శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం

శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని ఒక వన్యప్రాణుల అభయారణ్యం. జెర్డాంస్ కోర్సర్ అనే అరుదైన, అంతరిస్తున్న పక్షి ప్రపంచంలోకెల్లా కేవలం ఈ అడవుల్లోనే కనిపిస్తుంది. సుమారు 176 జాతుల వృక్షాలు మరియు జంతువులు ఇక్కడ ఉన్నాయి.[1]

శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
లంకమల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
IUCN category IV (habitat/species management area)
ప్రదేశంకడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశం
సమీప నగరంకడప
భౌగోళికాంశాలు14°36′N 78°53′E / 14.600°N 78.883°E / 14.600; 78.883Coordinates: 14°36′N 78°53′E / 14.600°N 78.883°E / 14.600; 78.883
విస్తీర్ణం464.42 kమీ2 (4.9990×109 చ .అ)

చరిత్రEdit

అభయారణ్యం " జెర్డంస్ కర్సర్ " పక్షులకు ప్రసిద్ధిచెందింది. ఇది తీవ్రంగా అంతరించిపోతున్న పక్షిజాతికి చెందినదిగా భావిస్తున్నారు. ఈ పక్షి మొదటిసారిగా 1848లో థామస్ సి. జెర్డంస్‌ చేత కనుగొనబడింది. దీనిని తిరిగి 1996లో తిరిగి ఈప్రాంతంలో కనుగొన్నారు.[2] ఈ పక్షి ఇప్పుడు అరుదుగా కొన్ని అరణ్య ప్రాంతాలలో మరియు శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యంలో కనిపిస్తుంది.

వృక్షజాలం మరియు జంతుజాలంEdit

అభయారణ్యంలో 1400 మొక్కల జాతులు మరియు 176 చెట్ల కుటుంబాలు మరియు లివింగ్ ఆర్గానిజంస్ ఉన్నాయి. అభయారణ్యప్రాంతంలో లోతైన లోయలు, నిటారైన కొండలు ఆకురాల్చు అరణ్యం ఉంది. ఇక్కడ ఎర్రచందనం మరియు స్థానిక జాతి చెట్లు ఉన్నాయి.[3]

అభయారణ్యంలో చిరుతపులి, స్లాత్ బీర్, జింక, సాంబార్, చౌసింగా, చొంకారా, నీల్గాయ్, అడవిపంది మరియు జెర్డంస్ కర్సర్ మొదలగు ప్రాణులు ఉన్నాయి. [4]

సందర్శనకు అనుకూలమైన కాలంEdit

అభయారణ్యం సందర్శించడానికి సందర్శకులకు సంవత్సరం మొత్తం అనుమతి ఉన్నప్పటికీ సందర్శించడానికి అక్టోబరు నుండి మార్చి వరకూ అనుకూలంగా ఉంటుంది. [5] అభయారణ్య సమీపంలోని కడప చేరుకుని అభయారణ్యానికి సులువుగా చేరుకోవచ్చు. [6]

  • చేరుకోవడం : కడప రైల్వే స్టేషన్ నుండి రహదారి మార్గంలో 60కి.మీ. ప్రయాణించి చేరుకోవచ్చు.
  • వసతి సౌకర్యం: సిద్ధవటం మరియు కడప వద్ద ఫారెస్ట్ రెస్ట్ హౌస్‌లలో వసతి సౌకర్యం లభిస్తుంది.
  • సీజన్ : అక్టోబరు నుండి మార్చి వరకు.

మూలాలుEdit

  1. డిస్కవర్డ్ ఇండియా వెబ్ సైటులో పేజీ
  2. http://zeenews.india.com/news/eco-news/endangered-jerdons-courser-on-centres-priority-list_686915.html
  3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-24. Cite web requires |website= (help)
  4. http://www.kadapa.info/subpage14.html/
  5. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2014-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-24. Cite web requires |website= (help)
  6. http://www.indiamapped.com/wildlife-sanctuaries-in-india/andhra-pradesh-srilanka-malleswara-wildlife-sanctuary/