షామిందా ఎరంగా

శ్రీలంకకు చెందిన క్రికెటర్

రణవీర ముదియన్సెలగే షామిందా ఎరంగా, శ్రీలంకకు చెందిన క్రికెటర్.

షామిందా ఎరంగా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రణవీర ముదియన్సెలగే షామిందా ఎరంగా
పుట్టిన తేదీ (1986-06-23) 1986 జూన్ 23 (వయసు 38)
చిలావ్, శ్రీలంక
మారుపేరుషమీ
ఎత్తు5 అ. 10 అం. (1.78 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 118)2011 సెప్టెంబరు 16 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2016 జూన్ 9 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 147)2011 ఆగస్టు 16 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2016 జూన్ 16 - ఐర్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 6)2012 ఆగస్టు 7 - ఇండియా తో
చివరి T20I2013 మార్చి 31 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
Chilaw Marians
Tamil Union
Basnahira North
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20
మ్యాచ్‌లు 19 19 3
చేసిన పరుగులు 193 34 6
బ్యాటింగు సగటు 12.86 11.33 6.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 45* 12* 6
వేసిన బంతులు 3,891 716 66
వికెట్లు 57 21 3
బౌలింగు సగటు 37.50 32.66 30.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/49 3/46 2/30
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 5/– 1/–
మూలం: Cricinfo, 2016 జూన్ 16

రణవీర ముదియన్సెలగే షామిందా ఎరంగా 1986, జూన్ 23న శ్రీలంకలోని చిలావ్ లో జన్మించాడు. చిలావ్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో చదివాడు.

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

2011 ఆగస్టు 16న హంబన్‌టోటాలోని మహింద రాజపక్స అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక తరపున వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[1]

2011 సెప్టెంబరు 16న టెస్ట్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. తన మొదటి బంతికే వికెట్ తీశాడు, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అలా చేసిన 15వ ఆటగాడిగా నిలిచాడు.[2]

తన వెన్నునొప్పి కారణంగా అతను తన టెస్టు అరంగేట్రం తర్వాత క్రమం తప్పకుండా జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. తదుపరి అంతర్జాతీయ మ్యచ్ చాలాకాలం తర్వాత 2012 ఆగస్టులో భారత జట్టుతో తన ట్వంటీ 20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

దేశీయ క్రికెట్

మార్చు

శ్రీలంక ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో నాగేనహిర నాగాస్ తరపున ఆడాడు. తన బౌలింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని గెలుచుకున్నాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Shaminda made his ODI debut against Australia". ESPNcricinfo. Retrieved 2023-08-21.
  2. "Sri Lanka makes early inroads". The Hindu. September 16, 2011. Retrieved 2023-08-21.
  3. "SLPL – a comprehensive review". Island Cricket. Retrieved 2023-08-21.[permanent dead link]

బాహ్య లింకులు

మార్చు