ఎన్‌ఎడి ఎక్స్ రోడ్ (విశాఖపట్నం)

విశాఖపట్నం పరిసర ప్రాంతాలు

ఎన్‌ఎడి ఎక్స్ రోడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ప్రధాన జంక్షన్లలో, వాణిజ్య కేంద్రాలలో ఒకటి.[2] ఇక్కడ నావల్ ఆర్మేమెంట్ డిపో, నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీస్ ఉన్నందువల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు.[3]

ఎన్‌ఎడి ఎక్స్ రోడ్
సమీపప్రాంతం
ఎన్‌ఎడి ఎక్స్ రోడ్
ఎన్‌ఎడి ఎక్స్ రోడ్ is located in Visakhapatnam
ఎన్‌ఎడి ఎక్స్ రోడ్
ఎన్‌ఎడి ఎక్స్ రోడ్
విశాఖట్నం నగర పటంలో ఎన్‌ఎడి ఎక్స్ రోడ్ స్థానం
Coordinates: 17°44′32″N 83°14′07″E / 17.742131°N 83.235210°E / 17.742131; 83.235210
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530009
భారతదేశ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లుఏపి 39[1]

భౌగోళికం

మార్చు

ఇది 17°44′32″N 83°14′07″E / 17.742131°N 83.235210°E / 17.742131; 83.235210 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

వాణిజ్యం

మార్చు
 
ఎన్‌ఎడి రోడ్

విశాఖపట్నంలో రద్దీగా ఉన్న వాణిజ్య కేంద్రాలలో ఎన్ఎడి ఎక్స్ రోడ్ ఒకటి. ఇక్కడి ప్రాంత ప్రజల అవసరాలను తీర్చడానికి అనేక దుకాణాలు ఉన్నాయి. రేమండ్, రీబాక్, నైక్‌ వంటి దుకాణాలకు చెందిన శాఖలు ఇక్కడ ఉన్నాయి. మారుతి, హీరో హోండా వంటి ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల దుకాణాలు కూడా ఉన్నాయి.[4]

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఎన్‌ఎడి ఎక్స్ రోడ్ మీదుగా గాజువాక, సింహాచలం, అసిల్ మెట్ట, పెందుర్తి, మద్దిలపాలెం, హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు, ఖమ్మం, నరసాపురం, భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, శ్రీకాకుళం, పలాస మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

చదువు

మార్చు

ఎన్ఎడి ఎక్స్ రోడ్ ప్రాంతంలో అనేక విద్యాసంస్థలు, కోచింగ్ - శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చే రామనాథ్ మాధ్యమిక పాఠశాల కూడా ఇక్కడ ఉంది.

మూలాలు

మార్చు
  1. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 15 May 2021.
  2. "N.a.d Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  3. "Ward Profile | Page 4 | Greater Visakhapatnam Municipal Corporation". visakhapatnam.cdma.ap.gov.in. Archived from the original on 6 ఫిబ్రవరి 2020. Retrieved 15 May 2021.
  4. "Nad Colony Locality". www.onefivenine.com. Retrieved 16 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 16 May 2021.