షోనల్ రావత్ ఒక భారతీయ మాజీ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత.[2] ఆమె ఫెమినా మిస్ ఇండియా, 2003ను గెలుచుకుంది. ఆ తరువాత మిస్ ఆసియా పసిఫిక్, 2003కు వెళ్ళింది.[3][4] ఆమె జూమ్ నెట్వర్క్ టాక్ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఆమె ఒక వీజె.[5] బాలి సాగూ రీమిక్స్ చేసిన బిందియా చమ్కేగి అనే మ్యూజిక్ వీడియోకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది.

షోనాల్ రావత్
అందాల పోటీల విజేత
2012లో షోనాల్ రావత్
జననముకోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తిమోడల్, టెలివిజన్ ప్రెజెంటర్
ఎత్తు1.80 m[1]
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా ఆసియా-పసిఫిక్ 2003
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా ఆసియా-పసిఫిక్ 2003 (విజేత)
మిస్ ఆసియా పసిఫిక్ 2003 (1వ రన్నరప్)
మిస్ ఫ్రెండ్‌షిప్ (మిస్ టాలెంట్)
(మిస్ కాజీనియాలిటీ)
భర్త
కరణ్ వాట్స్
(m. 2013)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె తండ్రి ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, తల్లికి కోల్‌కాతాలో సొంత కిండర్ గార్టెన్ ఉంది. ఆమె తండ్రి పశ్చిమ బెంగాల్ లో నియమితులైనందున ఆమె రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పాఠశాలకు హాజరయింది, ఆమె లోరెటో హౌస్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసింది.

ఆమె కరణ్ వాట్స్ ను 2013లో వివాహం చేసుకుంది.[6]

కెరీర్

మార్చు

మోడలింగ్

మార్చు

ఆమె 2003లో ఫెమినా మిస్ ఇండియా గెలుచుకుంది. ఆ సంవత్సరంలో మిస్ ఆసియా పసిఫిక్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. జపాన్ టోక్యోలో జరిగిన 43వ పోటీలో రెండవ స్థానంలో నిలిచింది.[7] 2004లో, ఆమె ఉపెన్ పటేల్ కలిసి బిండియా చమ్కేగి అనే మెగా హిట్ వీడియోలో కనిపించింది. ఆ తరువాత, ఆమె సత్య పాల్ కోసం ప్రదర్శనలలో కనిపించే చురుకైన మోడల్ గా ఉంది.[8]

టెలివిజన్

మార్చు

హిందీ హాస్య ధారావాహిక ఆజ్ కే శ్రీమన్ శ్రీమతి లో ఐశ్వర్య సేన్ గా షోనల్ రావత్ నటించింది. సోనీ టీవీ హాస్య ఆధారిత రియాలిటీ షో ఛాంపియన్ చాల్బాజ్ నంబర్ 1 కు ఆమె ఆతిథ్యం ఇచ్చింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
శీర్షిక పాత్ర
ఛాంపియన్ చాల్బాజ్ నెం. 1 హోస్ట్
ప్లానెట్ బాలీవుడ్ హోస్ట్/ప్రెజెంటర్

మూలాలు

మార్చు
  1. "Shonal Rawat". Rediff. Retrieved 2021-06-30.
  2. "Fashion fad* Model Speak Shonal". The Hindu. India. 16 June 2006. Archived from the original on 1 April 2012.
  3. "Femina Miss India Shonal Rawat Bio". 16 June 2006. Archived from the original on 30 మార్చి 2012. Retrieved 19 ఆగస్టు 2024.
  4. "Catch-Up With The Past Miss Indias". The Times Of India. Archived from the original on 25 December 2010. Retrieved 11 December 2010.
  5. "Shonal Rawat – The Time of India". The Times of India. India. 15 February 2011. Archived from the original on 1 July 2012.
  6. "Year of the model wedding". Vogue India.
  7. "Femina Miss India". 16 June 2006.[permanent dead link]
  8. "Indian designs going places". The Hindu. India. 1 June 2004. Archived from the original on 29 September 2004.