రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ

(శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్స్ నుండి దారిమార్పు చెందింది)

శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ దక్షిణ భారతదేశపు సినీ నిర్మాణసంస్థ. దీనికి అధిపతులు కడారు నాగభూషణం, కన్నాంబ. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళభాషల్లో సుమారు 22 చిత్రాలు నిర్మించారు. ’సుమతి‘ (42), పాదుకాపట్టాభిషేకం (54), సౌదామిని (51), పేదరైతు (52), లక్ష్మి (53), సతీ సక్కుబాయి (54), శ్రీకృష్ణతులాభారం (55), నాగపంచమి (56) మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది. జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది. ప్రతి నెలా ఒకటో తేదీ రాకుముందే, ముందు నెల చివరి రోజునే స్టాఫ్‌కి జీతాలు ఇచ్చేసేది ఆ కంపెనీ! వారి ఆఫీసు కూడా విశాలమైన కాంపౌండులో, కార్లు, వాన్‌లతో కలకల్లాడుతూ ఉండేది.

రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ సంస్థ అధిపతులలో ఒకరైన కన్నాంబ దృశ్యచిత్రం

నిర్మించిన సినిమాలు మార్చు

1940లు మార్చు

1950లు మార్చు

1960లు మార్చు

బయటి లింకులు మార్చు