శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం-ఈడూరు

శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం లోని ఈడూరులో నెలకొని ఉన్న ప్రసిద్ధ ఆలయం.

శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం
శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం
విశేష అలంకరణలతో శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి వారు
శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం is located in ఆంధ్రప్రదేశ్
శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం
శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :16°42′N 81°36′E / 16.7°N 81.6°E / 16.7; 81.6
పేరు
ప్రధాన పేరు :శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:పశ్చిమగోదావరి జిల్లా
ప్రదేశం:ఈడూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వేంకటేశ్వరుడు

దేవాలయ నిర్మాణం

మార్చు

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో ఫిబ్రవరి 17 2005 న శ్రీ భూ నీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం నిర్మాణం జరిగింది.క్ రమంగా స్వామివారి మహిమ గుర్తింంచిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తూ కోరిన వరాలు ఇచ్చే దేవునిగా "శ్రీ వరాలవేంకటేశ్వరుని"గా ప్రసిద్ధి చెందారు. మనసులో కొరిక తలచుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి వారి మొక్కును చెల్లించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా మారింది. ఈడూరు శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి దేవాలయం "బుల్లి తిరుపతి "గా ప్రసిద్ధిగాంచింది .

దేవాలయ అభివృద్ధి పనులు

మార్చు

ముందుగా చిన్న గుడిగా నిర్మాణమైన ఈ గుడి దాతల సహకారంతో గుడి చుట్టూ ప్రాకారం, రాజగోపురం నిర్మాణం జరిగింది. రథోత్సవాల కోసం రథం తయారు చేయించారు. మకరతోరణం, గరుడవాహనం, శేషవాహనం కూడా స్వామి వారికి సమకూర్చడం జరిగింది.

దేవాలయంలో జరిగే కార్యక్రమాలు

మార్చు

సకల లోకాధిపతి దేవతా సార్వభౌముడు కలియుగ ప్రత్యక్ష దేవుడు సృష్టి స్థితి లయకారకుడు అగు శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యమే ఈ కలియుగంలో ముక్తిమార్గమని ఇచ్చటి ప్రజల ప్రగాఢ విశ్వాసం. మానవుడు సంఘజీవి కనుక తన సుఖశాంతులే కాక సమాజంలో అందరి సుఖశాంతులను కోరాలి. కనుక అందరూ సుఖంగా ఉండాలి. అందరికీ మంచి బుద్ధి సిద్ధించాలని, సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని, ఆలయ దినదినాభివృద్ధి సాధించాలని ఈ యాగ ప్రధాన సంకల్పం. శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి వారికి అమితమైన శక్తులు ఈ యాగం ద్వారా కలుగుతాయని ప్రజల విశ్వాసం. ఈ యాగంలో పాలుపంచుకున్న దంపతులకు, సర్వులకు శ్రీవారి అనుగ్రహం వల్ల సర్వ దోష నివృత్తి, నక్షత్ర దోషాలు నివారణ, సర్వ శుభాలు, సుఖశాంతులు కలుగుతాయని, సంతానం లేనివారికి సంతానం, ఉద్యోగ, వ్యాపార, చెరువుల అభివృద్ధి కలుగుతాయని, గ్రామం, రాష్ట్రం, దేశం అన్నీ విధాల సుఖశాంతులతో తులతూగెదరనీ ప్రజల నమ్మకం.[1][2].

విశేష పూజలు

మార్చు

ప్రతీ శనివారం విశేష అలంకారాలు, విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.ప్రతీ నెలా వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారికి కల్యాణం జరుపుతారు.ఈ కల్యాణం జరిపించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, చదువు, ఆరోగ్యం, మొదలైన కోరికలు నెరవేరుతాయనిప్రసిద్ధిగాంచింది.ప్రతీ శనివారం దాతల సహకారంతో అన్నదానం జరుగుతోంది.

స్వామి వారి లీలలు

మార్చు
  • శ్రీ వారు ఒక భక్తుని స్వప్నంలో రథములో కూర్చుని ఊరేగినట్లుగా సాక్షాత్కరించారు.ఆ క్షణం నుండి ఏ విధంగానైనా రథం చేయించాలని దృఢమైన సంకల్పం కలిగి స్వామీ అనుగ్రహంతో సంవత్సరకాలంలో భక్తుల సహాయ సహకారాలతో వినూత్న రీతిలో రథ నిర్మాణం జరిగి శ్రీ వారి రథోత్సవం జరుగుతోంది.
  • ఒకభక్తురాలి స్వప్నంలో పాదుకలు ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. శ్రీవారి ఆదేశానుసారం ఆ భక్తురాలు యధా శక్తిగా శ్రీ వారికి ఇత్తడి పాదుకలను ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది.
  • తాడేపల్లిగూడెంలో నివసించే శ్రీ వారి భక్తుడు ఒకరు లండన్ లో ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది .ఒక్క సారి మన వరాల వేంకటేశ్వరుడు జ్ఞాపకం వచ్చి అక్కడనుంచి అర్చకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి స్వామివారికి అర్చన చేయమనగా అర్చన చేసిన తరువాత వారం రోజులకు ఫలితం కనపడినది . తరువాత అతని ఆనందానికి అవధులు లేవు.
  • ఈడూరు గ్రామంలో ఒక భక్తురాలు తమ కుమార్తెకు ముందు ఆడపిల్ల తరువాత కాన్పుకి మగపిల్లవాడిని ఇమ్మని స్వామి వారిని వేడుకొంది .ఒక రోజు స్వామీ ఆ భక్తురాలు కలలో కనబడి నీ బిడ్డకు తప్పక మగ శిశువు ప్రసాదించెదను . నీవు నాకిష్టమైన నల్ల ద్రాక్ష తులాభారం వెయ్యమని అడిగెను. ఆ ప్రకారం మగ శిశువుకి జన్మనిచ్చింది. తరువాత ఆమె నల్లద్రాక్ష పళ్ళు మ్రొక్కు తీర్చుకుంది.
  • వేల్పూరు గ్రామంలోని ఒక భక్తురాలు భీమవరం బస్సు మీద వెళ్ళు చూ నా గృహం విషయమై ఇబ్బందులు పడుతున్నాను నా చిక్కులు అన్నీ తీరిపోతే నీకు 108ప్రదక్షిణాలు చేస్తా అని బస్సులోనే వేడుకొంది. రెండు రోజులలో అన్ని సమస్యలు పరిష్కారమైనాయి. ఆమె స్వామి చూపిన నిదర్శనం గురించి అందరికీ చెప్పి తన్మయత్వంలో మునిగి తేలింది .
  • మోగల్లు గ్రామంలో ఒక బ్రాహ్మణ భక్తుడు తన గ్రహానికి సంబధించిన కాగితాలు గురించి, తన కుమారుడు అమెరికా ప్రయాణం ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. వరాల వేంకటేశ్వర స్వామీ గురించి అందరూ చెబుతున్నారు నేను కూడా స్వామిని దర్శించుకుంటే పని ముందుకు వెళ్తుందేమో అని ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. తన పని సునాయాసంగా ఎదరికి వెళ్ళింది తన ఆనందానికి అవధులు లేవు. మన స్వామీ గురించి తనకు చూపిన లీల గురించి అందరికి చెప్పి, అందరూ స్వామిని దర్శించుకోమని సలహా ఇస్తున్నారు.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 04-05-2015, 22-02-2015 సాక్షి దినపత్రిక లోని వ్యాసం ఆధారంగా
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-06. Retrieved 2015-04-30.

ఆధారాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు