షాహిద్ కపూర్ (జననం 25 ఫిబ్రవరి 1981), ప్రముఖ బాలీవుడ్ నటుడు. నటులు పంకజ్ కపూర్, నీలిమ అజీంల కుమారుడు. ఆయన ఢిల్లీలో జన్మించారు. షాహిద్ 3వ ఏట తల్లిదండ్రులు విడిపోయారు.  ఆప్పట్నుంచీ ఆయన తన తల్లి వద్దే పెరిగారు. ఆయన 10వ ఏట ముంబైకు మారిపోయారు. అక్కడ షైమక్ డవర్ డ్యాన్స్ అకాడమీలో  చేరారు షాహిద్. 1990ల్లో కొన్నిసినిమాల్లో నేపథ్య డ్యాన్సర్ గా పనిచేశారు ఆయన. ఆ తరువాత కొన్ని మ్యూజిక్ వీడియోల్లోనూ, టీవీ  ప్రకటనల్లోనూ నటించారు షాహిద్.

షాహిద్ కపూర్
2017లో షాహిద్ కపూర్
జననం (1981-02-25) 1981 ఫిబ్రవరి 25 (వయసు 43)
న్యూ ఢిల్లీ, భారతదేశం
ఇతర పేర్లుషాహిద్ కపూర్
షాహిద్ ఖట్టర్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1997–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
మీరా రాజ్‌పుత్
(m. 2015)
పిల్లలు2
తల్లిదండ్రులుపంకజ్ కపూర్
నీలిమా అజీమ్
బంధువులుఇషాన్ ఖట్టర్ (సవతి సోదరుడు)
సుప్రియా పాఠక్ (సవతి తల్లి)

2003లో ఇష్క్ విష్క్ సినిమాతో తెరంగేట్రం చేసిన షాహిద్ ఆ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించినా అవేవీ విజయం సాధించలేదు. 2006లో అమృతా రావుతో కలసి నటించిన వివాహ్ సినిమా హిట్ అయింది. జబ్ వియ్ మెట్ (2007), కమీనే (2009) సినిమాల్లోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్స్ లభించాయి ఆయనకు. 2013 వరకు సరైన విజయం లేని షాహిద్ ఆ ఏడాది నటించిన ఆర్.. రాజ్ కుమార్ సినిమా అతి ఎక్కువ వసూళ్ళు సాధించింది. 2014లో ఆయన నటించిన హైదర్ సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు షాహిద్. 2016లో ఉడ్తా పంజాబ్ లో నటించారు ఆయన.

అత్యంత ఆకర్షణీయ భారతీయ సెలబ్రిటీగా మీడియాలో ప్రముఖమయ్యారు షాహిద్. సినిమాలు వరుసగా పరాజయం పాలవుతున్న సమయంలో కూడా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు ఆయనకు. మొదట్లో ఎక్కవగా రొమాంటిక్ పాత్రలే చేసినా తరువాత యాక్షన్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చారు షాహిద్. ఫిలింఫేర్ పురస్కారాలతో పాటు ఇతర పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయన. షాహిద్ దాత కూడా. అవార్డు ఫంక్షన్లకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఝలక్ ధికలాజా రీలోడెడ్ (2015) డ్యాన్స్ షోకు ఆయన న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. కొన్నాళ్ళు కరీనా కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్న ఆయన ఆమెతో విడిపోయాకా, ఢిల్లీకి చెందిన విద్యార్థిని మీరా రాజ్ పుత్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప.

తొలినాళ్ళ జీవితం

మార్చు

25 ఫిబ్రవరి 1981న ఢిల్లీలో జన్మించారు షాహిద్. తండ్రి పంకజ్  కపూర్ నటుడు, తల్లి నీలిమా అజీం డ్యాన్సర్.[1][2] ఆయన 3వ ఏటనే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి నటునిగా కొనసాగేందుకు ముంబై వెళ్ళిపోగా, తల్లితోనూ, అమ్మమ్మ, తాతయ్యలతోనూ ఢిల్లీలో ఉండేవారు షాహిద్.[3][4] ఆయన అమ్మమ్మ, తాతయ్యలు రష్యా పత్రిక స్పుత్నిక్ లో విలేకరిగా పనిచేసేవారు. ఆయనకు తన తాతయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు తనను రోజూ స్కూల్ కు తీసుకువెళ్ళేవారని, తన తండ్రికి, ఆయనకు మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఆయన రాసే ఉత్తరాలను తనకు చదివి వినిపించేవారనీ చెబుతారు షాహిద్.[3] ముంబైలో నటునిగా నిలదొక్కుకునేందుకు కష్టాలు అనుభవిస్తున్న ఆయన తండ్రి ప్రతీ ఏటా షాహిద్ పుట్టినరోజున మాత్రం ఆయన చూడటానికి ఢిల్లీ వచ్చేవారు.[3] ఆయన 10వ ఏట తల్లితో పాటు ముంబైకు మారిపోయారు. ఆమె నటిగా అయ్యేందుకు ముంబై వచ్చేశారు.[3]

ముంబై వెళ్ళాకా ఆయన తల్లి అజీం నటుడూ రాజేష్ ఖత్తర్ ను వివాహం చేసుకున్నారు.[4] 2001లో వారు విడిపోయేంతవరకూ షాహిద్ తల్లి, ఖత్తర్ లతోనే ఉండేవారు.[4] ఆయన పాస్ పోర్ట్ లో ఇప్పటికీ ఖత్తర్ ఇంటిపేరే ఉంటుంది.[5] ఢిల్లీలోని గ్యాన్ భారతి స్కూల్ లోనూ,  ముంబైలోని రాజహంస్ విద్యాలయలోనూ చదువుకున్నారు షాహిద్. ఆ తరువాత మూడేళ్ళ పాటు ముంబైలోని మిథిబాయ్ కళాశాలలో చదువుకున్నారాయన.[6] 

చిన్నతనం నుండే డ్యాన్స్ ఇష్టపడే షాహిద్ 15వ ఏట షైమక్ దవర్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లో చేరారు.[7] అక్కడ నేర్చుకునేటప్పుడే దవర్ నృత్య దర్శకత్వం వహించిన దిల్ తో పాగల్ హై (1997), తాళ్ (1999) సినిమాల్లో నేపథ్య డ్యాన్సర్ గా కనిపించారు ఆయన.[7] ఇన్స్టిట్యూట్ లో ఒకసారి వోగ్, గోల్డెన్ ఐ పాటలకు ఆయన చేసిన నృత్యాలకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. జీవితంలో మొదటిసారి స్టార్ అయ్యాను అనిపించింది అని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు షాహిద్. ఆ తరువాత అదే ఇన్స్టిట్యూట్ లో శిక్షకునిగా చేరారు. ఈ సమయంలోనే షారూఖ్ ఖాన్ కాజోల్, రాణీ ముఖర్జీలు చేస్తున్న పెప్సీ ప్రకటనలో నటించేందుకు షాహిద్ ఆడిషన్స్ కు వెళ్ళారు. కానీ గాయం కారణంగా ఆ విషయం అక్కడితోనే ఆగిపోయింది. ఆ తరువాత కిట్ కాట్, క్లోజప్ వంటి వాటి ప్రకటనల్లో నటించారు ఆయన. బాండ్ ఆర్యన్స్, కుమార్ సనుల మ్యూజిక్ వీడియోల్లోనూ నటించారు షాహిద్.[8] 1998లో తన తండ్రి దర్శకత్వం వహించిన మోహన్ దాస్ బి.ఎ.ఎల్.ఎల్.బి అనే సీరియల్ కు సహాయ దర్శకునిగా కూడా వ్యవహరించారు షాహిద్.[9]

నటించిన సినిమాలు

మార్చు

వెబ్‌సిరీస్

మార్చు

తొలినాళ్ళు (2003–05)

మార్చు
 
2004లో షాహిద్

ఆర్యన్ మ్యూజిక్ వీడియో ఆంఖోం మేలో షాహిద్ ను చూసిన నిర్మాత రమేష్ తౌరని ఆయనను తన సినిమాలో నటింపజేయాలని అనుకున్నారు.[10] ఆ తరువాత షాహిద్ ను కలిసిన రమేష్ సినిమాల్లో నటించడానికి ఆయన వయసు  సరిపోదనీ, శరీర ధారుడ్యం కూడా లేదనీ, ఇంక కొన్నాళ్ళు వేచి ఉండమనీ సలహా ఇచ్చారు. తౌరనితో పనిచేస్తానేమో అన్న ఊహతో అంతకుముందు ఎన్. చంద్రాకు ఒప్పుకున్న ఒక సినిమా నుంచి తప్పుకున్నారు షాహిద్. ఈ విషయం తెలిసిన తౌరని కెన్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఇష్క్ విష్క్ (2003) సినిమాలో ఆయనకు అవకాశం ఇప్పించారు. ఈ సినిమాలో నటించే ముందు విపరీతమైన వ్యాయామం చేసి శరీరం పెంచిన షాహిద్ నసీరుద్దీన్ షా, సత్యదేవ్ దూబేలతో కలసి నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "Happy Birthday Shahid Kapoor: Simply Shaandaar@35".
  2. Masand, Rajeev (19 November 2006).
  3. 3.0 3.1 3.2 3.3 Gupta, Priya (5 September 2013).
  4. 4.0 4.1 4.2 Olivera, Roshni K (30 November 2007).
  5. "Dual identities" Archived 2013-08-25 at the Wayback Machine.
  6. "Just how educated are Bollywood stars".
  7. 7.0 7.1 Bhattacharya, Roshmila (14 January 2010).
  8. "All smiles and success.
  9. "Cloak 'n' dagger".
  10. Gupta, Priya (20 September 2013).