షేర్షా 2021లో విడుదలైన హిందీ సినిమా. ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై యష్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ నిర్మించిన ఈ సినిమాకు విష్ణువర్థన్‌ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, శివ్‌ పండిట్‌, నిఖిత్‌ ధీర్, హిమాన్షో, అనిల్‌ చరణ్‌జీత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 25,[1] 2021న విడుదల చేసి, 12 ఆగష్టు 2021న అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమాను విడుదల చేశారు.ఈ సినిమా పరమ్‌ వీర్‌ చక్ర అవార్డు పొందిన కెప్టెన్‌ విక్రమ్‌ భాత్రా జీవిత కథ ఆధారంగా నిర్మించారు.

షేర్షా
దర్శకత్వంవిష్ణువర్థన్‌
రచనసందీప్‌ శ్రీవాత్సవ
నిర్మాతయష్‌ జోహార్‌
కరణ్ జోహార్
అపూర్వ మెహతా
షబ్బీర్‌
అజయ్‌ షా
హిమాన్షు గాంధీ
తారాగణంసిద్ధర్థ్ మల్హోత్రా
కియారా అడ్వాణీ
ఛాయాగ్రహణంకమల్‌జీత్‌ నేగి
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంనేపథ్య సంగీతం:
జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి
పాటలు
తనిష్‌బాగ్చి
బి ప్రాక్‌
జానీ
జస్లీన్‌ రాయల్‌
జావేద్‌ మోషిన్‌
విక్రమ్‌ మంత్రోస్
నిర్మాణ
సంస్థలు
ధర్మ ప్రొడక్షన్స్
కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రై
విడుదల తేదీ
2021 ఆగస్టు 12 (2021-08-12)
సినిమా నిడివి
135 నిమిషాలు
దేశం భారతదేశం
భాషహిందీ

కథ మార్చు

విక్రమ్‌ బాత్రా (సిద్ధార్థ్‌ మల్హోత్రా) చిన్నతనం నుంచే ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనీ కలలు కంటూ అందుకు సిద్ధమవుతుంటాడు. ఈ క్రమంలోనే ఆయన డింపుల్ (కియారా అద్వానీ)తో ప్రేమలో పడతాడు. వారి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడతాడు. ఆర్మీలో చేరాలనే తన కల కోసం ప్రేమను పక్కకు పెట్టి సైన్యంలో చేరతాడు. ఆర్మీ బెటాలియన్‌ లో చేరాక కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు విక్రమ్‌ శత్రు సైన్యంతో ఎలా పోరాడాడు? భారత జాతీయ జెండాను సగర్వంగా ఎగిరేలా చేసేందుకు విక్రమ్ చేసిన త్యాగం ఏంటి? చివరకు విక్రమ్ కథ ఎలా ముగిసింది? విక్రమ్ తన ప్రేమను పొందాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

  • సిద్ధార్థ్‌ మల్హోత్రా
  • కియారా అడ్వాణీ
  • శివ పండిట్
  • నిఖిత్‌ ధీర్
  • హిమాన్షో
  • అనిల్‌ చరణ్‌జీత్‌
  • రుక్మన్ ఖన్నా
  • శతాఫ్ ఫిగర్
  • సాహిల్ వైద్
  • రాజ్ అర్జున్
  • అంకిత గోరయ
  • రాకేష్ దుబె
  • అభిరోయ్ సింగ్
  • ప్రణయ్ సింగ్ పచౌరి
  • రహాయో
  • పవన్ చోప్రా
  • మీర్ సర్వార్

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాతలు: యష్‌ జోహార్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా, షబ్బీర్‌, అజయ్‌ షా, హిమాన్షు గాంధీ
  • కథ, స్క్రీన్ ప్లే: సందీప్‌ శ్రీవాత్సవ
  • దర్శకత్వం: విష్ణువర్థన్‌
  • సంగీతం: తనిష్‌బాగ్చి
    బి ప్రాక్‌
    జానీ
    జస్లీన్‌ రాయల్‌
    జావేద్‌ మోషిన్‌
    విక్రమ్‌ మంత్రోస్
  • సినిమాటోగ్రఫీ: కమల్‌జీత్‌ నేగి
  • ఫ్యాషన్ కాస్ట్యూమ్ డిజైనర్: ఏకా లఖాని

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మార్చు

2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో షేర్షా ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది.

మూలాలు మార్చు

  1. EENADU (26 July 2021). "కార్గిల్‌ వార్‌ హీరో కథ.. ట్రైలర్‌ వచ్చేసింది". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
  2. Eenadu (12 August 2021). "రివ్యూ: షేర్షా". Archived from the original on 13 August 2021. Retrieved 13 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=షేర్షా&oldid=3891380" నుండి వెలికితీశారు