షాజాపూర్ జిల్లా
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షాజాపూర్ జిల్లా (హిందీ:) ఒకటి. షాజాపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా రాష్ట్రానికి ఉత్తరభాగంలో ఉంది. 32"06' నుండి 24" 19' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75" 41' నుండి 77" 02' డిగ్రీల తూర్పు రేఖాంశంలోనూ ఉంది. షాజాపూర్ జిల్లా మాల్వా పీఠభూమిలో భాగం. జిల్లా ఉజ్జాయిని డివిజన్‌లో భాగం. ఉజ్జయిని డివిజన్ 1981లో రఒందించబడింది.
Shajapur జిల్లా
शाजापुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Ujjain |
ముఖ్య పట్టణం | Shajapur |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Dewas |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,196 కి.మీ2 (2,392 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 15,12,353 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (630/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 70.17% |
• లింగ నిష్పత్తి | 939 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
మార్చుజిల్లా పశ్చిమ సరిహద్దులో ఉజ్జయిని జిల్లా, దక్షిణ సరిహద్దులో దేవాస్ జిల్లా, సెషోర్ జిల్లా, తూర్పు సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజ్‌గర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఝలావర్ జిల్లా ఉన్నాయి.
పేరువెనుక చరిత్ర
మార్చుజిల్లాకేద్రం షాజాపూర్ పేరు జిల్లాకు గుర్తించబడింది. 1640లో ముగల్ చక్రవర్తి షాజహాన్ ఇక్కడ ఆగిన కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. అసలు పేరు షాజహాన్ అది కాలక్రమేణా షాజాపూర్ అయింది. గ్వాలియర్ రాజాస్థానం రూపొందించిన తరువాత నుండి ఇది జిల్లాగా చేయబడింది.
చరిత్ర
మార్చుజిల్లా గతంలో గ్వాలియర్ రాజాస్థానంలో జిల్లాగా ఉండేది. 1947లో గ్వాలియర్ సమైక్య భారతదేశంలో కలిపిన తరువాత షాజాపూర్ జిల్లా మధ్యభారత్ రాష్ట్రంలో విలీనం అయింది. 1956 జనవరి 1 తరువాత మధ్యభారత్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగం అయింది.
భౌగోళికం
మార్చుజిల్లా మొత్తం దక్షిణ పీఠభూమిలో భాగం. ప్రభాతి నదీతీరంలో సారవంతమైన భూమి ఉంది. జిల్లాలో నల్లరేగడి మట్టి అధికంగా ఉంది. షాజాపూర్ మధ్యప్రదేశ్, రీవా మైదానంలో భాగం.
అగర్- మాల్వా (బైజనాథ్ ధాం )
మార్చుబైజనాథ్ ధాం జిల్లా పశ్చిమ భాగంలో ఉంది. ఇది అగర్- మాల్వా తాలూకాలో అధికభాగం ఆక్రమించుకుని ఉంది. బదాద్ పట్టణానికి పశ్చిమంలో ఉత్తర దక్షిణ దుశలుగా కొండప్రాంతం ఉంది. కొండల మధ్య జలప్రావాల కారణంగా భూమి ఊచకోతకు గురైంది. ఈ భూభాగం ఎత్తు సముద్రమట్టానికి 500 - 545 మీ వైవిధ్యం ఉంటుంది. ప్రధానజలప్రవాహాలుగా ధుధలి, కచోలి ఉన్నాయి. చోటీ కాలి సింధ్ నిరంతరంగా ప్రవహిస్తుంటుంది.
ఎగువ అరణ్యం
మార్చుజిల్లా మధ్యభాగంలో ఉత్తర దక్షిణాలుగా అగర్- మాల్వా, షాజాపూర్ తాలూకా, సుసెనర్ తాలూకాలో కొంతభూభాగం ఉంది. ఇది మాల్వా పీఠభూమిలో భాగం. ఈ భూభాగం అంతా పర్వాతావళి ఉంది. భూభాగం ఎత్తు సముద్రమట్టానికి 450-530 మీ వైవిధ్యంలో ఉంటుంది. భూభాగం ఉత్తరంగా ఏటావాలూగా సాగుతుంది. ఈ ఎగువభూమిలో పలు జలప్రవాహాలు జన్మించి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఉన్నాయి. వీటిలో లకుందర్, అహు ప్రధాన ప్రవాహాలు. ఇవి దణిణం నుండి ఉత్తరంగా ప్రవహిస్తున్నాయి. ఈ ప్రవాహాలు లకుందర్ ఎడమ తీరంలో కలిస్తున్నాయి. అహు నది భుభాగానికి పశ్చిమ సరిహద్దులో ప్రవహిస్తుంది. కొండప్రాంతం అరణ్యంతో కప్పబడి ఉంది.
కాళీసింధ్ మైదానం
మార్చుకాళీ సింధ్ మైదానం జిల్లా ఉత్తర, దక్షిణ తీరాలలో ఉంది. సుసేర్, షాజాపూర్ తాలూకాల భూభాగాలు, అగార్ తాలూకాలో కొంతభాగం ఆక్రమించి ఉంది. దక్షిణ భాగం కొండప్రాంతం, ఉత్త భూభాగం మైదానంగా ఉంది. భూభాగం ఎత్తు సముద్రమట్టానికి 450-528 మీ వైవిధ్యంలో ఉంటుంది. కొండ ప్రాంతం నుండి పలు జలప్రావాహాలు ఆరంభం ఔతాయి. వీటిలో కాళీ సింధ్ ప్రధానమైనది. ఇది తూర్పుగా ప్రవహిస్తుంది. కాళీ నది ఉపనది లకుందర్ ఉత్తరంగా ప్రవహిస్తుంది. భూభాగం ప్రధాన నది కాంథల్.
షాజాపూర్ ఎగువభూములు
మార్చుజిల్లా తూర్పు భూభాగం ఎగువభూములు షుల్జాపూర్తాలూకా, షాజాపూర్ తాలూకాలోని కొంతభాగం ఉన్నాయి. ఇది మాల్వా భూభాగంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉత్తర దక్షిణాలుకా పర్వతశ్రేణి సాగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దిగువగా ఉంటింది. దక్షిణంలో ఉన్న పర్వత భూభాగం పలు జలప్రవాహాల కారణంగా ఊచకోతకు గురైంది. భూభాగం ఎత్తు సముద్రమట్టానికి 435-507 మీ వైవిధ్యంలో ఉంటుంది. భూభాగం తూర్పు భాగం దిగువగా ఉంటుంది. భూభాగంలో నెవాజ్, ప్రభాతి నదులు ప్రవహిస్తున్నాయి. రెండు నదులు ఉత్తరంగా ప్రవహిస్తుంటాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,512,353,[1] |
ఇది దాదాపు. | గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | హవాయ్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 330వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 224 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.17%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 939: 1000[1] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 70.17%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gabon 1,576,665
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Hawaii 1,360,301