షాహిద్ కపూర్ సినిమాల జాబితా

షాహిద్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. సినీరంగంలోకి  రాకముందు షైమక్ దావర్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో డాన్సర్ గా పని చేసేవారు. దిల్ తో పాగల్ హై(1997), తాళ్(1999) వంటి సినిమాల్లో నేపధ్య నృత్య కళాకారునిగా కనిపిస్తారు.[1] ప్రముఖ గాయకుడు కుమార్ సను వంటి వారి దగ్గర ఎన్నో మ్యూజిక్  వీడియోలలో కూడా చేశారు  షాహిద్. కెన్ గోష్ దర్శకత్వం వహించిన ఇష్క్ విష్క్(2003) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన.[2][3] ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా షాహిద్ నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలింఫేరు ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారం కూడా లభించడం విశేషం.[4][5]

Shahid Kapoor is smiling at the camera.
2012లో తేరీ మేరీ కహానీ సినిమా ప్రచార కార్యక్రమంలో షాహిద్.

తరువాతి రెండేళ్ళలో షాహిద్ కు చిన్న చిన్న విజయాలు మాత్రమే దక్కాయి. ఆయన నటించిన ఫిదా(2004), షిఖర్(2005) సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.[6] 2006లో ఆయన మూడు సినిమాల్లో నటించారు. కరీనా కపూర్ తో కలసి 36 చైనా టౌన్, చుప్ చుప్ కే, అమృతా రావు  సరసన వివాహ్ సినిమాల్లో నటించారు ఆయన. సూరజ్ భాటియా  దర్శకత్వంలో వచ్చిన వివాహ్ సినిమా మంచి విజయం సాధించింది.[7][8] ఆ తరువాతి ఏడాది కరీనాతో కలసి జబ్ వియ్ మెట్ సినిమాలో చేశారు షాహిద్. ఈ సినిమా హిట్ కావడమే కాక, ఆయనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ కూడా లభించింది.[5] 2008లో విద్యా బాలన్ సరసన కిస్మత్ కనెక్షన్ సినిమాలో నటించారు షాహిద్. 2009లో విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో  కమీనే సినిమాలో కవలలుగా ద్విపాత్రాభినయం చేశారు ఆయన. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.[9][10]

మూలాలు

మార్చు
  1. Bhattacharya, Roshmila (14 January 2010).
  2. "All smiles and success.
  3. "Amrita Rao wishes Shahid Kapoor on his 'asli viva'".
  4. Lalwani, Vickey (18 August 2004).
  5. 5.0 5.1 Khan, Ujala Ali (27 January 2015).
  6. Tuteja, Joginder (18 June 2012).
  7. Joshi, Tushar P (10 February 2015).
  8. Athique, Adrian; Hill, Douglas (17 December 2009).
  9. "Shahid Kapoor and Vishal Bhardwaj team up for Kaminey 2".
  10. Lalwani, Vickey (10 March 2009).

బయటి లింకులు

మార్చు