షెరిల్ పింటో ఒక భారతీయ మాజీ నటి, ఆమె ప్రధానంగా తమిళ చిత్రాలలో నటించింది. ఎంగల్ ఆసన్ (2009), వాడా (2010)లతో సహా ఇతర చిత్రాలలో నటించిన ఆమె విజయకాంత్ కలిసి అరసంగం (2008)తో తన అరంగేట్రం చేసింది.[1]

షెరిల్ పింటో
జననం (1986-02-02) 1986 ఫిబ్రవరి 2 (వయసు 38)
ఇతర పేర్లుషెరిల్ బ్రిండో
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2008–2010

కెరీర్

మార్చు

షెరిల్ పింటో రమణ మాధేష్ దర్శకత్వం వహించిన తమిళ భాషా చిత్రం అరసంగం (2008)లో విజయకాంత్, నవనీత్ కౌర్‌లతో కలిసి నటించింది. ఎంగల్ ఆసన్ (2009)లో విజయకాంత్‌తో కలిసి తిరిగి నటించింది.[2] ఆమె తెలుగు భాషా చిత్రం సత్యమేవ జయతే (2009)లో కూడా నటించింది.[3] 2011లో, ఆమె కల్లూరి దేశం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడానికి సంతకం చేసింది, కానీ అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం ఆగిపోయింది. 2012లో, ఆమె రమేష్ అరవింద్ సరసన శక్తి చిదంబరం రూపొందించిన మచాన్‌లో నటించింది. అయితే, ఈ చిత్రం కూడా విడుదల కాలేదు.[4][5]

మూలాలు

మార్చు
  1. "Sheryl Brindo - Filmography, Movies, Photos, Biography, Wallpapers, Videos, Fan Club, Popcorn.oneindia.in". Archived from the original on 23 జూలై 2012. Retrieved 20 ఏప్రిల్ 2012.
  2. "Sheryl Brindo with Vijayakanth again". IndiaGlitz.com. 16 May 2008. Retrieved 26 July 2020.
  3. "Satyameva Jayate progressing in RFC". filmibeat.com. 28 November 2008. Retrieved 26 July 2020.
  4. Nikhil, Raghavan (25 May 2013). "Etcetera: A comeback of sorts". The Hindu. Retrieved 26 July 2020.
  5. "Ramesh Aravind minus Kamal Haasan". The New Indian Express. 28 April 2012. Retrieved 26 July 2020.