షౌకత్ అజ్మీ
షౌకత్ అజ్మీ (షౌకత్ కైఫీ) (అక్టోబరు 21, 1926 - నవంబరు 22, 2019),[1] భారతీయ నాటకరంగ, సినిమా నటి. ఈమె భర్త ఉర్దూ కవి, సినీ గీత రచయిత కైఫీ అజ్మీ. ఇద్దరూ ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా), అభ్యుదయ రచయితల సంఘం (ఐడబ్ల్యుఎ) ల ముఖ్య నిర్వాహకులు. ఇవి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన సాంస్కృతిక విభాగాలు.
షౌకత్ అజ్మీ | |
---|---|
![]() ఉమ్రావ్ జాన్ (1981) సినిమాలో షౌకత్ | |
జననం | |
మరణం | 2019 నవంబరు 22 | (వయసు 93)
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు |
|
జీవితంసవరించు
షౌకత్ 1926, అక్టోబరు 21న హైదరాబాద్ రాష్ట్రంలోని ఉత్తరప్రదేశ్ వలస షియా ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి య్యాహ్సఖాన్ నిజాం సర్కార్ లో ఎక్సైజ్ అధికారిగా పనిచేసేవాడు. ఔరంగాబాద్‌లో పెరిగింది. అరబిక్, ఉర్దూ, ఆంగ్లం, తెలుగు భాషలను నేర్చుకుంది.
వ్యక్తిగత జీవితంసవరించు
చిన్న వయస్సులోనే ఉర్దూ కవి కైఫీ అజ్మీని ప్రేమించి, వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు బాబా అజ్మీ కెమెరామెన్, సినీ దర్శకుడు. నటి ఉషా కిరణ్ కుమార్తె తన్వి అజ్మీని వివాహం చేసుకున్నాడు. కుమార్తె షబానా అజ్మీ సినిమా నటి. కవి, చిత్ర గీత రచయిత జావేద్ అక్తర్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ముంబైలో స్థిరపడిన షౌకత్, కైఫీలు తమ జీవితంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో నిబద్ధత గల సభ్యుడిగా కైఫీ పనిచేశాడు. కైఫీ అభ్యర్థన మేరకు, అతను చనిపోయినప్పుడు పార్టీ సభ్యత్వ కార్డు అతనితో సమాధి చేయబడింది.
నాటకరంగంసవరించు
పృథ్వీ, ఇప్టా నాటకసంస్థలు రూపొందించిన గదర్, కిసాన్, కళాకార్, పైసా మొదలైన నాటకాల్లో నటించింది.
సినిమారంగంసవరించు
1950ల మధ్యలో కైఫీ సినీ రచయిత, గీత రచయితగా ముంబై సినిమా పరిశ్రమలో ప్రయత్నాలు ప్రారంభించాడు. కొంతకాలం తరువాత అతనికి అవకాశం వచ్చి, మంచి పాటలు రాసి, పాటల రచయితగా పేరు సంపాదించాడు. సినీ పరిశ్రమతో భర్తకు ఉన్న అనుబంధంతో షౌకత్ కి కూడా సినిమాల్లో నటించడానికి అవకాశం వచ్చింది. 1970ల్లో గరమ్ హవా సినిమాలో తొలిసారిగా నటించింది. షౌకత్ దాదాపు 12 సినిమాలలో, 12 నాటకాల్లో నటించింది. 2002లో సాథియా సినిమాలో చివరిసారిగా నటించింది. 2002లో కైఫీ అజ్మీ చనిపోయిన తరువాత, కైఫీ అండ్ ఐ నేను అనే ఆత్మకథ రాసింది. ఇది కైఫీ ఔర్ మెయిన్ అనే ఉర్దూ నాటకంగా మార్చబడింది. 2006లో కైఫీ అజ్మీ 4వ వర్ధంతి సందర్భంగా ముంబైలో ఈ నాటకం ప్రదర్శించబడింది.
సినిమాలుసవరించు
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2002 | సాథియా | బువా |
1988 | సలాం బాంబే! | వేశ్యాగృహం యజమాని |
1986 | అంజుమాన్ | |
1984 | లోరీ | |
1982 | బజార్ | హజన్ బి |
1981 | ఉమ్రావ్ జాన్ | ఖానుమ్ జాన్ |
1977 | ధూప్ చావోన్ | పండిట్ భార్య |
1974 | ఫాస్లా | పార్వతి ఎస్.చంద్ర |
1974 | గరమ్ హవా | జమీలా, సలీం మీర్జా భార్య |
1974 | జుర్మ్ ఔర్ సజా | రాజేష్ తల్లి |
1974 | ఓ మైనహీ | |
1973 | నైనా | శశి కపూర్ అత్త |
1970 | హీర్ రాంఝూ | |
1964 | హకీకాత్ |
మరణంసవరించు
షౌకత్ 2019, నవంబరు 22న ముంబై, జుహు ప్రాంతంలోని తన నివాసంలో మరణించింది.[2]
మూలాలుసవరించు
- ↑ Joshi, Namrata (22 November 2019). "Actor, writer, comrade Shaukat Kaifi passes away". The Hindu. Retrieved 26 March 2021.
- ↑ 10టివి, జాతీయం (23 November 2019). "షబానా అజ్మీ తల్లి నటి షౌకత్ అజ్మీ కన్నుమూత". Archived from the original on 26 March 2021. Retrieved 26 March 2021.
బయటి లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో షౌకత్ అజ్మీ పేజీ