చిత్తూరు

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నగరం

చిత్తూరు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా నగరం, జిల్లా కేంద్రం. ఇది ఆంధ్రప్రదేశ్ కు దక్షిణాన, పెన్నానదిలోయలో, బెంగుళూరు-చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు ద్రవిడ ప్రాంతం. ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడుతారు. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులలో ఉంది.ఇది ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగలకు వ్యాపార కేంద్రము. ఇక్కడ నూనెగింజలు, బియ్యం మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

చిత్తూరు
నగరం
చిత్తూరు రైల్వే స్టేషను
చిత్తూరు రైల్వే స్టేషను
చిత్తూరు is located in ఆంధ్రప్రదేశ్
చిత్తూరు
చిత్తూరు
Coordinates: 13°12′58″N 79°05′53″E / 13.216°N 79.098°E / 13.216; 79.098
దేశం India
రాష్రంఆంధ్రప్రదేశ్
ప్రాంతంరాయలసీమ
జిల్లాచిత్తూరు
విస్తీర్ణం
 • Total35.75 కి.మీ2 (13.80 చ. మై)
Elevation
333.75 మీ (1,094.98 అ.)
జనాభా
 (2011)[1]
 • Total1,60,722
 • జనసాంద్రత4,500/కి.మీ2 (12,000/చ. మై.)
భాష
 • అధికారికతెలుగు
 • మాట్లాడే భాషలుతెలుగు, తమిళం
భాష
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
517002
ఎస్.టి.డి కోడ్+91–8572
Vehicle registrationAP–03
Website[dead link]

పేరు వ్యుత్పత్తి

మార్చు

గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామం అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందింది.[2]

చరిత్ర

మార్చు

మద్రాసు ప్రొవిన్స్ లోని ఈ ప్రాంతం 1911 లో జిల్లాగా ఏర్పడి, 1953లో ఆంధ్రరాష్ట్రంలో భాగమైంది.

పట్టణ స్వరూపం, జనవిస్తరణ

మార్చు

2011 జనగణన ప్రకారం, విస్తీర్ణం:35.75 చ.కి.మీ . సముద్రమట్టం నుండి ఎత్తు: 333.75 మీ (1,094.98 అ.) జనాభా మొత్తం: (పట్టణం+విస్తరించిన ప్రాంతం) 160722 [1]

పరిపాలన

మార్చు

చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది.

సదుపాయాలు

మార్చు

రవాణా

మార్చు

ఈ నగరం బెంగుళూరు -చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు రైల్వే స్టేషను పాకాల - కాట్పాడి రైలు మార్గములో ఉంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం.

ఆర్ధికం

మార్చు

ఆర్ధికంగా చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవుకాని చుట్టుప్రక్కల పంటలకు మార్కెట్ యార్డ్ గా ఉంది

పరిశ్రమలు

మార్చు
  • చిత్తూరు జిల్లా సహకార చక్కెర మిల్లు
  • శ్రీవెంకటేశ్వర సహకార చక్కెర మిల్లు
  • విజయ్ సహకార పాలు, పాలపదార్థాల డైరీ
  • అమరరాజా గ్రూప్ కంపెనీ : ఈ కంపెనీ యందు 3,600 ఉద్యోగులు పనిచేస్తున్నారు.
  • న్యూట్రిన్ కన్ఫెక్షనరీస్ (2007 లో గోద్రెజ్ కంపెనీ కొన్నది)
  • సారా లీ బిస్కట్స్ (క్రితం న్యూట్రిన్ బిస్కట్స్)
  • ఇస్రో రాడార్ కేంద్రం గాదంకి వద్ద.
  • హెరిటేజ్ పాలు, పాలపదార్థాల డైరీ

వ్యవసాయం

మార్చు

రైతులు ప్రధానముగా ధాన్యము, చెరకు, మామిడి, వేరుశనగ ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.

వ్యాపారం

మార్చు

చిత్తూరు పట్టణం జిల్లాలో వ్యాపారానికి కేంద్రముగా ఉంది. ఇక్కడి వ్యాపారస్తులు బెంగుళూరు - చెన్నై దగ్గరగా ఉన్నందున అక్కడనుండి సరుకులు దిగుమతి, ఇక్కడి నుండి ఆక్కడికి సరుకులు ఎగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా బెల్లము, మామిడి కాయల ఎగుమతికి చిత్తూరు పేరు గాంచింది.

పర్యాటక ప్రదేశాలు

మార్చు
 
కాణిపాక గణపతి దేవాలయము
  • కాణిపాక గణపతి:చిత్తూరుకు దగ్గరలో 10 కి.మీ దూరమున స్వయంభువుగా వెలసిన కాణిపాక గణపతి గుడి ఉంది. చిత్తూరు నుండి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కలదు . ఇక్కడ అసత్యప్రమాణాలు చెయడానికి భక్తులు జంకుతారు, ఇక్కడ అపద్దపు ప్రమాణం చెసినవారికి ఏదోఒక కీడు జరుగుతుంది అని భక్తుల నమ్మకం. అందుకే ఈయనను సత్యప్రమాణాల కాణిపాక గణపతిగా పిలుస్తారు. ఏదైనా కార్యము మొదలుపెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఆ కార్యము విఘ్నములు లేకుండా సాఫీగా సాగుతుంది అని ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి వారు దినదినమూ పెరుగుతూ ఉంటారు దానికి సాక్షాలు చాలా ఉన్నాయి.
  • అర్ధగిరి వీరాంజనేయ స్వామి: చిత్తూరుకు దగ్గరలో 20 కి.మీ దూరమున అరగొండ ఊరిలో అర్ధగిరి వీరాంజనేయ స్వామి గుడి ఉంది ఇక్కడ పుష్కరిణిలోని నీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తటాకము లోని నీరు ఎన్ని సంవత్సరాలు అయిన చెడిపోవు. ఇక్కడి మట్టిని మండలం రోజులు పాటు శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవని, ఉన్న చర్మ వ్యాధులు పొతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి పున్నమి నాడు "ఓంకార" నాదం వినబడుతుందని భక్తులు చెపుతుంటారు.
  • మొగిలి : చిత్తూరుకు 20 కి.మీ. దూరంలో మొగిలీశ్వరాలయం ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన ఆలయ గర్భగుడిలో వెలసి ఉన్నాడు. ఇక్కడ ఉన్న నందీశ్వరుడి నోటిలో నుంచి ప్రతీ క్షణము నీరు వస్తుంటుంది. ఈఆలయం చిత్తూరు - బెంగుళూరు రహదారిలో ఉంది.
  • శ్రీ పొన్నియమ్మ ఆలయం, చిత్తూరు: పట్టణంలోని ఈ ఆలయం విశేషమైన ప్రాశస్తాన్ని సంతరించుకున్నది. భక్తుల కష్టాలను కడతేర్చడానికి శ్రీ పొన్నియమ్మ తల్లి స్వయంభూగా వెలసి భక్తుల పూజలందుకుంటున్నది. చూపరులను ఆకట్టుకునే వర్ణరంజితశోభతో, శిల్పకళానైపుణ్యంతో అలరారుతోంది.
  • శ్రీ దనుమకొండ గంగమ్మ తల్లి ఆలయం, చిత్తూరు [3]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Census of India 2001 - Andhra Pradesh - District Census Handbook, Part A & B - Chittoor". Registrar,Census of India. Archived from the original on 2023-01-08.
  2. వేంపల్లి, గంగాధరం (2010). రాయలసీమ కథా సాహిత్యం ఒక పరిశీలన సిద్దాంత గ్రంథం. తిరుపతి: వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి. p. 7/36. Retrieved 28 July 2016.
  3. ఈనాడు జిల్లా ఎడిషన్ 2013 అక్టోబరు 23.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=చిత్తూరు&oldid=4155749" నుండి వెలికితీశారు