షీలా దీక్షిత్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి

షీలా దీక్షిత్ (31 మార్చి 1938 – 20 జూలై 2019)[1] భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా 1998 నుండి 2013 వరకు పనిచేసింది. ఆమె అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మహిళా రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె భారత జాతీయ కాంగ్రెసు పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన మూడు వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఆమె ఢిల్లీ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. 2013 డిసెంబరులో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమెపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ విజయం సాధించాడు. అతను ఢిల్లీ ముఖ్యమంత్రి భాద్యతలను చేపట్టాడు.[2] 2017 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. తరువాత ఆమె ఉపసంహరించుకుంది. ఆమె 2019 జనవరి 10 న ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని చేపట్టింది.[3] ఆమె 2014 మార్చి 11న కేరళ గవర్నరు పదవిని చేపట్టింది. కానీ 2014 ఆగష్టు 25న ఆ పదవికి రాజీనామా చేసింది.

షీలా దీక్షిత్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి
In office
3 డిసెంబర్ 1998 – 8 డిసెంబర్ 2013
అంతకు ముందు వారుసుష్మా స్వరాజ్
తరువాత వారుఅరవింద్ కేజ్రివాల్
శాసనసభ సభ్యులు
న్యూఢిల్లీ
గోల్ మార్కెట్ (1998-2008)
In office
3 డిసెంబర్ 1998 – 8 డిసెంబర్ 2013
అంతకు ముందు వారుకీర్తి ఆజాద్
తరువాత వారుఅరవింద్ కేజ్రివాల్
పార్లమెంట్ సభ్యులు
కనౌజ్
In office
1984–89
అంతకు ముందు వారుచహోతేయ్ సింగ్ యాదవ్
తరువాత వారుచహోతేయ్ సింగ్ యాదవ్
భారత ప్రతినిధి బృందంలో సభ్యురాలు
మహిళల హోదా ఐక్యరాజ్యసమితి కమిషన్
In office
1984–89
ప్రధాన మంత్రిఇందిరాగాంధీ
రాజీవ్ గాంధీ
వ్యక్తిగత వివరాలు
జననం(1938-03-31)1938 మార్చి 31
కపుర్తల, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ భారతదేశం
మరణం2019 జూలై 20(2019-07-20) (వయసు 81)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామివినోద్ దీక్షిత్
సంతానం2
కళాశాలఢిల్లీ విశ్వవిద్యాలయం

ప్రారంభ సంవత్సరాలు

మార్చు

షీలా కపూర్ పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తల లో పంజాబ్ ఖత్రి కుటుంబంలో 1938 మార్చి 31న జన్మించింది[4]. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యనభ్యసించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రురాలైనది.[5]ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) గా పనిచేసిన వినోద్ దీక్షిత్ తో ఈమె వివాహం జరిగింది.

రాజకీయ జీవితం

మార్చు
 
ప్రధాన మంత్రి మోడీతో షీలా దీక్షిత్
 
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ రాష్ట్రపతికి ఒలింపిక్ జ్యోతిని అందజేస్తున్న చిత్రం

షీలా దీక్షిత్ 1984 నుండి 1989 వరకు ఉత్తర ప్రదేశ్ లోని కన్నౌజ్ పార్లమెంటు నియోజకవర్గం తరపున లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసింది.[6] పార్లమెంటు సభ్యురాలిగా ఆమె లోక్‌సభ లో అంచనాల కమిటీకి తన సేవలనందించింది. ఆమె భారతదేశ 40 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు, జవహర్‌లాల్ నెహ్రూ సంస్మరణ కార్యక్రమాల నిర్వహణ కమిటీలలో కూడా పనిచేసింది. ఆమె ఐదు సంవత్సారాలు (1984-1989) యునైటెడ్ నేషన్స్ ఆన్ స్టాట్యూస్ ఆఫ్ ఉమెన్ కు భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. ఆమె 1986-1989 మధ్య కాలంలో యూనియన్ మినిస్టరుగా కూడా తన సేవలనందించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు మొదటి మంత్రిణిగా పనిచేసింది. ఉత్తర ప్రదేశ్ లో మహిళలపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ఉద్యమించినందుకు గానూ ఆమె తన 82 సహచరులతో పాటు ఆగష్టు 1990లో 23 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించింది.[7]

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత పివి నరసింహారావుకు వ్యతిరేకంగా మరి ఆ తరువాత ఎన్.డి తివారీ నాయకత్వం 1994లో అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ) పేరుతో తిరుగుబాటు కాంగ్రెస్‌ను స్థాపించింది.

1970 ప్రారంభంలో ఆమె యంగ్ ఉమెన్స్ అసోసియేషన్ కు చైర్మన్ గా పనిచేసింది. ఢిల్లీలో మహిళల కొరకు రెండు వసతి గృహాలు ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించింది.[8] ఆమె ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్టుకు సెక్రటీగా కూడా భాద్యతలు చేపట్టింది.[9]

1998 పార్లమెంటు ఎన్నికలలో తూర్పు ఢిల్లీ పార్లెమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లాల్ బిహారీ తివారీ చేతిలో ఓడిపోయింది. తరువాత ఆమె 1998లో ఢిల్లీకి ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టి 2013వరకు 15 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగింది. ఆమె 1998, 2003 లలో గోలే శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించింది. 2008లో ఢిల్లీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందింది.[10]

2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీ అరవింద కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ చేతిలో ఓడిపోయింది. ఆమె ఢిల్లీ శాసనసభ నియోజక వర్గంలో పోటీ చేసి అరవింద కేజ్రీవల్ చేతిలో 25,864 ఓట్ల తేడాతో ఓడిపోయింది.[11][12] ఆమె 2013 డిసెంబరు 8న తన పదవికి రాజీనామా చేసింది. కానీ 3013 డిసెంబరు 28 వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగింది. ఆమె 2014 మార్చి లో కేరళ గవర్నరుగా భాద్యతలు చేపట్టింది. కానీ ఐదునెలల తరువాత రాజీనామా చేసింది.[13]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు ఉమా శంకర్ దీక్షిత్ కుమారుడైన వినోద్ దీక్షితును వివాహమాడింది. [14] అతను ఐ.ఎ.ఎస్ అధికారిగా పనిచేసాడు. అతను రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు తన భార్య, కుమారుని సమక్షంలో గుండెపోటుతో మరణించాడు.[15] ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ 15వ లోక్‌సభలో సభ్యునిగా ఉన్నాడు.ఆమె క్రమంగా పోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో చికిత్స పొందేది. 2018లో ఆమెకు ఫ్రాన్సు లోని యూనివర్శిటీ హాస్పటల్ లో గుండె శస్త్ర చికిత్స జరిగింది.

ఆమె 2019 జూలై 19న ఎస్కార్ట్స్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో వైద్య చికిత్స కోసం చేరింది. చేరిన తరువాత ఆమెను కొంత సేపు వెంటిలేటర్లలో ఉంచారు. ఆమె ఆరోగ్యం తాత్కాలికంగా కుదుటపడినప్పటికీ 2019 జూలై 20 న మద్యాహ్నం 3.55 కు గుండెపోటుతో మరణించింది.[16][17][18]

పురస్కారాలు

మార్చు
  • 2010: దారా శిఖా పురస్కారం - ఇండో-ఇరాన్ సొసైటీ [19]
  • 2013: ఢిల్లీ ఉమెన్ ఆఫ్ ద డెకేర్ ఆర్చివెర్స్ పురస్కారం 2013 [20]

మూలాలు

మార్చు
  1. News Galiyara (20 July 2019). "Three-Time Delhi's Chief Minister Sheila Dikshit passed away at 81". NewsGaliyara.com. Archived from the original on 20 జూలై 2019. Retrieved 20 July 2019.
  2. "Kerala Governor Sheila Dikshit resigns". 26 August 2014. Retrieved 31 August 2014.
  3. "Sheila Dikshit, 3-Time Chief Minister, Appointed Delhi Congress Chief". NDTV.com. Retrieved 2019-01-10.
  4. Iyer, Lakshmi (15 December 2003). "Metro Mater". India Today. Archived from the original on 2 డిసెంబరు 2013. Retrieved 21 జూలై 2019.
  5. "Sheila Dikshit: Profile". Express India. 10 December 2003. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 August 2012.
  6. Srinivasan, Chandrashekar (21 July 2019). "Sheila Dikshit, Chief Minister For 15 Years, Known For Transforming Delhi". NDTV. Retrieved 2019-07-21.
  7. "Did you know Sheila Dikshit was jailed for 23 days in 1990?". DNA India (in ఇంగ్లీష్). 2019-07-20. Retrieved 2019-07-21.
  8. DelhiJuly 20 (20 July 2019). "Sheila Dikshit passes away at 81: Facts about Delhi's longest-serving CM". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-07-21.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. "Heart filled with grief: Sonia Gandhi writes to Sheila Dikshit's son Sandeep". India Today (in ఇంగ్లీష్). 20 July 2019. Retrieved 2019-07-21.
  10. Team, BS Web (2019-07-20). "Life & times of Sheila Dikshit, the no-nonsense leader who modernised Delhi". Business Standard India. Retrieved 2019-07-21.
  11. "Who is Manjot Nayyar?: Sheila Dikshit asked on poll day, then in defeat said, 'Hum toh bewakoof hain'". Financial Express. 2013-12-12. Retrieved 2013-12-28.
  12. "Delhi election results 2013: As it happened". Zeenews.india.com. Archived from the original on 2013-12-30. Retrieved 2013-12-28.
  13. "Sheila Dikshit resigns as governor of Kerala". Firstpost. 27 August 2014. Retrieved 29 January 2016.
  14. "Sheila Dikshit: Profile". Hindustan Times. 30 January 2012.
  15. "Smt. Sheila Dikshit". Government of Delhi. Archived from the original on 14 ఆగస్టు 2012. Retrieved 21 జూలై 2019.
  16. died
  17. "Former Delhi CM Sheila Dikshit dead". Live Mint. 20 July 2019. Retrieved 20 July 2019.
  18. Thacker, Teena (20 July 2019). "Former Delhi CM Sheila Dikshit dead". Live Mint. Retrieved 20 July 2019.
  19. "Delhi CM Sheila Dikshit honoured with Dara Shikoh award". Indiatoday. PTI. 11 April 2010. Retrieved 4 July 2014.
  20. "'21st century is going to be the century of women'". The Hindu. 24 July 2013. Retrieved 4 July 2014.

బయటి లింకులు

మార్చు