శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం (యనమదుర్రు)
శక్తీశ్వర స్వామి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక శైవాలయం. ఇది స్వయంభువుడిగా శివుడు వెలసిన ఆలయం. ఈ ఆలయంలో మహాశివుడు సతీ, పుత్ర సమేతుడై శీర్షాసనంలో ఉన్నట్లు కనిపిస్తాడు.[1]
ఆలయ విశేషాలు
మార్చుఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లో మండల కేంద్రానికి 4 కి.మీ దూరంలో ఉన్న యనమదుర్రు గ్రామంలో నెలకొని ఉంది. ఇది స్థానికంగా "శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానం" గా పిలువబడుతుంది. శక్తీశ్వరస్వామి తలక్రిందులుగా దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇది భీమవరానికి 4 కి.మీ దూరంలో ఉంది. సాధారణంగా శివాలయాలలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో శివుడు పార్వతీ సమేతుడై, ఒడిలో కుమారస్వామితో విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శివపార్వతులు వెలసిన పీఠం ఏకపీఠం కావడం ఒక విశేషమైనతే, ఇదంతా ఒక పెద్ద శిలగా భూగర్భంలో నుంచి చొచ్చుకుని వుండడం మరొక అద్భుతం. శక్తీశ్వరుడు ఈ ఆలయంలో శీర్షాశనంలో తపోనిష్టుడై ఉండడం మరో మహాద్భుతం. జటాఝూటం, నొసట విభూతి రేఖలు, నాగాభరణము స్వామి వారి విగ్రహంలో స్పష్టంగా కనపడతాయి. ఈ ఆలయం తూర్పువైపు శక్తి ఉండం ఉంది. కాశీలోని అంతర్వాహిని అయిన గంగ ఈ చెరువులో కలుస్తుందని భక్తుల విశ్వాసం. ఈ చెరువు తవ్వకాలలో సర్పం ఆకారంలో ఆరు అడుగుల శిల బయటపడింది. ఈ శిలను సుబ్రహ్మణ్యస్వామిగా భావించి ఆలయంలో ప్రతిష్టించారు. ఈ శక్తిగుండంలోని నీరుతోనే స్వామివారిని అభిషేకం, పూజలు నిర్వహిస్తారు. [1][2]
స్థల పురాణం
మార్చుశంబరుడనే రాక్షసుని సంహరించేందుకు యముడు శివున్ని ప్రార్థించాడు. ఆ సమయంలో శివుడు యోగముద్రలో ఉండటంతో పార్వతీ మాత అనుగ్రహంతో యముడు శక్తిని పొంది శంబరుడిని సంహరిస్తాడు. యమధర్మరాజు కోరిక మేరకు శీర్షాసన స్థితిలో ఉన్న శివుడు అమ్మవారితో సహా ఈ క్షేత్రమునందు వెలిశాడు అనీ చరిత్ర.
ఉత్సవాలు
మార్చుమహాశివరాత్రి పర్వదినాన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో స్వామి వారికి రుద్రభిషేకం, అభిషేకాలు లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి సందర్భంగా అఖండ అన్నసమారాధన జరుగుతుంది. ఆ ప్రత్యేక ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Shakteeswara Swamy Temple Yanamadurru - History, Timings, Phone". Temples Information Center - Tirumala Tirupati Srikalahasti (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-05-30. Retrieved 2018-04-05.
- ↑ "The Complete and Updated Information of the Bhimavaram City | Manabhimavaram.in". www.manabhimavaram.info. Archived from the original on 2016-05-16. Retrieved 2018-04-05.