షమీమ్ హుస్సేన్ పట్వారీ (జననం 2000 సెప్టెంబరు 2) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. అతను 2021 జూలైలో జింబాబ్వేపై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌ లోకి అడుగు పెట్టాడు.[1] [2]

షమీమ్ హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షమీమ్ హుస్సేన్ పట్వారీ
పుట్టిన తేదీ (2000-09-02) 2000 సెప్టెంబరు 2 (వయసు 24)
చంద్‌పూర్, బంగ్లాదేశ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 144)2023 సెప్టెంబరు 3 - Afghanistan తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.29
తొలి T20I (క్యాప్ 71)2021 జూలై 23 - జింబాబ్వే తో
చివరి T20I2023 జూలై 16 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.29
కెరీర్ గణాంకాలు
పోటీ T20I ఫక్లా
మ్యాచ్‌లు 17 4
చేసిన పరుగులు 245 13
బ్యాటింగు సగటు 22.27 2.16
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 51 4
వేసిన బంతులు 205 35
వికెట్లు 0 0
బౌలింగు సగటు - -
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - -
అత్యుత్తమ బౌలింగు - -
క్యాచ్‌లు/స్టంపింగులు 7/0 4/0
మూలం: Cricinfo, 27 March 2023

కెరీర్

మార్చు

దేశీయ క్రికెట్

మార్చు

షమీమ్ 2017 సెప్టెంబరు 15న 2017–18 నేషనల్ క్రికెట్ లీగ్‌లో చిట్టగాంగ్ డివిజన్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి ప్రవేశించాడు.[3] అతను 2019 ఫిబ్రవరి 25న 2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ ట్వంటీ 20 క్రికెట్ లీగ్‌లో బంగ్లాదేశ్ క్రీడా శిఖా ప్రొతిష్ఠాన్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు. [4] 2019 మార్చి 8న 2018–19 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో క్రీడా శిఖా ప్రొతిష్ఠాన్ తరపున తన తొలి లిస్టు A మ్యాచ్‌ ఆడాడు.[5]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2019 డిసెంబరులో షమీమ్, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [6] 2021 ఫిబ్రవరిలో, అతను ఐర్లాండ్ వోల్వ్స్‌తో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం బంగ్లాదేశ్ ఎమర్జింగ్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. [7] [8]

2021 జూన్లో, అతను జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు. [9] రెండో టీ20 మ్యాచ్‌లో జింబాబ్వేపై రంగప్రవేశం చేసి 13 బంతుల్లో 29 పరుగులు చేశాడు. [10] మూడవ T20I మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయంగా 31 పరుగులు చేశాడు, బంగ్లాదేశ్‌ ఆ మ్యాచ్‌లో 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికీ, 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకోవడానికీ అతను తోడ్పడ్డాడు. [11] [12]

2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికయ్యాడు. [13]


2023 మార్చిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులోకి షమీమ్‌ను తీసుకున్నారు. [14] అదే నెలలో, ఐర్లాండ్‌తో జరిగిన T20I సిరీస్‌లో బంగ్లాదేశ్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [15] 2023 మార్చి 31న, మూడవ T20Iలో 42 బంతుల్లో 51 పరుగులు చేసి, T20I క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీ సాధించాడు.[16]

మూలాలు

మార్చు
  1. "2nd T20I, Harare, Jul 23 2021, Bangladesh tour of Zimbabwe". ESPNcricinfo. Retrieved August 7, 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Shamim Hossain". ESPNcricinfo. Retrieved 9 December 2019.
  3. "Tier 2, National Cricket League at Chittagong, Sep 15-18 2017". ESPN Cricinfo. Retrieved 15 September 2017.
  4. "4th match, Group D, Dhaka Premier Division Twenty20 Cricket League at Fatullah, Feb 25 2019". ESPN Cricinfo. Retrieved 25 February 2019.
  5. "1st Match, Dhaka Premier Division Cricket League at Dhaka, Mar 8 2019". ESPN Cricinfo. Retrieved 8 March 2019.
  6. "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
  7. "Ireland Wolves tour of Bangladesh to start with four-day game in Chattogram". ESPN Cricinfo. Retrieved 9 February 2021.
  8. "Media Release: Ireland Wolves in Bangladesh 2021s Itinerary". Bangladesh Cricket Board. Retrieved 9 February 2021.
  9. "Shakib Al Hasan returns to Test and T20I squads for tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 23 June 2021.
  10. "2nd T20I, Harare, Jul 23 2021, Bangladesh tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 23 July 2021.
  11. "All-round Soumya Sarkar show gives Bangladesh T20I series win in high-scoring contest". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 25 July 2021.
  12. "Hungry Shamim shows he is a quick learner". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 25 July 2021.
  13. "No surprises as Bangladesh name Mahmudullah-led squad for T20 World Cup". ESPN Cricinfo. Retrieved 9 September 2021.
  14. "Shamim added to squad for second England ODI". Dhaka Tribune. 2 March 2023. Retrieved 2 March 2023.
  15. "Uncapped Rishad Hossain and Jaker Ali in Bangladesh squad for Ireland T20I series". ESPNcricinfo. Retrieved 22 March 2023.
  16. "Shamim hits maiden 50, Bangladesh bowled out for 124". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-31.