శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం

శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగరానికి చేరువలో ఉంది.

శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం
Sri Venkateswara National Park on Tirumala Hills
Map showing the location of శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం
Map showing the location of శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం
Location in India
Locationచిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Nearest cityతిరుపతి
Coordinates13°45′4″N 79°20′16″E / 13.75111°N 79.33778°E / 13.75111; 79.33778[1]
Area353 కి.మీ2 (136 చ. మై.)
Establishedసెప్టెంబర్, 1989

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనాన్ని 1989 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 353 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం తిరుపతి నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో ఉంది.[2]

జంతు, వృక్ష సంపద

మార్చు

ఈ ఉద్యానవనంలో నక్కలు, హైనాలు, చిరుతలు, పాంథర్‌లు, ఎలుగు బంట్లు, అడవి కుక్కలు, అడవి పిల్లులు, ఎగిరే బల్లులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది. ఇందులో తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, పొడి ఆకురాల్చే అడవులు ఉన్నాయి. ఇందులో ఎర్ర సాండర్స్, షోరియా తాలూరా, షోరియా థంబుర్గ్గియా, టెర్మినాలియా పల్లిడా, గంధపు చెక్క, సైకాస్ బెడ్‌డోమీ, సిజిజియం ఆల్టర్నిఫోలియం, సైలోటం నుడమ్ వంటి అరుదైన స్థానిక మొక్కల జాతులు ఈ ప్రాంతంలో పెరుగుతాయి

మరిన్ని విశేషాలు

మార్చు

ఈ ఉద్యానవనంలో తలకోన, గుండలకోన, గుంజనా వంటి జలపాతాలు ఉంటాయి.  భారత ప్రభుత్వం 2010 లో శేషాచలం కొండలను భారతదేశ జీవగోళ నిల్వలలో ఒకటిగా ప్రకటించడంతో, ఈ జాతీయ ఉద్యానవనం దానిలో భాగమైంది.

మూలాలు

మార్చు
  1. "Sri Venkateswara National Park". Andhra Pradesh Forest Department. Archived from the original on 2015-04-30. Retrieved 2012-07-30.
  2. "Tirumala Forest Fire threatens safety of Tirupati Balaji Temple". IANS. news.biharprabha.com. Retrieved 27 October 2019.