షేక్ బుడాన్ బేగ్

(షేక్‌ బుడాన్‌ బేగ్‌ నుండి దారిమార్పు చెందింది)

షేక్‌ బుడాన్‌ బేగ్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్‌.

షేక్‌ బుడాన్‌ బేగ్‌
టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్‌ [1]
In office
2017 – 19
వ్యక్తిగత వివరాలు
జననంఖమ్మం జిల్లా
రాజకీయ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
తెలుగుదేశం పార్టీ ( 2018 - 2021)
నివాసంఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
వృత్తిరాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

షేక్‌ బుడాన్‌ బేగ్‌ ఖమ్మం జిల్లాలో జన్మించాడు. ఆయన వరంగల్‌లో ఆర్‌ఈసీ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

షేక్‌ బుడాన్‌ బేగ్‌ విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ ( ఆర్‌ఎస్‌యూ )లో క్రియాశీలకంగా పని చేశాడు. ఆయన సీపీఐలో పని చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో 2012లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.షేక్‌ బుడాన్‌ బేగ్‌ 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2016 నుండి 2018 వరకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడిసి)ఛైర్మన్‌గా పని చేశాడు.[2] షేక్‌ బుడాన్‌ బేగ్‌ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో 28 నవంబర్ 2018లో తెలుగుదేశం పార్టీ లో చేరాడు.[3] ఆయన తిరిగి 2020లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరాడు.

మరణం మార్చు

షేక్‌ బుడాన్‌ బేగ్‌ 17 మే 2021లో కరోనా సోకడంతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.[4][5]

మూలాలు మార్చు

  1. Sakshi (2 March 2017). "పది కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు". Sakshi. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  2. India Today (1 March 2017). "Chairmen to state run corporations appointed by Tgana govt". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  3. The Hans India (26 November 2018). "TSIDC chairman Baig likely to say bye-bye to TRS". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  4. Namasthe Telangana (17 May 2021). "కరోనాతో టీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు మృతి". Namasthe Telangana. Archived from the original on 15 జూన్ 2021. Retrieved 15 June 2021.
  5. The Hindu (17 May 2021). "Senior TRS leader no more". The Hindu (in Indian English). Archived from the original on 17 మే 2021. Retrieved 15 June 2021.