శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం (నెల్లూరు)

(శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం, నెల్లూరు నుండి దారిమార్పు చెందింది)

[మూలాలు తెలుపవలెను]

నెల్లూరు నగరం మూలాపేటలో శివుని ప్రఖ్యాతి గాంచిన పురాతన ఆలయం శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం 6 వ శతాబ్దానికి చెందిన ఆలయమని చెబుతుంటారు. శివరాత్రి పర్వదినంనాడు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దేవాలయం మహిమాన్వితమైనదని ఇక్కడి శివలింగాన్ని పూజించి కోరికలను విన్నవిస్తే అవి కచ్చితంగా ఫలిస్తాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి తిక్కన సోమయాజి ఈ దేవాలయంలోని శివుని పూజించిన తరువాతనే తన రచనను ప్రారంభించాడని చెబుతుంటారు.1400 సంవత్సరాల క్రితం నాటిదిగా భావించే ఈ ఆలయం నెల్లూరు నగరంలో పడమర వైపు ఉంది.

పరమశివుడు ఒక ఉసిరి చెట్టు కింద తన ప్రణాళికను సిద్ధం చేసుకొని తానే స్వయంగా ఆలయాన్ని నిర్మించుకొన్నట్లు పురాణ కథనం. మనుమసిద్ధి మహారాజు ఈ ఆలయ రాజ గోపురాన్ని నిర్మించాడు. ఈ ఆలయ పురాతన చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు లేవు లేదా దాచిపెట్టుండవచ్చు.

బయటి లింకులు

మార్చు