సంకల్ప్ రెడ్డి

తెలుగు సినిమా రచయిత, దర్శకుడు.

సంకల్ప్ రెడ్డి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. ఘాజీ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించాడు. ఘాజీ సినిమా హీందీ, తమిళంలో కూడా విడుదలైంది.[1] 2018 లో అంతరిక్షం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

సంకల్ప్ రెడ్డి
Smriti Irani presenting the Rajat Kamal Award to Sankalp (Best Telgu Film) for the Feature film – GHAZI, at the 65th National Film Awards Function, in New Delhi.JPG
జాతీయ అవార్డు స్వీకరణ
జననంఅక్టోబరు 20, 1984
వృత్తితెలుగు సినిమా రచయిత, దర్శకుడు.
క్రియాశీల సంవత్సరాలు2014 – ప్రస్తుతం
జీవిత భాగస్వాములుకీర్తి
పిల్లలుదేవ్ కవిశ్, శ్యమంత్

జననం - విద్యాభ్యాసంసవరించు

సంకల్ప్ రెడ్డి 1984, అక్టోబరు 20న తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో జన్మించాడు.[2] 2006లో హైదరాబాదులోని సి.వి.ఆర్. కళాశాలో ఇంజనీరింగ్ పూర్తిచేసాడు. అనంతరం ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ లోని గ్రిఫ్ఫిత్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చదువుకున్నారు. ఆ చదువును మధ్యలోనే వదిలేసి ఆస్ట్రేలియాలోనే ప్రసిద్ధిపొందిన గ్రిఫిత్ ఫిల్మ్ స్కూల్లో చిత్ర దర్శకత్వంలో MFA ను (2009) చదివాడు.

వివాహంసవరించు

సంకల్ప్ రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ లో పనిచేస్తున్న కీర్తితో వివాహం జరిగింది. వీరికి దేవ్ కవిశ్, శ్యమంత్ అనే ఇద్దరు పిల్లలు.

సినిమారంగంసవరించు

సినిమారంగంలోకి రావడానికి ముందు 4 లఘుచిత్రాలను తీశాడు. సొంతంగా కథ రాసుకొని, ఘాజీ సినిమాను తీశాడు.

దర్శకత్వం వహించినవిసవరించు

  1. 2017 - ఘాజీ
  2. 2018 - అంతరిక్షం

మూలాలుసవరించు

  1. నమస్తే తెలంగాణ (25 January 2017). "ఫిబ్రవరి 17న ఘాజీ విడుదల". Retrieved 28 December 2017.
  2. బాలె, శ్రీనివాస్ (23 December 2018). "ప్రేమించాలనుకున్నా... ఏ అమ్మాయీ పడలేదు!". eenadu.net. ఈనాడు. Archived from the original on 24 December 2018.

ఇతర లంకెలుసవరించు