షో
2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా
ప్రసిద్ధ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె మంజుల ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో, 17 లక్షల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.[1]
షో (2002 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | నీలకంఠ |
---|---|
నిర్మాణం | మంజులా స్వరూప్ |
రచన | నీలకంఠ |
తారాగణం | మంజులా స్వరూప్, సూర్య |
సంగీతం | రాజ్ |
సంభాషణలు | నీలకంఠ |
ఛాయాగ్రహణం | అనిల్ యాదవ్ |
కూర్పు | అనిల్ మల్నాడ్ |
నిర్మాణ సంస్థ | ఇందిరా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 13 సెప్టెంబరు 2002 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చురాధిమ (మంజుల) ఢిల్లీలోని ఒక పెద్ద మందుల కంపెనీ ఉన్నతోద్యోగిని. ఆమె పేటెంట్ విషయమై ఆంధ్రప్రదేశ్‌లో ఒక మారుమూల పల్లెలోని ఒక ప్రొఫెసర్‌ను కలవడానికి వస్తుంది. ఆ సమయానికి ప్రొఫెసర్ వేరే ఊరు వెళతాడు. పేటెంట్ వ్యవహారాలు చూసే జూనియర్ లాయర్ మాధవరావు అదే సమయంలో అక్కడికి వస్తాడు. రాధిమ ఒక పెళ్ళి కాని సరదా యువతి. మాధవరావు వైవాహిక జీవితంలో విసిగిపోయిన వ్యక్తి. ఆ పాత్రల మధ్య నడచే సన్నివేశాలే ఈ సినిమా ఇతివృత్తం.