శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, వేపంజేరి

శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం చిత్తూరు జిల్లా వేపంజేరిలో ఉన్న ఒక దేవాలయం.[1] శ్రీమహావిష్ణువు నరసింహ స్వామి రూపంలో లక్ష్మీదేవీ సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నాడు. ఇక్కడ ప్రధాన ఆలయం పరిధిలో 21 ఆలయాల సముదాయం ఉండటం గమనార్హం. ఈ దేవాలయం జిల్లా ప్రధాన పట్టణమైన చిత్తూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్ర

మార్చు

ఈ ఆలయం గురించి చరిత్రలో మొట్టమొదటగా సా.శ. 1178 - 1218 సంవత్సరాల మధ్యలో కనిపిస్తున్నది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మూడవ కులోత్తుంగ చోళుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 14, 15 వ శతాబ్దాల్లో ఫ్రెంచి వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆలయ పరిస్థితి బాగా దిగజారిపోయింది. మరల 1986 లో కోమండూరు కుటుంబం వారు దీన్ని పల్లవుల నిర్మాణశైలిలో జీర్ణోద్ధరణ గావించారు. ప్రతియేడు జరిగే బ్రహ్మోత్సవాలకు ఇక్కడ యాత్రికులు పెద్ద ఎత్తున వస్తుంటారు.

వేపంజేరి అసలు పేరు వే పంచ హరి. అంటే మానవుడు తెలిసీ తెలియక చేసే పాపాలను హరించే క్షేత్రం కనుక వేపంచహరి అని పేరు వచ్చింది. ఇది కాలక్రమేణా వేపంజేరిగా మారింది. ఈ ఆలయ ప్రాంగణంలో 21 అడుగుల శ్రీ మహావిష్ణువు దశావతార విగ్రహం ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో గల ఏకైక అష్టలక్ష్మిదేవాలయం ఇక్కడే ఉండటం విశేషం.[2]

పూజలు

మార్చు

విష్ణువుకు ప్రీతిపాత్రమైన మాఘమాస పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తారు.[3]

సౌకర్యాలు

మార్చు

భక్తుల విడిదికోసం తక్కువ అద్దెతో గృహాలు నిర్మించారు. ప్రతి ఆదివారం ఆలయంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు జరిగే సమయాల్లో భక్తులకోసం ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదలు వివాహాలు చేసుకొనేందుకు కల్యాణ మండపాన్ని ఉచితంగా ఇస్తున్నారు.[4]

మూలాలు

మార్చు
  1. "చిత్తూరు జిల్లా ప్రభుత్వ వెబ్ సైటులో వేపంజేరి లక్ష్మీనరసింహ దేవాలయం గురించి". chittoor.ap.gov.in. చిత్తూరు జిల్లా ప్రభుత్వం. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 12 October 2016.
  2. http://www.suryaa.com/features/article.asp?subcategory=3&contentId=93[permanent dead link]
  3. http://www.suryaa.com/local-news/article.asp?category=3&ContentId=120415[permanent dead link]
  4. "వేపంజేరి.. ఆధ్యాత్మిక పందిరి". dailyhunt.in. ఈనాడు. Retrieved 12 October 2016.