెంబర్ 24న బోయినపల్లిలోని వీఆర్ హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వగా కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఆమె ఎక్కిన లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో కాసేపటి వరకు లిఫ్ట్ డోర్ తెరుచుకోలేదు, దింతో హాస్పిటల్ సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి లాస్య నందితతో పాటు మిగతా వారిని సురక్షితంగా బయటకు తెచ్చారు.[17]
  2. 2024 ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ బయలుదేరగా నార్కట్‌పల్లి చర్లపల్లి వద్ద రాగానే ఎమ్మెల్యే కారును మరో కారు ఢీకొట్టడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న నార్కట్‌పల్లి పీఎస్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న కిషోర్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.[18]

మూలాలు మార్చు

  1. "BRS MLA Lasya Nanditha killed in road accident; Who was the lawmaker?". mint (in ఇంగ్లీష్). 2024-02-23. Retrieved 2024-02-23.
  2. Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  3. Eenadu (21 November 2023). "నాన్న బాట.. గెలుపు వేట". Archived from the original on 21 November 2023. Retrieved 21 November 2023.
  4. Eenadu (4 December 2023). "తొలి అడుగులోనే సంచలన గెలుపు". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  5. "సత్తా చాటిన నారీమణులు ఇద్దరే |". web.archive.org. 2024-02-23. Archived from the original on 2024-02-23. Retrieved 2024-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. Namasthe Telangana (29 August 2023). "సాయన్న బిడ్డగా ఆశీర్వదించండి." Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  7. Namasthe Telangana (25 August 2023). "నాయకుడు ఆకాశంలోంచి ఊడిపడడు.. ప్రజల్లోంచి వస్తాడు.. కేసీఆర్‌ అలాంటి నాయకుడే : సాయన్న కూతురు లాస్య నందిత". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  8. "GHMC Election Results Ward wise - 2016" (PDF).
  9. Namasthe Telangana (22 August 2023). "అసెంబ్లీ బరిలో కొత్త అభ్యర్థులు.. బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ఏడుగురికి అవకాశం". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  10. Mana Telangana (20 November 2020). "టిఆర్‌ఎస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
  11. V6 Velugu (21 August 2023). "ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే..." Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. Andhrajyothy (8 December 2023). "గడ్డు పరిస్థితులను అధిగమించి.. మొదటిసారి అసెంబ్లీలోకి..." Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  13. "కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి | MLA Lasya Nanditha Died Car Accident Updates - Sakshi". web.archive.org. 2024-02-23. Archived from the original on 2024-02-23. Retrieved 2024-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. Sakshi (23 February 2024). "కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి". Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.
  15. Andhrajyothy (24 February 2024). "బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  16. Namasthe Telangana (24 February 2024). "అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
  17. NTV Telugu (24 December 2023). "లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే లాస్య నందిత!". Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.
  18. 10TV Telugu (13 February 2024). "మహిళా ఎమ్మెల్యే కారు ఢీకొని హోంగార్డు మృతి" (in Telugu). Archived from the original on 23 February 2024. Retrieved 23 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)