శ్వేతా శారదా (హిందీ: श्वेता शार्दा); (జననం 2000 మే 24) భారతీయ మోడల్, నర్తకి. పలు అందాల్లో పోటీల్లో సత్తా చాటిన ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుచుకుంది.[1][2] అమెరికాలోని ఎల్ సాల్వడార్‌లో 2023 నవంబరు 18న నిర్వహించిన మిస్ యూనివర్స్ 2023 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[3] అయితే, ఆమె టాప్-20లోనే ఆగింది.

శ్వేతా శారదా
అందాల పోటీల విజేత
జననము (2000-05-24) 2000 మే 24 (వయసు 23)
చండీగఢ్, భారతదేశం
విద్యఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ
వృత్తి
  • డాన్సర్
  • మోడల్
ఎత్తు1.80 m (5 ft 11 in)
జుత్తు రంగుబ్రౌన్ హెయిర్
కళ్ళ రంగుబ్రౌన్
బిరుదు (లు)మిస్ యూనివర్స్ ఇండియా 2023 (మిస్ దివా 2023|)
ప్రధానమైన
పోటీ (లు)
మిస్ దివా 2023
(విజేత)
మిస్ యూనివర్స్ 2023
(టాప్-20)

కాగా, నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్‌ 2023 టైటిల్ కైవసం చేసుకుంది.[4] ఆమెకు మాజీ విశ్వ సుందరి బొన్ని గాబ్రియేల్ ఈ కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపింది.[4]

కెరీర్ మార్చు

చండీగఢ్లో 2000 మే 24న జన్మించిన శ్వేత శారద మోడల్‌గా, డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. వృత్తిరీత్యా డ్యాన్సర్ కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లింది. ఆమె డాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ దీవానే, డ్యాన్స్+లతో సహా అనేక రియాలిటీ షోలలో పాల్గొన్నది. ఆమె ఝలక్ దిఖ్లా జా 10లో కొరియోగ్రాఫర్‌గా కూడా చేసింది.[5]

సొంతంగా నృత్యకారిణిగా ఎదిగి బహుముఖ ప్రజ్ఞ, సాంకేతిక నైపుణ్యాలకు ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె కొరియోగ్రాఫర్ గా వివిధ టెలివిజన్ కార్యక్రమాలు, మ్యూజిక్ వీడియోలు చేసింది. అలాగే అనేక నృత్య కార్యక్రమాలకు ఆమె కొరియోగ్రఫీ చేసింది.[6][7]

ఆమె బాలీవుడ్ నటుడు శంతను మహేశ్వరి సరసన జుబిన్ నౌటియాల్, తులసి కుమార్ లు ఆలపించిన "మస్త్ ఆంఖీన్" మ్యూజిక్ వీడియోలోనూ నటించింది.[8][9]

ముంబైలోని ది లలిత్‌లో 2023 ఆగస్టు 28న జరిగిన గ్రాండ్ ఫినాలేలో, ఆమె మిస్ దివా యూనివర్స్ 2023గా ఎంపిక కాగా, ఆమెకు మిస్ దివా యూనివర్స్ 2022 దివితా రాయ్ కిరీటాన్ని అలంకరించింది. [10]

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Shweta Sharda is Miss Diva Universe 2023: See all pictures of her crowning moment". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 28 August 2023.
  2. "Shweta Sharda wins Miss Diva Universe 2023 title. Who is she?". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
  3. "Shweta Sarada : మన శ్వేతకు దక్కేనా 'విశ్వసుందరి' కిరీటం! | Vishwasundari Shveta get the crown". web.archive.org. 2023-11-19. Archived from the original on 2023-11-19. Retrieved 2023-11-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 "విశ్వ సుందరి కిరీటం 'షెన్నిస్ పలాసియోస్' సొంతం |". web.archive.org. 2023-11-19. Archived from the original on 2023-11-19. Retrieved 2023-11-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Jhalak Dikhhla Jaa 10 EXCLUSIVE: Paras Kalnawat will dance to the tunes of choreographer Shweta Sharda while Rubina Dilaik and Sanam Johar pair-up to perform some sizzling dance moves!". Pinkvilla Telly (in ఇంగ్లీష్). 25 August 2022. Retrieved 29 August 2023.
  6. "Chandigarh girl Shweta Sharda is LIVA Miss Diva Universe 2023". Onmanorama (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
  7. "Who is Shweta Sharda, the Miss Diva Universe 2023 winner?". Indian Express Limited (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
  8. "Shantanu Maheshwari's Latest 'Mast Aankhein' Has Catchy Lyrics, Soothing Melody". Outlook (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 24 February 2023.
  9. "Tulsi Kumar, Jubin Nautiyal come together for 'Mast Aankhein'". Daijiworld Media (in ఇంగ్లీష్). Retrieved 21 February 2023.
  10. "LIVA Miss Diva 2023 Crowning Moments!". beautypageants.in (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.