నీలకంఠ
నీలకంఠ ఒక ప్రముఖ సినీ దర్శకుడు.[1] షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. [2] విరోధి అనే సినిమాకు నంది పురస్కారం లభించింది. మిస్సమ్మ, మిస్టర్ మేధావి, నందనవనం 120 కి.మీ ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు.
నీలకంఠ | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, రచయిత |
పురస్కారాలు | జాతీయ పురస్కారం, నంది అవార్డు |
జీవితం
మార్చునీలకంఠ స్వస్థలం కడప.[3] తండ్రి నీటిపారుదల శాఖలో ఇంజనీరుగా పనిచేసేవాడు. బడిలో ఉండగానే మార్గరెట్ అనే ఉపాధ్యాయురాలు స్ఫూర్తితో తరగతి పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు చదవడం కూడా అలవాటైంది. అలా హాస్యకరమైన (కామిక్) పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇనిబ్ బ్లెటెన్ అనే రచయిత వయసు వారీగా పుస్తకాలు ఉంటే వాటిని వరసగా చదివేశాడు. తర్వాత నేరము , ఉత్కంఠ కథలు, నవలలు చదవడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా సినిమాలు చూడటం ప్రారంభమైంది.
విజయవాడలోని లయోలా పబ్లిక్ స్కూల్, ఆంధ్రా లయోలా కళాశాలలో చదువుకున్నాడు. నీలకంఠ అన్నయ్యకు చిత్రలేఖనం హాబీ. ఇద్దరూ కలిసి సినిమాలి చూసేవాళ్ళు. అతను నీలకంఠతో దర్శకుల గురించి మాట్లాడేవాడు. అలా పాఠశాల రోజులనుంచే సినిమా దర్శకత్వం పట్ల శ్రద్ధ ఆయన డిగ్రీ పూర్తి కాగానే చెన్నై వైపు నడిపించింది. పద్దెనిదో ఏటనే భారత్ పాక్ నేపథ్యంలో ఒక కథ రాశాడు. అది స్నేహితులు చదివి మెచ్చుకున్నారు. తనకు సినిమా వృత్తి అయితే బాగా సరిపోతుందనుకున్నాడు.[4] కె. బాలచందర్ స్ఫూర్తితో దర్శకుడు కావాలనుకున్నాడు.
కెరీర్
మార్చుసినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత వల్లభనేని జనార్ధన్ దగ్గర కొన్ని సినిమాలకు సహాయకుడిగా పని చేశాడు. కృష్ణ హీరోగా భారతీరాజా దర్శకత్వంలో జమదగ్ని అనే సినిమాను మరికొంతమందితో కలిసి నిర్మించాడు. కానీ అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తర్వాత రేవతి కథానాయికగా తమిళంలో ప్రియాంక అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది హిందీ సినిమా దామినికి పునర్నిర్మాణం. ఈ సినిమాకు రేవతికి ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత చాలా సినిమాలకు రీమేక్ చేయమంటూ అవకాశాలు వచ్చాయి కానీ రీమేక్ దర్శకుడనిపించుకోవడం ఇష్టం లేక వాటన్నింటినీ వదులుకున్నాడు. అలా మళ్ళీ అవకాశం కోసం ఏడేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది.
తెలుగులో సొంతంగా కథతో ప్రయోగం చేయాలనుకున్నాడు. పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదివి దాని స్ఫూర్తితో కేవలం రెండే పాత్రలతో ఒక కథ తయారు చేసుకున్నాడు. ఆ కథను అప్పటికే ఓ చిన్న సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్న నటుడు కృష్ణ కుమార్తె మంజులకు వివరించాడు. ఆమెకు ఐడియా నచ్చి నిర్మించడానికి ఒప్పుకుంది. అలా తయారైందే షో సినిమా.
సినిమాలు
మార్చుసంవత్సరం | చలన చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1994 | ప్రియాంక | దర్శకుత్వం | తమిళం | హిందీ చిత్రం దామిని– లైట్నింగ్ కి పునఃనిర్మాణం |
2002 | షో | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | రెండు జాతీయ పురస్కారాలు గెలుపొందారు |
2003 | మిస్సమ్మ | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | నాలుగు నందీ పురస్కారాలు గెలుపొందారు
న |
2005 | సదా మీ సేవలో | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | |
2006 | నందనవనం 120 కి.మీ. | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | |
2008 | మిస్టర్ మేధావి | దర్శకుత్వం | తెలుగు | |
2009 | ఈనాడు | సంభాషణలు | తెలుగు | |
2011 | విరోధి | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - 2011 లో ప్రదర్శించబడింది
రెండు 2011 నందీ పురస్కారాలు గెలుపొందారు మెల్బోర్న్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ -2011 లో ప్రదర్శించబడింది[5] |
2013 | చమ్మక్ చల్లో | దర్శకుత్వం | తెలుగు | |
2014 | మాయ[6] | స్క్రీన్‌ప్లే, దర్శకుత్వం | తెలుగు | [7] |
2018 | దటీస్ మహాలక్ష్మీ | దర్శకుత్వం | తెలుగు | హిందీ చిత్రం క్వీన్ యొక్క పునఃనిర్మాణం |
2018 | జామ్ జామ్ | దర్శకుత్వం | మళయాళం |
పురస్కారాలు
మార్చు- జాతీయ చలన చిత్ర పురస్కారాలు
- తెలుగులో ఉత్తమ జాతీయ చలన చిత్రం – 2002 – షో
- ఉత్తమ స్క్రీన్‌ప్లే కి గాను జాతీయ పురస్కారం– 2002 – షో
- నందీ పురస్కారాలు
- ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం - షో (2001)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌కి గాను నందీ పురస్కారం - మిస్సమ్మ (2003)
- ఉత్తమ సంభాషణ రచయితకుగాను నందీ పురస్కారం - విరోధి (2011)
మూలాలు
మార్చు- ↑ "Biography". friday moviez. Archived from the original on 2016-04-10. Retrieved 2016-08-18.
- ↑ "Awards of Neelakanta". Cine Radham. Archived from the original on 2014-03-02. Retrieved 2016-08-18.
- ↑ "Interview with Neelakanta". Idle Brain.
- ↑ "ఆ ప్రేమకథే మలుపు తిప్పింది". ఈనాడు. ఈనాడు. Retrieved 10 November 2016.
- ↑ "IFFM neglected Telugu films". sisi enterprises. Archived from the original on 21 ఫిబ్రవరి 2015. Retrieved 19 జూన్ 2018.
- ↑ "For 'Maaya', Harshvardhan Rane follows caveman's diet". CNN-IBN. 17 January 2014. Archived from the original on 25 మే 2014. Retrieved 25 May 2014.
- ↑ "Maaya is Neelakanta's new film". action cut. Archived from the original on 2014-03-03. Retrieved 2018-06-19.
బయటి లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో నీలకంఠ పేజీ