శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాల (నరసరావుపేట)

విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో నరసరావుపేటలో ఏర్పడిన సంస్థ.

"తమసోమా జ్వోతిర్గమయ" అనేది ఈ కళాశాల ఆదర్శం, అభిమతం

శ్రీ సుబ్బరాయ, నారాయణ కళాశాల,1950లో అప్పటి  వెనుకబడిన పలనాడు,తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల విద్యార్థులకు మంచి విద్యను అందించాలనే లక్ష్యంతో నరసారావుపేటలో ఒక చిన్న సంస్థగా ప్రారంభించింది.[1] తొలుత రైల్వే స్ఠేషన్ ఎదురుగా ఉండే కాటన్ ప్రెస్ లో ఆరుగురు ఉపాధ్యాయులతో,60 మంది విద్యార్థులతో ప్రారంభింపబడింది. తదుపరి కళాశాల 34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన శాశ్వత భవనంలలో, పూర్తి స్థాయి డిగ్రీ కళాశాలగా రూపు దిద్దుకుంది.మొదట ఇది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది.తరువాత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా మారింది.ఇది కాలక్రమేణా వివిధ విద్యా రంగాలలో పరిమాణాత్మక విస్తరణ, గుణాత్మక మెరుగుదలల ద్వారా మంచి పురోగతిని సాధించింది.600 మంది విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తున్న హాస్టల్‌ భవనాలు ఉన్నాయి.విద్య అంటే సమాధానాలు ఇవ్వడం కాదు. తనకు తనలో తాను సమాధానాలు కనుగొనే మార్గంతో విద్యార్థిని సన్నద్ధం చేయడం కోసం, విద్య తమను తాము కనుగొనటానికి ఆశయం పెట్టుకుని కళాశాల విద్యార్థులను ప్రోత్సహిస్తుంది. వారు ఉన్నత వ్యక్తులుగా ప్రతి విద్యార్థిలో ఉన్న ఆసక్తిని గమనించి డాక్టర్, ఇంజనీర్, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త, క్రీడా వ్యక్తి, పర్యావరణవేత్త, కవి, రచయిత లేదా ఆర్థికవేత్త ఇలా ఎదగటానికి కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు వారి కలలకు అనుగుణంగా వనరులను కల్పించటంలో వారికి మద్దతు ఇస్తారు.డి.పి.యస్. సొసైటీ యొక్క నినాదం “సెల్ఫ్ బిఫోర్ సెల్ఫ్” కు అనుగుణంగా, మాతృభూమికి సేవ చేయడానికి నాగరిక, ఉత్పాదక మానవ మూలధనాన్ని స్థిరంగా ఉత్పత్తి చేయటానికి నిరంతర కృషి కళాశాల యాజమాన్యం తీసుకుంటుంటుంది.[1]

కళాశాల వ్యవస్థాపకులు మార్చు

నాగసరపు సుబ్బారాయుడు మార్చు

కళాశాలకు భూమి వితరణ, భూరి విరాళం ఇచ్చిన ప్రధాన దాత. కళాశాల వ్యవస్థాపనకు తోడ్పటమే కాకుండా, నరసరావుపేట పట్టణంలో మంచివీటి ఎద్దడి ఉన్న ఆ రోజుల్లో 365 రోజులు చలివేంద్రం నిర్వహించాడు. కోటప్పకొండ యాత్రికులకు యల్లమంద వెళ్లేదారిలో మంచి నీటి కుంట త్రవ్వకం, అపరకర్మల చేసేవారికి 'కర్మల సత్రం' నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతిశాల నిర్మాణం మొదలగు ధర్మకార్యాలు గావించాడు.

తాడేపల్లి నారాయణ మార్చు

కళాశాలకు భూరి విరాళం ఇచ్చిన దాతలలో ప్రధాన దాత నారాయణ ఒకడు.కళాశాలకు విరాళం అందజేసిన ప్రధాన దాతలు సుబ్బారాయుడు,నారాయణల పేర్లుతో "శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాల" గా స్థాపించబడి రూ పాంతరం చెందింది.

వ్యవస్థాపనకు సహకరించిన ఇతర దాతలు మార్చు

మల్రాజు వంశీయులకు చెందిన వేంకట రామకృష్ణ బహదూర్,పొతకమూరి శౌరయ్య ఇచ్చిన భూమి వితరణకు తోడు,మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందరెడ్డ ప్రోత్సాహంతో, కపిలవాయి కాశీ రామారావు,ఇంకా ఇతర వైశ్య ప్రముఖులు సహాయ సహకారం, ఆదరాభిమానాలతో 1950 జూన్ 22న అప్పటి ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి కృష్ణచే ప్రారంభించబడింది.

కళాశాల మొదటి ప్రదానాచార్యుడు మార్చు

కళాశాల మొదటి ప్రిన్సిపాల్‌ ఇల్లిందల రంగనాయకులు 1950 ఏప్రియల్ 1 నుండి 1974 ఫిబ్రవరి 12 వరకు (24 సంవత్సరాలు) పనిచేశాడు.ఈ కళాశాల ప్రిన్సిపల్‌గా రాకపూర్వం రంగనాయకులు గుంటూరు హిందూ కళాశాలలో గణితశాస్ర ఆచార్యుడుగా పనిచేశాడు.అధ్యాపకులు క్రమశిక్షణతో ప్రవర్తించి సమాజానికి ఆదర్శవంతులుగా నిలబడగలిగిననాడే, విద్యార్ధిలోకం క్రమశిక్షణకు అలవరుచుకోలుగుతుందని,గురువులు తమ బాధ్యతను విస్మరించిననాడు వారు ఆపదవికి అనర్హులని అనే నమ్మకంతో ప్రధానాచార్యులు పదవీ భాధ్యతలు నిర్వర్తించిన కళాశాల మొదటి ప్రధానాచార్యుడు.

కళాశాల మొదటి ఉపాధ్యాయులు మార్చు

  • వేమూరు శ్రీరాములు (ఆంగ్లశాఖ)
  • అన్నంబొట్ల వెంకట సూర్యనారాయణ
  • యన్.కైలాసం
  • పి.జి.రామారావు
  • తూములూరి శివరామకృష్ణ శాస్త్రి
  • మద్దులపల్లి సత్యనారాయణ శాస్త్రి

శాశ్వత భవన నిర్మాణ సముదాయం మార్చు

1950 ఆగష్టు 25న అప్పటి మద్రాసు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బెజవాడ గోపాలరెడ్డిచే శాశ్వత భవన నిర్మాణ సముదాయానికి శంకుస్థాపన చేయబడింది.ఈ సందర్బంగా జరిగిన సమావేశానికి అప్పటి మద్రాసు రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి కల్లూరి చంద్రమౌళి అధ్యక్షత వహించాడు.కళాశాల వ్యవ్వస్థాపకులలో ఒకరైన సుబ్బరాయ శ్రేష్ఠి ఈ భవన సముదాయ నిర్మాణ  భాధ్యతను తీసుకుని, కొద్దికాలంలోనే నిర్మాణం గావించి కాసు బ్రహ్మానందరెడ్డిచే నూతన భవన ప్రవేశోత్సవం జరపబడింది

ఇప్పటివరకు పనిచేసిన పూర్వ ప్రధానాచార్యులు మార్చు

  • కోదాడ వేంకట రమణయ్య. యం.యస్.సి (1974 ఏప్రియల్ 11 నుండి 1991 మార్చి 31 వరకు)
  • ఆర్.వి.నారాయణరావు.యం.ఎ., బిఇడి (1991 ఏప్రియల్ 1 నుండి 1996 మే 31 వరకు) (పిజి సెంటర్ తొలి ప్రిన్సిపల్)
  • పి.పి.గుప్తా,యం.ఎస్సీ,,డి.జె & ఎమ్.సి.(1996 జూన్ 1 నుండి 1997 సెప్టెంబరు 30 వరకు)
  • ఎం.ఆర్.కె.మూర్తి.యం.ఎ.,యం.డి.పి.ఎ.,యం.పిహెచ్ఐయల్. (1997 జూన్ 6 నుండి 1998 జూన్ 30 వరకు)
  • జుజ్జూరి వెంకటేశ్వరావు.యం.కామ్. (1998 జులై 1 నుండి 1999 జూన్ 30 వరకు)
  • డి.హరగోపాలరావు.యం.కామ్ (1999 జులై 1 నుండి 1999 డిశెంబరు 31 వరకు)
  • వై.సత్యనారాయణ,యం.కామ్,.(2000 జనవరి 1 నుండి 2001 జూన్ 30 వరకు)
  • సి.హెచ్.రాదాకృష్ణమూర్తి,యం.ఎ., (2000 జులై 1 నుండి 2001 జూన్ 28 వరకు)
  • కె. శ్రీరామమూర్తి, యం.ఎ.,యం.పిహెచ్ఐయల్.,పిహెచ్.డి (2001 జూన్ 29 నుండి 2002 మే 29 వరకు)
  • కె.వి.సుబ్బారావు,యం.కామ్. (2002 మే 30 నుండి 2006 జూన్ 4 వరకు)
  • కె.రాజాశంకరరావు యం.ఎ., (2006 జూన్ 5 నుండి 2008 ఏప్రియల్ 30 వరకు)
  • పి.రామాంజనేయులు.2008 మే 1 నుండి 2002 సెప్టెంబరు 17 వరకు)

ప్రస్తుత ప్రధానాచార్యులు, మార్చు

  • సోము మల్లయ, యం.కాం.,యం.ఇడి.,యం.పిహెచ్ఐయల్.,పిహెచ్‌డి

కళాశాల వ్యవస్థాపక పాలక వర్గం మార్చు

  • నాగసరపు సుబ్బరాయ శ్రేష్ఠి
  • తాడేపల్లి వెంకటనారాయణ శ్రేష్టి

కళాశాల పూర్వ అధ్యక్షులు మార్చు

కళాశాల పూర్వ సెక్రటరీ, కరస్పాండెంట్స్ మార్చు

  • నాగసరపు రామారావు

2019 నాటికి ఉన్న ప్రస్తుత పాలక వర్గం మార్చు

  • మల్రాజు వెంకట కొండల రామకృష్ణారావు (గౌరవ అధ్యక్షుడు)
  • కపిలవాయి విజయకుమార్ (అధ్యక్షుడు)
  • పెనుగొండ వెంకటేశ్వరరావు (వైస్ ప్రెసిడెంట్)
  • నాగసరపు సుబ్బరాయ గుప్తా (సెక్రటరీ,కరస్పాండెంట్)
  • ఊటుకూరి వెంకట అప్పారావు (జాయంట్ సెక్రటరీ)
  • ఉప్పలమంచు వెంకటేశ్వర పవన్ (ట్రెజరర్)
  • తాడేపల్లి వెంకట బలరామమూర్తి (మెంబరు)
  • యేలూరి చిన కోటేశ్వరరావు (మెంబరు)
  • బొలిశెట్టి రామమోహనరావు (మెంబరు)
  • కూనిశెట్టి లక్ష్మయ్య (మెంబరు)
  • వక్కలగడ్డ కోటేశ్వరరావు (మెంబరు)
  • తటవర్తి వెంకటేశ్వర్లు (మెంబరు)
  • ఉటుకూరి నాగసత్యనారాయణ (మెంబరు)
  • కొత్త సీతా రామాంజనేయులు (మెంబరు)
  • బత్తుల వెంకట మరళీధరరావు (మెంబరు)

కళాశాల వేడుకలు మార్చు

సిల్వర్ జూబ్లీ మార్చు

1975 వ సంవత్సరంలో జరిగాయి.

స్వర్ణోత్సవాలు మార్చు

2002, జనవరి 18న, 19న రెండు రోజులు జరుపబడినవి. స్వర్ణోత్సవాలను అప్పటి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖా మంత్రి కోడెల శివప్రసాదరావుచే ప్రారంభించబడినవి. ఈ సందర్బంగా జరిగిన సమావేశానికి కళాశాల అధ్యక్షులు కపిలవాయి కాశీ రామారావు అధ్యక్షత వహించాడు.కళాశాల నివేదికను సెక్రటరీ,కరస్పాండెంట్ నాగసరపు రామారావుచే నివేదించబడింది.ఈ స్వర్ణోత్సవాలకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, బి.దానం (ఐఎయస్),మునిసిపల్ చైర్‌పర్సన్ జి.జోగేశ్వరమ్మ,మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి,మాజీ యం.పి.కాసు కృష్ణారెడ్డి,మాజీ మంత్రివర్యులు,తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య, కళాశాల పాలకవర్గ సభ్యులు హాజరయ్యారు.

డైమండ్ జూబ్లీ మార్చు

2010 వ సంవత్సరంలో జరిగాయి.

బోధించున్న కోర్సులు మార్చు

ఇంటర్ మీడియట్ మార్చు

  • 1.యం.పి.సి., 2. బై.పి.సి.,3.సి.ఇ.సి.,4.యం.ఇ.సి. కోర్సులు ఆంగ్ల,తెలుగు మాధ్యమంలో బోధించబడుతుంది.
  • 1.హెచ్.ఇ.సి.,2.హెచ్.సి.ఇ.,3హెచ్.సి.టి. కోర్సులు తెలుగు మాధ్యమంలో బోధించబడుతుంది.

డిగ్రీ కోర్సులు మార్చు

  • బి.యస్.సి కేటగిరి (ఆంగ్ల, తెలుగు మాధ్యమం)
  1. మ్యాథ్స్ - పిజిక్స్ - కెమిస్ట్రీ
  2. బోటనీ - జువాలజీ - కెమిస్ట్రీ
  3. మ్యాథ్స్ - పిజిక్స్ -ఎలక్ట్రానిక్స్
  4. మ్యాథ్స్ - పిజిక్స్ - కంప్యూటర్స్
  5. మ్యాథ్స్ - ఎలక్ట్రానిక్స్ - కంప్యూటర్స్
  6. మ్యాథ్స్ - స్టాటిటిక్స్ - కంప్యూటర్స్
  • బి.యస్.సి కేటగిరి (తెలుగు మాధ్యమం)
  1. హిస్టరీ - పాలిటిక్స్ - తెలుగు (ప్రత్యేకం)
  2. పాలిటిక్స్ - హిస్టరీ - పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్
  3. ఎకానామిక్స్ - హిస్టరీ - పాలిటిక్స్
  4. పాలిటిక్స్ - పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ - ఆంగ్లం (ప్రత్యేకం)
  5. ఎకానామిక్స్ - పాలిటిక్స్ - ఆంగ్లం (ప్రత్యేకం)
  • పి.జి.కోర్సులు (1996 నుండి ప్రారంభించబడినవి)
  1. యం.యస్సీ (కెమిష్ట్రీ) ఎ.యన్.యు.
  2. యం.యస్సీ (మ్యాథ్స్ )
  3. యం.ఎ (పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్)
  • పి.జి.స్థాయిలో కంప్యూటర్ కోర్సులు (2001 నుండి ప్రారంభించబడినవి)
  1. యం.సి.ఎ.,
  2. యం.యస్.సి (ఐయస్)
  • డిప్లమా కోర్సులు
  1. డి.ఇడి., డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ (పాలిటెక్నిక్)
  • అర్హత పత్రం కోర్సులు
  1. కమ్యూనికేషన్,
  2. గ్రాపిక్స్ డిజైన్,
  3. కంప్యూటర్ ప్రోగ్రామింగ్,
  4. టూరిజం & డెవలప్మెంట్

కళాశాలలో ఇతర వసతులు మార్చు

గ్రంధాలయం మార్చు

కళాశాల గ్రంధాలయంలో వివిధ రంగాలకు చెందిన 45 వేల పైచిలుకు గ్రంధాలను కలిగి, జిల్లాలోని వేటపాలెం గ్రందాలయం తరువాత పేరు పొందింది. గ్రంధాలయ మొదటి అధికారిగా కె.వి.కె.రామారావు పనిచేశాడు.సుమారు 39 జర్నల్స్, 40 మ్యాగ్ జైన్స్, 13 సంస్థలకు చెందిన వివిధ దిన పత్రికలు తెప్పించబడుతుంది.అచార్య నాగార్జున యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ గ్రంధాలయంగా అవార్డు పొందింది.

క్రీడారంగం మార్చు

కళాశాలలో క్రీడారంగం 1951,ఆగష్టు 20న ప్రారంభమైంది.దీనికి మొదటి ఫిజికల్ డైరెక్టర్‌గా యర్రంశెట్టి కృష్ణారావు నాయుడు పనిచేశాడు.ఇతను విద్యార్థులలో క్రీడా స్పూర్తి పెంచి కళాశాల తరుపున పుట్ బాల్; హాకీ; వాలీబాల్; బాల్ బ్యాడ్మింటిన్ అథ్లెటిక్స్ టీములును తయారుచేసి,ఆంధ్ర విశ్వ విద్యాలయం అంతర్ కళాశాల పోటీలలో హాకీ గేమ్ లో 8 సార్లు,పుట్ బాల్ గేమ్ లో 3 సార్లు వాలీబాల్ గోమ్ లో 2 సార్లు బాల్ బ్యాడ్మింటిన్ గేమే లో 3 సార్లు,క్రికెట్ గేమ్ లో 2 సార్లు టైటిల్స్ సాధించబడ్డాయి.అథ్లెటిక్స్ లో 18 బంగారు పతాకాలు, 13 వెండి పతకాలు, 25 కాంస్య పతకాలు కళాశాల తరుపున సాధించబడ్డాయి.ఇతను ఆంధ్ర విశ్వవిద్యాలయ సెలక్షన్ కమిటి చైర్మన్‌గా వ్యవహరించాడు.1957 నుండి 1975 వరకు వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు రెండుసార్లు వైస్ ప్రెసిడెంట్‌గాను.ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ ఆసోసియేషన్ ప్రెసిడెంటుగా వ్యవహరించాడు.1965,ఆగష్టు 30 పదవీ విరమణ గావించాడు.ఇతని తరువాయ వరుసుగా నర్రెద్దుల వెంకటరెడ్డి 1965 జులై 9న చేరి,విధినిర్వహణలోనే 1994 జనవరి 11న చనిపోయాడు.నర్రెద్దుల వెంకటరెడ్డి సర్వీసులో ఉండగానే అసిస్టెంట్ డైరెక్టరుగా పనిచేయుచున్న యక్కల మధుసూధనరావు ఫిజికల్ డైరెక్టర్‌గా చేరాడు.

స్విమ్మింగ్ పూల్.[2] మార్చు

ప్రముఖులు మార్చు

  • కె.సి రెడ్డి (పూర్వ ఛైర్మన్, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్),[3]
  • శేషశయనా రెడ్డి (హైకోర్టు న్యాయమూర్తి),[4]
  • వి.రామకోటయ్య (మాజీ వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం),
  • వి. బాలమోహన్ దాస్ (మాజీ వైస్ ఛాన్సలర్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం),
  • కె.బయ్యపురెడ్డి (మాజీ ప్రిన్సిపల్ , ఆంధ్ర విశ్వవిద్యాలయం),
  • కాసు వెంకట కృష్ణారెడ్డి (మాజీ యం.యల్.ఎ., నరసరావుపేట),
  • చల్లా రామకృష్ణారెడ్డి (మాజీ యం.యల్.ఎ)
  • కందుల నాగార్జనరెడ్డి (మాజీ యం.యల్.ఎ)
  • డి.ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, ప్రిన్సిపల్, మహాత్మా గాంధీ కళాశాల,(గుంటూరు).[1]
  • సదాశివగుప్త, (వైశ్యా బ్యాంకు మాజీ చైర్మెన్)
  • సి.రామకృష్ణ (సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజరు)
  • సి.హెచ్.కోటేశ్వరరావు., ఐపియస్ (ఐఆర్‌టియస్‌ అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు)
  • యస్.వెంకటేశ్వర్లు (అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇనకంటాక్స్)
  • యం.పాపిరెడ్డి, (సింగరేణ కాలరీస్ డైరెక్టరు).
  • జె.ప్రసాద్ ఐఆర్‌టియస్‌., (మేనేజింగో డైరెక్టరు, కేరళ స్టేట్ బ్యాంక్ కార్పోరేషన్)
  • మాజేటి పాపారావు (పారిశ్రామిక వేత్త).
  • కె.పి.రంగారావు (పారిశ్రామిక వేత్త) మొదలగువారు ఈ కళాశాలలో విద్యనభ్యషించారు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "SS and N College, Narasaraopet". www.ssandncollege.org. Archived from the original on 2019-10-23. Retrieved 2019-10-23.
  2. "యస్‌యస్‌ఎన్‌ కళాశాలలో స్విమ్మింగ్‌ పూల్‌ ప్రారంభం". Archived from the original on 2019-10-29.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-10-27. Retrieved 2019-10-27.
  4. "Hon'ble Mr. Justice B. Seshasayana Reddy". Archived from the original on 2011-10-09.

వెలుపలి లంకెలు మార్చు