షీలా నగర్ (విశాఖపట్నం)
షీలా నగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరానికి దక్షిణ భాగంలో ఉన్న ఒక శివారు ప్రాంతం.[1] ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది.
షీలా నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°43′08″N 83°12′08″E / 17.718959°N 83.202347°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530012 |
గురించి
మార్చుఈ ప్రాంతంలో పెద్దపెద్ద నివాస సముదాయాలు ఉన్నాయి. గాజువాక, ఎన్ఎడి ఎక్స్ రోడ్ వంటి ముఖ్య ప్రాంతాలతో సమీపంలో ఉండడంవల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖపట్నం నగరంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే రహదారులు, మురుగునీరు, తాగునీరు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఇక్కడ సౌకర్యవంతంగా ఉన్నాయి.
భౌగోళికం
మార్చుఇది 17°43′08″N 83°12′08″E / 17.718959°N 83.202347°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుతుంగలం, బిహెచ్‌పివి టౌన్‌షిప్, మిండి విలేజ్, ఆటో నగర్, అహ్మద్‌నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.
రియల్ ఎస్టేట్
మార్చుప్రస్తుతం షీలా నగర్‌లోని భూమికి ఎక్కువ డిమాండ్ ఉంది, భూమి ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి.[2] ఒఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్, విఎస్‌పి, నాపర్‌వా వంటి పిఎస్‌యుల ఉద్యోగులు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ప్రార్థనా స్థలాలు
మార్చుఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది.
వినోదం
మార్చుఈ ప్రాంతంలో ఎస్‌టిబిఎల్ సినీవర్ల్డ్ అనే మల్టీప్లెక్స్ ఉంది.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో షీలా నగర్ మీదుగా గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, కంచరపాలెం, ఆర్‌టిసి కాంప్లెక్స్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో గోపాలపట్నం రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
మూలాలు
మార్చు- ↑ "Sheela Nagar Locality". www.onefivenine.com. Retrieved 7 May 2021.
- ↑ "Price edge drives realty boom on Vizag outskirts". The Times of India. Hyderabad. 31 January 2012. Retrieved 7 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 7 May 2021.