షహ్రాన్ మార్కెట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక ప్రాంతం

షహ్రాన్ బజార్ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక ప్రాంతం. ఇది చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాల సమీపంలో ఉంది. భారతదేశంలో పేరెన్నికగల దుకాణాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.[1] హైదరాబాదీ హలీమ్, ఇతర ఆహారాలకు ప్రసిద్ధి చెందిన ప్రక్కనే ఉన్న షహ్రాన్ రెస్టారెంట్ పేరుమీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.

షహ్రాన్ మార్కెట్
సాధారణ సమాచారం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం

వాణిజ్యప్రాంతం మార్చు

ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బురఖా, హిజాబ్ సంబంధిత దుస్తులు, ఇతర సామగ్రికి సంబంధించిన దుకాణాలు ఉన్నాయి. ముడిసరుకును దిగుమతి చేసుకుని, తయారీ పరిశ్రమను కలిగి ఉంది. ఇక్కడ తయారు చేసిన బురఖా, హిజాబ్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయబడుతున్నాయి.[2][3]

రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షహ్రాన్ మార్కెట్ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

మూలాలు మార్చు

  1. India, The Hans (2018-04-06). "Shahran market still holds ground despite mall culture". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-06. Retrieved 2023-01-26.
  2. "Burqa sale on the rise in Old City". The Times of India. 28 December 2010. Archived from the original on 24 May 2013. Retrieved 2023-01-26.
  3. "Old City defies bandh for Ramzan shopping". siasat.com. 11 August 2011. Retrieved 2023-01-26.
  4. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-10-31.